అన్వేషించండి

Brahmamudi Serial Today May 14th:  ‘బ్రహ్మముడి’ సీరియల్ : రాజ్‌ను ఇంటికి తీసుకొచ్చిన కళ్యాణ్‌ - ఇంట్లోంచి వెళ్లగొట్టిన కావ్య

Brahmamudi Today Episode: అందరూ కలిసి కష్టపడి రాజ్‌ను ఇంటికి తీసుకొస్తే.. కావ్య మాత్రం రాజ్‌ను ఇంట్లోంచి వెళ్లగొడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Brahmamudi Serial Today Episode: నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నాకు మా బావను అదే రామ్‌ను దూరం చేయలేవని అంటుంది యామిని. మా పెళ్లి అయ్యాక అసలు నీ ముఖం కూడా చూడకుండా చేస్తానని వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో కావ్య బాధపడుతుంది. తర్వాత అపర్ణ, కళ్యాణ్‌,అప్పు, ఇందిరాదేవి, స్వప్న వెళ్లి రాజ్‌ను కలుస్తారు.

రాజ్‌: నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి మీరేంటి మౌనంగా ఉన్నారు.

అపర్ణ: అంటే అది బాబు..

రాజ్‌: మీరు మాట్లాడకండి.. మిమ్మల్ని ఎంతో నమ్మాను.. మీ కొడుకు స్థానంలో ఉండి మీ పుట్టిన రోజు జరిపించాను. కానీ మీరు నన్ను చాలా బాధపెట్టారు.

ఇందిరాదేవి: చూడు రామ్‌ వీళ్లు నీతో నిజం దాచారు. కానీ అలా దాచేసి నీతో ఏదో చేయకూడని పని చేశారా..? అన్నదానమే కదా చేయించారు.

రాజ: అది నిజం  చెప్పి చేయించొచ్చు కదా..? కళావతి చెప్పకపోతే పెద్దావిడ అయ్యుండి ఈవిడైన ఎలా అబద్దం చెప్తుంది.

అపర్ణ: కళావతి నన్ను చూడగానే.. ఎవరో తెలియనట్టు ఉండటంతో నేను అలాగే ఉండిపోయాను బాబు

రాజ్‌: అదే ఎందుకు కళావతి ఈ విషయం నా దగ్గర దాచాల్సిన అవసరం ఏముంది..? అది మోసం కాదా..?    

ఇందిరాదేవి: కళావతి నీ దగ్గర నిజం దాచింది. నిజం చెప్పకపోవడం తప్పే అవుతుంది. అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం అవుతుంది. నా మనవరాలు నిన్ను మోసం చేయలేదు

రాజ్‌: కాస్త అర్థం అయ్యేట్టు చెప్పండి నాన్నమ్మగారు

అపర్ణ: ఇంకా అర్థం అయ్యేటట్టు అంటే ఎలా బాబు.. నువ్వే అర్థం చేసుకోవాలి.

స్వప్న: రామ్‌ నువ్వు ఇంకా నా చెల్లెలి మనసు అర్థం చేసుకోలేదా..? తను నిన్ను ప్రేమిస్తుంది.

రాజ్‌: అంటే ఇన్ని రోజులు కళావతి నాతో తిరిగింది..

ఇందిరాదేవి: నువ్వంటే ఇష్టంతోనే

రాజ్‌: నాతో కలిసి రెస్టారెంట్లకు తిరిగింది

కళ్యాణ్‌ నువ్వంటే ప్రేమ ఉంది కాబట్టి

రాజ్‌: అంటే నేను ఇచ్చిన చీరను కట్టుకుంది

అపర్ణ: నిన్ను భర్తగా కట్టుకోవాలనుకుంది కాబట్టి

రాజ్‌: అయ్య బాబోయ్‌ ఇన్ని రోజులు ఈ విషయం తెలియకుండానే పిచ్చోడిలా తిరిగానా..? అయితే డైరెక్టుగా వెళ్లి నేను కూడా ప్రేమిస్తున్నాను అని చెప్తాను.

అని రాజ్‌ చెప్పగానే.. వద్దని ఇప్పుడే నీ ప్రేమ గురించి చెబితే కావ్య ఒప్పుకోదని మెల్లగా తన మనసు డైవర్ట్‌ చేయాలని అప్పుడే నీ ప్రేమను యాక్సెప్ట్‌ చేస్తుందని అందరూ చెప్తారు. రాజ్‌ సరే అంటాడు. రాజ్‌ను తీసుకుని ఇంటికి వస్తారు. అందరూ కలిసి రాజ్‌కు టిఫిన్‌ పెడుతుంటే.. కావ్య కిందకు వస్తుంది.

కావ్య: ఈయన ఏంటి అమ్మమ్మ వాళ్లందరితో గతంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు. కొంపదీసి గతం గుర్తుకు వస్తుందా ఏంటి..?

రాహుల్‌, రుద్రాణి వచ్చి రాజ్‌ను చూసి షాక్‌ అవుతారు.

రుద్రాణి: ఏంటి మీరు మీరు ఒక్కటయిపోయారా.?

స్వప్న: అంటే ఎప్పటికైనా కావాల్సిన వాళ్లమేగా..?

రుద్రాణి: అంటే రాజ్‌కు నిజం చెప్పేశారా..?

రాజ్‌: రాజ్‌ ఎవరు.. ఏ నిజం చెప్పాలి..?

ఇందిరాదేవి: రాజ్‌ అంటే వీడి కొడుకు..

రాజ్‌: మరి రాజ్‌ ఎక్కడున్నారు..?

ప్రకాష్‌: అదిగో నువ్వే కదా ఇక్కడే ఉన్నావు కదా..?

రాజ్‌: నేను రాజ్‌ ఏంటి..? ఏం మాట్లాడుతున్నారు.

ఇందిరాదేవి: అంటే వాడి కొడుకు రాజ్‌ ఎప్పుడు నువ్వు కూర్చున్న ఈ కుర్చీలోనే కూర్చునే వాడు బాబు అందుకే అలా చెప్తున్నాడు.

రుద్రాణి: అంటే రాజ్‌కు గతం గుర్తుకు రాలేదన్నమాట

రాజ్‌: గతం అంటున్నారు.. ఎవరికి గతం గుర్తుకు రావాలి..?

అందరూ తమ మాటలతో రాజ్‌ను కన్పీజ్‌ చేస్తారు. ఇంతలో కావ్య వచ్చి రాజ్‌ను బయటకు తీసుకెళ్లి మళ్లీ మా ఇంటి వైపు రావొద్దని వార్నింగ్‌ ఇస్తుంది. అయినా కూడా వస్తానని రాజ్‌ చెప్పివెళ్లిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today November 2nd: 'గోదావరి' సీరియల్: నందుని బాస్‌తో చూసేసిన బామ్మ! అపర కోటీశ్వరుడైన మురళీ! నందుకి విడాకులు!
'గోదావరి' సీరియల్: నందుని బాస్‌తో చూసేసిన బామ్మ! అపర కోటీశ్వరుడైన మురళీ! నందుకి విడాకులు!
Nindu Manasulu Serial Today November 2nd: నిండు మనసులు: ఒక్క వీడియో.. గణకి క్షమాపణ చెప్పిన విజయానంద్! గణ నిర్ణయంతో అందరూ షాక్!
నిండు మనసులు: ఒక్క వీడియో.. గణకి క్షమాపణ చెప్పిన విజయానంద్! గణ నిర్ణయంతో అందరూ షాక్!
Illu Illalu Pillalu Serial Today November 2nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌ని కొంగుకు కట్టేసుకున్న ప్రేమ! వల్లీకి అండగా నర్మద! కొంప ముంచేసిన భద్రావతి!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌ని కొంగుకు కట్టేసుకున్న ప్రేమ! వల్లీకి అండగా నర్మద! కొంప ముంచేసిన భద్రావతి!
Gundeninda Gudigantalu Nov2: దసరా నవరాత్రులు చివరిరోజు మీనాకు బాలు సర్‌ఫ్రైజ్‌ గిప్ట్‌..బంగారు పుస్తెలతాడు భార్య మెడలో వేసిన బాలు
గుండెనిండా గుడిగంటలు:దసరా నవరాత్రులు చివరిరోజు మీనాకు బాలు సర్‌ఫ్రైజ్‌ గిప్ట్‌..బంగారు పుస్తెలతాడు భార్య మెడలో వేసిన బాలు

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amit Shah In Hyderabad: చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా, సాయంత్రం హైదరాబాద్‌లో పాదయాత్ర
చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా, సాయంత్రం హైదరాబాద్‌లో పాదయాత్ర
Cyclone Musuru Helpline Numbers: ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
Amit Shah Telangana BJP Padayatra: తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
Raptadu Girl Attack Case: రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
School Holidays: మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
Royal Enfield Himalayan 750 వచ్చేస్తోంది.. క్రూజ్‌ కంట్రోల్‌, TPMS సహా అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకుల్లో హైయెస్ట్‌ పవర్‌ ఉన్న బండి.. హిమాలయన్ 750 ఫీచర్లు రివీల్!
Ranabaali OTT : రణబాలి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - విరోష్ కపుల్ కొత్త మూవీ స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
రణబాలి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - విరోష్ కపుల్ కొత్త మూవీ స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Upcoming Cars: ఈ నెలలో రాబోతున్న 4 కార్లు.. లగ్జరీ EVల నుంచి తొలి 'ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్' వరకు!
ఈ నెలలో లాంచ్‌ కానున్న 4 కొత్త కార్లు.. ఒక్కో కారుది ఒక్కో ప్రత్యేకత
Embed widget