అన్వేషించండి

Brahmamudi Serial Today March 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : కనకానికి వార్నింగ్‌ ఇచ్చిన ధాన్యలక్ష్మీ - కళ్యాణ్‌ ను ఇంటికి రావొద్దన్న కనకం

Brahmamudi Today Episode: అప్పు, కళ్యాణ్ మాట్లాడుకోవడం చూసిన అనామిక, ధాన్యలక్మీ ఇద్దరూ కలిసి కనకం ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: కావ్యకు పాస్‌పోర్టు ఇచ్చి అమెరికా వెళ్లమని చెప్పి రాజ్‌ వెళ్లిపోతాడు. ఇంతలో బామ్మ, భాస్కర్‌ వస్తారు. వాళ్లకు రాజ్‌ అమెరికా వెళ్లిపోమ్మని పాస్‌ఫోర్ట్‌ ఇచ్చాడని చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు. వాడు రివర్స్‌ లో వస్తున్నాడు. వాడికి కూడా మనం రివర్స్‌ లోనే సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంటారు ఇందిరాదేవి, భాస్కర్‌, కావ్య. తర్వాత బెడ్‌రూంలోకి వెళ్లిన రాజ్‌  ఆత్మ బయటకు వచ్చి కావ్యను ఎందుకు అమెరికా పంపిస్తున్నావని నిలదీస్తుంది. దీంతో రాజ్‌ ఆత్మను తిట్టేసి వెళ్లిపోతాడు. మరోవైపు ధాన్యలక్ష్మీ, అనామిక మూర్తి ఇంటికి వెళ్తారు.

ధాన్యలక్ష్మీ: కనకం మీరు ఆడపిల్లల్ని కన్నది మా ఇంటి మగ పిల్లల్ని వలలో వేసుకోవడానికా?

మూర్తి: ఎంటమ్మా రాగానే అంత మాట అనేశారు.

ధాన్యలక్ష్మీ: ఇంకేం మాట్లాడాలండి. ఒకసారి బయటకు వచ్చి చూడండి మీ చిన్నకూతురు ఆడే బాగోతం కనిపిస్తుంది.

మూర్తి: మా అప్పు అంత పొరపాటు ఏం చేసింది.

ధాన్యలక్ష్మీ: ఏం చేస్తుందో మీకు తెలియదా? మీకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందా?

కనకం: ధాన్యలక్ష్మీ గారు మీరేదో ఆవేశంలో ఉన్నారు దయచేసి కూర్చుని సామరస్యంగా మాట్లాడండి.

అనామిక: నా మొగుడితో నీ కూతురు ఎందుకు తిరుగుతుంది.

మూర్తి: తిరగడం ఏంటమ్మా ఇద్దరూ స్నేహితులు కాబట్టి ఎక్కడైనా ఎదురుపడ్డారేమో

అనామిక: ఎదురుపడటం కాదండి ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని సిగ్గు లేకుండా తిరుగుతున్నారు. మా ఆయన మంచితనం ఆసరాగా చేసుకుని నీ కూతురు మళ్లీ రంగప్రవేశం చేసింది.

మూర్తి: అలాంటి బుద్ది నా కూతురికే ఉంటే నీతో పెళ్లి  జరగనిచ్చేదా?

అనగానే ధాన్యలక్ష్మీ ఇష్టం వచ్చినట్లు తిడుతుంది. మీ కూతురును అదుపులో పెట్టుకోమని వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో కనకం కూడా తిడుతుంది. అనామిక కూడా మూర్తి, కనకానికి వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో కనకం కూడా ధాన్యలక్ష్మీ, అనామికకు  వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో ధాన్యలక్ష్మీ, అనామిక వెళ్లిపోతారు. మరోవైపు బామ్మ విడాకుల పత్రాలు తీసుకొచ్చి కావ్యకు ఇస్తుంది.

కావ్య: ఎంటి అమ్మమ్మగారు

ఇందిరాదేవి: విడాకుల పత్రాలు

కావ్య: ఏంటి అమ్మమ్మగారు మీ చేతులతో మీరే ఇస్తున్నారా? నాకర్థం కావడం లేదు అమ్మమ్మగారు కలపడానికి విడిపోయే పత్రాలు ఎందుకు?

అనగానే రాజ్‌ లోని ప్రేమ బయటపడాలంటే నువ్వు విడిపోతానని నమ్మించాలి అని ఇందిరాదేవి చెప్పగానే కావ్య వద్దంటుంది. ఈ ప్లాన్‌ నా కాపురాన్నే బలి తీసుకుంటే.. ఎలా అంటూ బాధపడుతుంది కావ్య. మీరిద్దరూ విడిపోవాలని కాదు నేనున్నానుగా అంటూ బామ్మ భరోసా ఇస్తుంది. అయినా వినకుండా కావ్య సంతకం చేయలేనని నావల్ల కాదని చెప్పి  వెళ్లిపోతుంది.

భాస్కర్‌: మీ మాట కాదనందుకు కావ్య మీద కోపం వచ్చిందా బామ్మగారు.

ఇందిరాదేవి: లేదు బాబు నా మనవరాలి వ్యక్తిత్వం చూసి పొంగిపోతున్నాను. ఇంతకన్నా గొప్ప భార్య వాడికి ఈ ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుందయ్యా?

అని చెప్పగానే భాస్కర్‌ చూస్తుండిపోతాడు. మరోవైపు అప్పుతో పాటు కళ్యాణ్‌ ఇంటికి వస్తాడు. కనకం, మూర్తి షాక్‌ అవుతారు.

కళ్యాణ్‌: బాగున్నారా ఆంటీ?  

కనకం: ఇప్పటి వరకు బాగానే ఉన్నాం బాబు. ఇక ముందు కూడా మేమే మర్యాదగా బతకాలంటే మీరు మా ఇంటికి రాకూడదు.

అప్పు: అమ్మా ఇదేందే ఇంటికి వచ్చిన మనిషితో ఇలాగేనా మాట్లాడేది.

అనగానే మూర్తి అప్పును తిడుతాడు. మీరు కలిసి తిరుగుతుంటే చూసిన వాళ్లు ఏమనుకుంటారు? అని చెప్తాడు. నువ్వు పెళ్లైనవాడివి దానికి పెళ్లి కాలేదు. అలాంటిది మీరు కలిసి తిరుగుతే చూసిన వాళ్లు ఏమనుకుంటారు అని మమ్మల్ని ఇలా వదిలేయండి బాబు అంటూ కనకం దండం పెడుతుంది.  దీంతో కళ్యాణ్‌ మా గురించి అప్పుడే మీదాకా తీసుకొచ్చింది ఎవరో చెప్పమని గట్టిగా అడగడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: గోల్డ్‌ కలర్‌ ట్రెండీ అవుట్‌ఫిట్‌లో వజ్రంలా మెరిసిపోతున్న నేహా శెట్టి

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today October 13th: నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
Godavari Serial Today October 13th: 'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
Aishwarya Pisse Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం
విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం
Illu Illalu Pillalu Serial Today October 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: భర్త, అత్తమామల మీద గృహహింస కేసు పెట్టిన వల్లీ! పెళ్లి రోజు వేడుకలో షాక్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: భర్త, అత్తమామల మీద గృహహింస కేసు పెట్టిన వల్లీ! పెళ్లి రోజు వేడుకలో షాక్!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget