అన్వేషించండి

Brahmamudi Serial Today March 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ను ఆట పట్టించిన కనకం - సుభాష్, ప్రకాష్ మధ్య గొడవలు

Brahmamudi Today Episode: సుభాష్, ప్రకాష్ మధ్య గొడవ మొదలవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Brahmamudi Telugu Serial Today Episode: రాజ్ లగేజ్ తీసుకొస్తుంటే.. అదేంటి మా మేనల్లుడి బ్యాగ్ మీరు తీసుకొస్తున్నారు అని కనకం అడుగుతుంది. అదేంటీ నేను వస్తున్నట్లు వీళ్లకు ఇన్ఫర్మేషనే లేదా అని రాజ్ అనుకుంటాడు. అయ్యో అమ్మా ఆయన మన ఇంట్లోనే ఉండేందుకు వస్తున్నారు అని కావ్య చెబుతుంది. అల్లుడు గారు మా ఇంట్లో ఉంటాననడం మా అదృష్టం అని మూర్తి అంటాడు. తర్వాత అంతా కలిసి లోపలికి వెళ్లిపోతారు. మరోవైపు ఆఫీస్ స్టాక్ గోడౌన్‌లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని, దానికి ఇన్సూరెన్స్ చేయించలేదని, 50 లక్షలు నష్టం వచ్చిందని సుభాష్‌కు మేనెజర్ కాల్ చేసి చెబుతాడు. ఎందుకు ఇన్సూరెన్స్ చేయించలేదని కోపంగా అరుస్తాడు. మీ తమ్ముడు చూసుకుంటానని చెప్పారు అని మేనేజర్ చెప్పగానే కాల్‌ కట్‌ చేసి అపర్ణతో ప్రకాశం ఎక్కడ అని సుభాష్ అరుస్తుంటే.. మెట్లు దిగుతూ వస్తాడు ప్రకాశం.

ప్రకాష్‌: ఏమైంది అన్నయ్య అరుస్తున్నావ్. వదినా ఏమైనా తప్పు చేసిందా?

సుభాష్‌: తప్పు చేసింది వదినా కాదు. నువ్వు. గోడౌన్‌లోకి స్టాక్ రాగానే ఇన్సూరెన్స్ చేయించమన్నాను కదా. ఎందుకు చేయించలేదు. దాని వల్ల 50 లక్షలు నష్టం వచ్చింది.

ప్రకాష్‌: అయ్యో మర్చిపోయాను అన్నయ్య. ప్రతిసారి మర్చిపోకూడదు అనుకుంటాను. కానీ, మర్చిపోతున్నాను..

సుభాష్:  ఇలా ఎన్నిసార్లురా.. లాస్ట్ ఇయర్ ఇలాగే చేశావ్. మర్చిపోయాను అని తప్పించుకోకు. నీకు మేనెజర్స్‌ ని పెట్టింది ఇవి గుర్తు చేసేందుకే కదా. ఇలా చేస్తే మేము బయటకు వెళ్లినప్పుడు నీకు ఆఫీస్ ఎలా అప్పజెప్పగలను. నిన్ను నమ్మి నీకు ఆఫీస్‌ను ఒక్కరోజైనా ఎలా ఇవ్వగలను.

ధాన్యలక్ష్మీ:  ఆపండి బావగారు. ఆయన మీతోపాటే ఆఫీస్ చూసుకుంటారు. ఆయనేదే మీ బానిసలా తిడుతున్నారు. ఆయనేమైనా చిన్నపిల్లాడా అలా తిడుతున్నారు. ఆయనకు పెళ్లి అయి పిల్లలకు కూడా పెళ్లి అయింది.

సుభాష్‌: అది కాదు ధాన్యలక్ష్మీ

ధాన్యలక్ష్మీ: ఏం చెబుతారు బావగారు. నోటికి వచ్చినట్లు అంటూనే ఉన్నారు.

అపర్ణ: ధాన్యం వారి మధ్యలోకి నేనే వెళ్లను నువ్ ఎందుకు వెళ్తున్నావ్.

ధాన్యం: ఆయన మహారాజులా తిడుతుంటే నువ్ మహారాణిలా చూస్తున్నావ్. నువ్ ఎందుకు వెళ్తావ్

అని ధాన్యలక్ష్మీ  అపర్ణను అనగానే సారీ అమ్మా నన్ను క్షమించు. అన్నయ్యగా నా తమ్ముడిని అంటున్నాను కానీ, మా మధ్య ఇన్ని ఉంటాయని అనుకోలేదు. రెండు చేతులతో దండం పెట్టి వెళ్లిపోతాడు సుభాష్. ప్రకాశం కోపంగా ధాన్యలక్ష్మీని లోపలికి తీసుకెళ్తాడు. నీకు పిచ్చి పట్టిందా. అన్నయ్యతో ఎందుకు అలా ప్రవర్తించావ్ అని అరుస్తాడు. ఇంకోసారి నాకు మా అన్నయ్యకు మధ్యలో నువ్ రాకు అని కోపంగా చెప్పి ప్రకాశం వెళ్లిపోతాడు. మరోవైపు మూర్తి ఇంట్లో అరిటాకుపై అన్ని రకాల వంటకాలు చేసి పెడతారు. ఇవాళ సూపర్‌గా లాగించేయాలని అని రాజ్ అనుకుంటాడు. అయితే, ఆ అరిటాకుపై భాస్కర్‍కు వడ్డిస్తారు.

అప్పు: పోయినసారి ఇలా అరిటాకుపై వడ్డిస్తే మీరు కోప్పడ్డారు కదా! అందుకే మీకు వడ్డించలేదు.

రాజ్‌: మీ మేనల్లుడికి పెళ్లి చేసి అమెరికా పంపించేయొచ్చు కదా?  నన్ను చూడమంటే ఓ మంచి అమ్మాయిని చూసి పెడతాను. ఎలాంటి అమ్మాయి కావాలి నీకు.

భాస్కర్‌: కావ్య లాంటి అమ్మాయి కావాలి నాకు 

అప్పు: అలాంటి అమ్మాయి ఎక్కడా ఉండదు. కావ్యను చేసుకున్న భర్త ఇక్కడే ఉన్నాడు. మా బావ మా అక్కను వద్దనుకుని రెండో పెళ్లి చేసుకుంటే తప్పా నీకు ఆ ఛాన్స్ లేదు. అయినా దేవతలాంటి మా అక్కను మా బావ ఎందుకు వదులుకుంటాడు. ఏం బావ

దీంతో రాజ్‌ అప్పును మనసులో తిట్టుకుంటాడు. మరోవైపు ధాన్యలక్ష్మీ మాటలు గుర్తు చేసుకుని సుభాష్‌ బాధపడతుంటాడు. ఇంతలో ప్రకాశం వచ్చి అన్నయ్య అని పిలుస్తాడు. నాకు మతిమరుపు ఉందన్నయ్యా. సైట్ లేదు. నువ్ బాధపడుతుంటే ఆ మాత్రం చూడలేనా అని ప్రకాశం అంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: ఫ్రెండ్ ఇంటికే కన్నం, చోరీ చేసి గోవాలో ఎంజాయ్ చేస్తున్న నటి సౌమ్య శెట్టి అరెస్ట్

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Oct 16: ఉద్యోగం పోవడంతో హోటల్‌లో టీమాస్టార్‌గా చేరిన విక్కీ..రాధమ్మ హోటల్‌లోనే టిఫిన్‌ ప్లేట్లు కడుగుతూ జీవనం
నువ్వులేక నేను లేను: ఉద్యోగం పోవడంతో హోటల్‌లో టీమాస్టార్‌గా చేరిన విక్కీ..రాధమ్మ హోటల్‌లోనే టిఫిన్‌ ప్లేట్లు కడుగుతూ జీవనం
Gundeninda Gudigantalu Oct 16: గుణకోసం బాలు కారుతాళం కొట్టేసిన రోహిణి...దొంగ అనుకుని చితక్కొట్టిన ఇంట్లో వాళ్లు
గుండెనిండా గుడిగంటలు: గుణకోసం బాలు కారుతాళం కొట్టేసిన రోహిణి...దొంగ అనుకుని చితక్కొట్టిన ఇంట్లో వాళ్లు
Meghasandesam Serial Today October 16th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి కోసం శరత్‌ చంద్ర ఇంటికి వెళ్లిన మీరా – అపూర్వ మాట విన్న శరత్‌ చంద్ర  
‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి కోసం శరత్‌ చంద్ర ఇంటికి వెళ్లిన మీరా – అపూర్వ మాట విన్న శరత్‌ చంద్ర  
Illu Illalu Pillalu Serial Today October 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అమూల్యని ఓదార్చిన విశ్వక్! నర్మద, ధీమాలకు ఎదురొచ్చిన భద్రావతి!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అమూల్యని ఓదార్చిన విశ్వక్! నర్మద, ధీమాలకు ఎదురొచ్చిన భద్రావతి!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Embed widget