అన్వేషించండి

Brahmamudi Serial Today March 14th:  ‘బ్రహ్మముడి’ సీరియల్ : రాజ్‌ కోసం రంగంలోకి అప్పు – రాజ్‌ను రామ్‌గా మార్చేస్తున్న యామిని

Brahmamudi Today Episode: రాజ్‌ను రామ్‌గా మార్చేందుకు యామిని, వైదేహి కలిసి కొత్త నాటకం మొదలు పెట్టడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode: రాజ్‌ బతికే ఉంటాడన్న కావ్య మాటలు ఇంట్లో వాళ్లు ఎవ్వరూ నమ్మకపోవడంతో కావ్య బాధపడుతూ ఇంట్లోని కృష్ణుడి విగ్రహం దగ్గరకు వెళ్లి ఎమోషనల్‌ అవుతుంది. రాజ్‌ బతికే ఉన్నాడన్న విషయం ఇంట్లో వాళ్లు నమ్మేలా చేయాలని రాజ్‌ను వెతకడానికి వెళ్లాలని నాకు నువ్వే సాయంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తుంది. యామిని వాళ్ల ఇంట్లో రాజ్ భోజనం చేస్తుంటాడు.

యామిని: ఎందుకు బావ అంత స్పీడుగా భోజనం చేస్తున్నావు. స్లోగా తినొచ్చు కదా..?

యామిని ఫాదర్‌: బాబును ఎవరో గట్టిగా తలుచుకుంటున్నట్టు  ఉంది.

వైదేహి: ఇంకెవరు ఆయన భార్య అయ్యి ఉంటుంది

రాజ్‌: భార్యా..  నాకు పెళ్లి అయిందా..?

వైదేహి: అదే బాబు యామిని నీకు కాబోయే భార్య కదా..? పక్కనే ఉన్నా నీ ధ్యాసలోనే ఉంటుంది కదా అందుకే అలా అన్నాను

యామిని: ఎస్‌ బావా.. నీకు ఈ ప్రపంచంలో  మా అమ్మా నాన్నలు నేను తప్పా ఇంకెవరూ లేరు బావ.. ఇంకెవరైనా ఉన్నారేమోనని ఆలోచించకు.. తిను బావ

అని యామిని చెప్పినా రాజ్‌ మాత్రం ఏదో ఆలోచిస్తూనే ఉంటాడు. అప్పు, స్వప్న ఇద్దరూ మెట్ల మీద కూర్చుని కావ్య గురించి ఆలోచిస్తుంటుంటారు.

అప్పు: ఇంట్లో అందరూ బావ లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక బాధపడుతుంటే అక్క మాత్రం అసలు ఏమీ జరగలేదు అన్నట్టు నార్మల్‌గా ఉంటుంది. టైం కు ఫుడ్డు ప్రిపేర్‌ చేసి అందరిని భోం చేయమని చెప్తుంది. ఎవరైనా బావ చావు గురించి మాట్లాడుతుంటే కోప్పడుతుంది. అసలు అక్క ఏం చేస్తుందో తనకైనా తెలుస్తుందో లేదో.. అక్కను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. అక్క అసలు ధైర్యంగా ఉందా..? ధైర్యంగా ఉన్నట్టు నటిస్తుందా..? లేక మెంటల్‌గా ఏమైనా డిస్టర్బ్‌ అయిందా..?

స్వప్న: కావ్యను అలా చూసి అపర్ణ ఆంటీ ఇంకా బాధపడుతున్నారు. నిజంగానే కావ్య పిచ్చిదై పోతుందేమో అనిపిస్తుంది అప్పు

అప్పు: ఎందుకై పోతుంది అక్కా అలా ఎలా అనుకుంటావు

స్వప్న: మరి అలా ప్రవర్తిస్తుంటే ఏమని అర్థం చేసుకోవాలి

అప్పు: తన నమ్మకమే నిజం అవుతుందేమో బావ ఇంటికి తిరిగి వస్తాడేమో అలా కూడా అనుకోవచ్చు కదా

స్వప్న: ఎలా అనుకుంటామే.. స్వయంగా నువ్వే రాజ్‌ బట్టలు, వస్తువులు తీసుకొచ్చావు కదా..? ఇంకెలా వస్తాడు

అప్పు: అదే నా అనుమానం అక్కా బట్టలు, వస్తువులు దొరికాయి కానీ మనం బాడీ చూడలేదు. కదా చిన్న డొంక దొరికినా సరే తీగ లాగితే మొత్తం బయటకు వస్తుంది.

అని రాజ్‌ కేసును మళ్లీ ఓపెన్ చేయడానికి అప్పు డిసైడ్‌ అవుతుంది. రాజ్‌ను వెనక నుంచి వెళ్లి హగ్‌ చేసుకుంటుంది యామిని. రాజ్‌ విదిలించుకుంటాడు.

రాజ్‌: మీరా..? అదే నువ్వా యామిని నేను వేరే ఎవరో అనుకుని భయపడిపోయాను.

యామిని: మన ఇంట్లో నేను తప్పా ఇంకెవరు ఉంటారు బావ. అయినా దీనికెందుకు ఇంత కంగారు పడతావు. నీ చుట్టు ఉన్న వాటిని చూస్తుంటే నీకు ఇంకా నమ్మకం రావడం లేదా..? లేదంటే నా మాటలు మీద నీకు నమ్మకం కలగడం లేదా బావ

రాజ్‌:  అలా ఏం లేదు యామిని నీ కళ్లల్లో నా మీద ఉన్న ఇష్టం కనిపిస్తుంది. అంకుల్‌ , ఆంటీ చూపిస్తున్న కేరింగ్‌ అర్థం అవుతుంది.  ఇంట్లో ఉన్న ఫోటోలు జరిగిన వాటికి సాక్ష్యాలుగా ఉన్నాయి

యామిని:  మరి నాకు దూరంగా ఎందుకు వెళ్తున్నావు. నాతో ఎందుకు క్లోజ్‌గా ఉండలేకపోతున్నావు బావ

రాజ్‌: అదే అర్థం కావడం లేదు. నాకెందుకో నీకు దూరంగా ఉండాలనిపిస్తుంది.

అంటూ రాజ్‌ చెప్పగానే.. యామిని ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంది. ఇదంతా నా దురదృష్టం అంటూ బాధపడ్డట్టు నటిస్తుంది. మరోవైపు రాహుల్‌ను కంపెనీ కి సీఈవోను చేయడానికి రుద్రాణి ప్లాన్‌ చేస్తుంది. అందుకోసం రాహుల్‌ను బలవంతంగా ఆఫీసుకు పంపేందుకు రెడీ చేస్తుంది. యామిని, వైదేహి మాట్లాడుకుంటుంటే.. రాజ్‌ కిటికీ దగ్గరకు వస్తాడు. రాజ్‌ను చూసి మళ్లీ ఎమోషనల్‌గా బాధపడ్డట్టు నటిస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని బావిలో తోసేసిన బంటి! సిరి ఇక చనిపోయినట్లేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని బావిలో తోసేసిన బంటి! సిరి ఇక చనిపోయినట్లేనా!
Nindu Manasulu Serial Today October 13th: నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
Godavari Serial Today October 13th: 'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
Aishwarya Pisse Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం
విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget