అన్వేషించండి

Brahmamudi Serial Today March 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : ఇంటికి మరో సమస్య వస్తుందన్న రుద్రాణి – కావ్య ఫోటో కాల్చేసిన యామిని  

Brahmamudi Today Episode: రుద్రాణి మాటలు నిజమయ్యేలా యామిని, కావ్య ఫోటో కాల్చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.        

Brahmamudi Serial Today Episode: ఇంట్లోకి వచ్చిన రుద్రాణి  అందరూ హ్యాపీగా ఉండటం చూసి.. మీరంతా ఇంత సంతోషంగా ఉన్నారు. ఈ ఇంటికి మరో సమస్య రాదని గ్యారంటీ ఉందా..? అని అడుగుతుంది. ఇంట్లో ఇంత ఆనందం చూస్తుంటే నాకు భయమేస్తుంది. ఆ రోజు రాత్రంతా బాగా పార్టీ చేసుకున్నాం. తెల్లారితే కారులో శవం దొరికింది అంటూ రుద్రాణి మాట్లాడుతుంది.

ప్రకాష్‌: ఆ నోటి నుంచి ఒక్కసారైనా మంచి మాట రాదా..?

అపర్ణ: ఇంక చాలు నువ్వు నోరు తెరవొద్దు

రుద్రాణి: బాగుంది వదిన ఆస్థులు పోవడానికి నేను కారణం అయ్యానా..? మా నాన్న కారణం అయ్యాడు. అప్పుల పాలు అవ్వడానికి నేను కారణం అయ్యానా..? ఈ రాజ్‌, కావ్యలు కారణం అయ్యారు. ఇప్పుడు రాజ్‌ అరెస్ట్ అవ్వడానికి నేను కారణం అయ్యానా..? ఆ అనామిక చేయించింది. జరిగిన దానికి జాగ్రత్త పడమంటుంటే నేను చెడ్డ దాన్ని అయ్యానా..? చూస్తూ ఉండండి.. ఈ సంతోషం ఎక్కువ కాలం నిలబడదు

అపర్ణ: ఎలాంటి సమస్యలు ఎదురైనా.. నా కొడుకు, కోడలు చూస్తూ ఊరుకోరు.. వాటిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉంటారు.

రుద్రాణి: ఏమో వదిన ఈ సారి ఎవరి చేతుల్లో లేనిదే జరుగుతుందేమో..?

అంటూ రుద్రాణి చెప్తుండగానే.. ఫారిన్‌ నుంచి వచ్చిన యామిని కారులో స్పీడుగా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వచ్చిన యామినిక పేరెంట్స్‌ గ్రాండ్‌ వెల్కం చెప్తారు. ఫారిన్‌ వెళ్లి అంతా మర్చిపోయావు మారిపోయావు ఇకనైనా పెళ్లి చేసుకో అని వైదేహి అడగుతుంది.

యామిని: అవును మమ్మీ పెళ్లి చేసుకుంటాను

 అంటూ రాజ్‌ ఫోటో చూపిస్తుంది.

వైదేహి: (భయంగా) నువ్వింకా మారలేదా..?

యామిని: నేను నా అలవాట్లను మర్చిపోయాను కానీ ప్రేమను కాదు మమ్మీ..

వైదేహి: అయితే ఆ అబ్బాయి అమ్మానాన్నలతో మాట్లాడతాము వాళ్లెక్కడుంటారో కనుక్కో  

యామిని: మమ్మీ మీరు మాట్లాడాల్సింది రాజ్‌ పేరెంట్స్‌ తో కాదు. రాజ్‌ వైఫ్‌తో

అని యామిని చెప్పగానే వైదేహి వాళ్లు షాక్‌ అవుతారు. పెళ్లయిన వాడిని ఎలా చేసుకుంటావు అని అడుగుతారు. దీంతో సింపుల్‌గా కావ్యను రాజ్‌కు దూరం చేస్తే సరి అని చెప్పి వెళ్లిపోతుంది యామిని. వైదేహి ఆమె భర్త భయపడుతుంటారు. మరోవైపు రూంలో బట్టలు మార్చుకుంటున్న రాజ్‌ యామిని గురించి ఆలోచిస్తుంటాడు. ఇంతలో కావ్య వస్తుంది.

కావ్య: ఏంటి కొత్త మర్డర్‌కు ఏమైనా ఆలోచిస్తున్నారా..? బట్టలు మార్చుకోవడానికి ఇంతలా ఆలోచిస్తుంటే.. జైలును మిస్‌ అవుతున్నారేమో అనిపిస్తుంది.

రాజ్‌:   ఏం మిస్‌ అయితే నువ్వు నన్ను మళ్లీ పోలీస్‌ స్టేషన్‌కు పంపిస్తావా..?

కావ్య: వెళ్లాలని ఆశగా ఉంటే చెప్పండి అనామికతో మాట్లాడతాను

రాజ్‌: అబ్బో వద్దు తల్లి ఇన్ని రోజులు ఈ నాలుగు గోడల మధ్య ఉంటూ నీతో ఉంటూ.. ఇదే పెద్ద జైలులా ఫీలయ్యేవాణ్ని ఇప్పుడు అక్కడికి వెళ్లాక ఆ వాతావరణం చూశాక వాళ్లకంటే నీవే బెటర్‌ అనిపిస్తుంది. నాకు మళ్లీ ఆ పోలీస్‌ స్టేషన్‌ గుర్తు చేయకమ్మా..

కావ్య:  నాలుగు రోజులు పోలీస్‌ స్టేషన్‌లో ఉండి వస్తే.. ఈ భార్య విలువ తెలిసొచ్చిందన్నమాట.. బుద్దుడికి బోధి చెట్టు కింద జ్ఞానం వచ్చినట్టు భర్తలకు పోలీస్‌ స్టేషన్‌లో జ్ఞానం వచ్చిందేమో

అని కావ్య మాట్లాడుతుండగానే.. రాజ్‌ కావ్యను హగ్‌ చేసుకుంటాడు.

కావ్య:  ఏవండి ఇది రాత్రి కాదు పగలు.. ఎవరైనా వస్తారేమో

రాజ్: ఈ గదిలోకి ఎవ్వరూ రారు.. మన మధ్యకు అసలు రారు

కావ్య:  ఒకవేళ వస్తే..

రాజ్‌:  అలా వస్తే నువ్వు ఊరుకోవు కదా..? అలా వస్తే.. యముడినైనా ఎదిరించి నీ భర్తను తెచ్చుకునే లేడీవి కదా నువ్వు

అంటాడు రాజ్‌. మరోవైపు యామిని వాళ్ల అమ్మా నాన్నలు డాక్టర్‌ తో యామిని ఇంతకు ముందులాగే ప్రవర్తిస్తుందని మీరేమో ట్రీట్‌మెంట్‌ ఇచ్చాం మారిపోయింది అన్నారు అని అడుగుతారు. దీంతో డాక్టర్‌ మీ అమ్మాయి డ్రగ్స్‌ తీసుకోవడం మానేసింది కానీ తనకు దక్కని తన ప్రియుడి విషయంలో అలాగే ఉందని నిజం చెప్తాడు. దీంతో వైదేహి తన భర్త షాక్‌ అవుతారు. లోపల యామిని కావ్య ఫోటో తీసుకుని కాలుస్తుంది. తర్వాత రాజ్‌కు వాయిస్‌ మెసేజ్‌ చేస్తుంది. మెసేజ్‌ చూసిన రాజ్‌ భయపడిపోతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బ్లాక్‌ కీ దక్కించుకొని పవర్ పోగొట్టుకుందెవరు? ఎలిమినేషన్ జరిగిందా! రేపటి నుంచి రెండో అవతారం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బ్లాక్‌ కీ దక్కించుకొని పవర్ పోగొట్టుకుందెవరు? ఎలిమినేషన్ జరిగిందా! రేపటి నుంచి రెండో అవతారం!
Dhee 10 Raju Arrest: లైంగిక వేధింపుల కేసులో 'ఢీ 10' విన్నర్ రాజు అరెస్ట్... కేసు డిటైల్స్ తెలుసా?
లైంగిక వేధింపుల కేసులో 'ఢీ 10' విన్నర్ రాజు అరెస్ట్... కేసు డిటైల్స్ తెలుసా?
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కంటెస్టెంట్ ముందు ఎంగిలి గ్లాస్‌లు కడిగిన నాగార్జున! రోహిత్‌, త్రిగుణ్‌కి ఫుల్ క్లాస్ పడినట్లేనా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కంటెస్టెంట్ ముందు ఎంగిలి గ్లాస్‌లు కడిగిన నాగార్జున! రోహిత్‌, త్రిగుణ్‌కి ఫుల్ క్లాస్ పడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పద్మాక్షి సీక్రెట్ అంబికకు తెలిసిపోయిందా! లక్ష్మీకి సంధ్య ఏం చెప్పింది?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పద్మాక్షి సీక్రెట్ అంబికకు తెలిసిపోయిందా! లక్ష్మీకి సంధ్య ఏం చెప్పింది?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
Buses To Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్‌ గణేష్ దర్శనానికి RTC ప్రత్యేక బస్సులు
ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్‌ గణేష్ దర్శనానికి RTC ప్రత్యేక బస్సులు
IND VS AFG 1st T20 Result Update: అభిషేక్ వీర‌విహారం.. 22 బంతుల్లోనే ఫిఫ్టీ.. ఆఫ్గాన్ పై టీమిండియా బంప‌ర్ విక్ట‌రీ.. స‌త్తా చాటిన ఇషాన్, అర్ష‌దీప్
అభిషేక్ ఊచకోత.. 22 బంతుల్లోనే ఫిఫ్టీ.. ఆఫ్గాన్ పై టీమిండియా బంప‌ర్ విక్ట‌రీ.. స‌త్తా చాటిన ఇషాన్, అర్ష‌దీప్
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బ్లాక్‌ కీ దక్కించుకొని పవర్ పోగొట్టుకుందెవరు? ఎలిమినేషన్ జరిగిందా! రేపటి నుంచి రెండో అవతారం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బ్లాక్‌ కీ దక్కించుకొని పవర్ పోగొట్టుకుందెవరు? ఎలిమినేషన్ జరిగిందా! రేపటి నుంచి రెండో అవతారం!
Arvind Kejriwal: గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
18th BRICS Summit: ఖనిజాలు, టెక్నాలజీని ఆయుధాలుగా మార్చవద్దు.. బ్రిక్స్ సదస్సు ముగింపులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఖనిజాలు, టెక్నాలజీని ఆయుధాలుగా మార్చవద్దు.. బ్రిక్స్ సదస్సు ముగింపులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
2026 మారుతి బలెనోలో ఏం మారింది? ఇంజిన్ పవర్‌, మైలేజ్‌, ఫీచర్లు పెరిగాయా, తగ్గాయా?
పాత బలెనోకు కొత్త బలెనోకు తేడా ఇదే.. కొనే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
Embed widget