అన్వేషించండి

Brahmamudi Serial Today March 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్ : రాజ్‌ను ఫాలో అయిన కావ్య – స్పృహ కోల్పోయిన అపర్ణ

Brahmamudi Today Episode: యామిని ప్లాన్‌ ప్రకారం ఒక స్కూల్‌కు తీసుకెళ్లి రాజ్‌ను మార్చే ప్రయత్నం చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode: రాజ్‌ కండీషన్‌ గురించి డాక్టర్‌ చెప్తుంటే కిటికీలోంచి చూస్తున్న కావ్య షాక్‌ అవుతుంది. రాజ్‌ గతం మర్చిపోయాడా.. అనుకుని ఎమోషనల్‌ అవుతుంది. నేను మీ ముందుకు వచ్చినా కూడా మీరు నన్ను గుర్తు పట్టలేని పరిస్థితి వచ్చిందా…? అనుకుంటూ  ఏడుస్తుంది. రాజ్‌, యామిని అక్కడి నుంచి వెళ్లిపోతుంటే.. కావ్య వాళ్లను ఫాలో అవుతుంది. హాస్పిటల్ బయటకు వచ్చిన యామిని.. రాజ్‌ను ఒక ప్లేస్‌కు తీసుకెళ్తానంటే సరే అంటాడు రాజ్‌. కావ్య కూడా వాళ్లను ఫాలో అవుతుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అపర్ణ స్పృహ కోల్పోతుంది. ఇదిరాదేవి కంగారు పడుతుంది. సుభాష్‌ను పిలుస్తుంది. సుభాష్‌ వచ్చి తట్టి లేపినా లేవదు.

రుద్రాణి: అనుకున్నా.. ఇలాంటిది ఏదో జరుగుతుందని అనుకున్న.. రాజ్‌కు కర్మకాండలు చేద్దాం అన్నాను. అందరూ నా మాటలు కొట్టి  పారేశారు. ఇప్పుడు చూడండి వదిన పరిస్థితి ఎలా తయారైందో..

ప్రకాష్‌: నువ్వు ఆపుతావా..? వదినకు ఏమైందో అని మేము కంగారు పడుతుంటే మధ్యలో నీ గోల ఏంటి..?

ధాన్యలక్ష్మీ: అక్క సరిగ్గా భోజనం చేసి రెండు రోజులైంది. అందుకేనేమో నీరసం వల్ల ఇలా అయిపోయింది.

సుభాష్‌ పక్కన కూర్చుని ఎంత పిలిచినా అపర్ణ పలకదు. చాలా సేపటికి చిన్నగా కదులుతుంది. ఇందిరాదేవి ఊపిరి పీల్చుకుంటుంది.

అపర్ణ: ఏమైంది. ఇక్కడేం చేస్తున్నారు మీరంతా..?

రుద్రాణి: నువ్వు ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటే ఏమైందోనని అందరూ కంగారు పడుతున్నారు వదిన.

అపర్ణ: నాకు అంత అదృష్టం కూడానా.? రాజ్‌ బదులు నేను పోయుంటే బాగుండు.

రుద్రాణి: అయినా చావు పుట్టుకలు మన చేతుల్లో ఉంటాయా ఏంటి..? మనిషి పోతే పోయాడని నమ్మాలి.. చేయాల్సిన కార్యాలు  ఏవో చేయాలి. అంతేకానీ  నాకు మాత్రమే ప్రేమ ఉంది. చచ్చిపోయాడంటే నేను నమ్మను అంటూ మాట్లాడితే ఇంట్లో వాళ్ల పరిస్థితి ఇలాగే తయారవుతుంది.

సుభాష్‌: ఎప్పుడు చూసిన కావ్య మీద పడి ఏడుస్తావేంటి..?

ప్రకాష్‌: వాళ్లు అలా చేశారు. వీళ్లు ఇలా చేశారు అనడం కాకుండా.. చేతనైతే వదినను కాస్త ప్రశాంతంగా ఉంచడం నేర్చుకో..

ధాన్యలక్ష్మీ: నిజానికి నీ మాటలకే అక్క ఎక్కువ కుంగి పోయేలా ఉంది. ఇలాంటప్పుడైనా కాస్త మనిషిలా ఆలోచించు.. కొంచమైనా మానవత్వం చూపించు.

అంటూ అందరూ తిట్టగానే.. రుద్రాణి కూడా అందరిని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.   మరోవైపు యామిని, రాజ్‌ ఒక స్కూల్‌ దగ్గరకు వెళ్లగానే కావ్య కూడా అక్కడికే వెళ్తుంది. గేటు దగ్గర సెక్యూరిటీ గార్డు కావ్యను లోపలికి వెళ్లనివ్వకపోతే గేటు దగ్గరే నిలబడి ఆలోచిస్తుంది. ఒక ప్లాన్‌ తట్టగానే.. సెక్యూరిటీకి కహాని చెప్పి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్లిన రాజ్‌ కు యామిని స్కూల్‌ మొత్తం చూపిస్తుంది. ప్రిన్సిపాల్‌ రూంలోకి వెళ్లగానే గుర్తు పట్టి లోపలికి పిలుస్తుంది.

ప్రిన్సిపాల్‌: హలో రామ్.. ఎలా ఉన్నారు..?

రాజ్‌: గుడ్‌ మేడం మీరెలా ఉన్నారు…

ప్రిన్సిపాల్‌: చూస్తున్నావుగా స్కూల్‌ వర్క్‌తో బిజీగా ఉన్నాను.  మీరంతా చదువుకుని స్కూల్‌ వదిలేసి వెళ్లిపోతుంటే కొత్త స్టూడెంట్స్‌ వస్తారు.

ఇంతలో కిటికీ దగ్గరకు వచ్చి కావ్య చూస్తుంది.

యామిని: ఏంటి మేడం మీ ఫేవరెట్‌ స్టూడెంట్‌ రామ్‌తోనే మాట్లాడతారా..? నాతో మాట్లాడతారా..?

ప్రిన్సిపాల్‌: నో రామ్‌ ఎంత తెలివైన స్టూడెంటో.. నువ్వు అంత అల్లరి పిల్లవి.. నిన్ను కంట్రోల్‌ చేయలేక మీ బావ ఎంత ఇబ్బంది పడేవాడో నాకు బాగా తెలుసు. అలాంటి నిన్ను ఎలా మర్చిపోతాను యామిని. అప్పట్లో నువ్వు క్లాస్‌ రూంలో థౌజెండ్ వాలా కాల్చావో మాకందరికీ ఇంకా గుర్తుంది.

యామిని: అది మీకు ఇంకా గుర్తు ఉందా మేడం. కదా బావ.

రాజ్‌: అవునా..?

యామిని: అవును బావ..

ప్రిన్సిపాల్‌: అవన్నీ మీ బావకు ఎలా గుర్తు ఉంటాయి.

కావ్య: మా ఆయన చుట్టు చాలా కట్టుకథలు అల్లుతున్నారు.

అని మనసులో అనుకుంటుంది. ఇంతలో ప్రిన్సిపాల్‌ ఒక ఫోటో చూపించి ఈ ఫోటోలో ఉన్న వాళ్ళను గుర్తు పట్టావా రామ్‌ అని అడుగుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 7th: పనివాళ్ల ప్లేట్‌లో కేదార్‌కు భోజనం పెట్టి అవమానించిన యువరాజు...మరిదిని దులిపేసిన ధాత్రి
జగద్ధాత్రి సీరియల్: పనివాళ్ల ప్లేట్‌లో కేదార్‌కు భోజనం పెట్టి అవమానించిన యువరాజు...మరిదిని దులిపేసిన ధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
Godavari Serial Today August 7th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
Nindu Manasulu Serial Today August 7th: నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget