అన్వేషించండి

Brahmamudi Serial Today June 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : కళ్యాణ్ ను నిలదీసిన అనామిక - నిజం చెప్పిన కావ్య

Brahmamudi Today Episode: కళ్యాణ్ అప్పులు ఎందుకు హోటల్ కు వెళ్లాల్సి వచ్చిందని ఇంట్లో వాళ్లు నిలదీయడంతో కావ్య నేను చెప్తేనే వెళ్లారు అని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: హోటల్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన కళ్యాణ్‌, అప్పు లు ఇంటికి వస్తారు. అనామిక వాళ్ల మీద కోప్పడుతుంది. ఇంట్లో వాళ్లను నిలదీస్తుంది. వీళ్లిద్దరిది ప్రేమ అనుకోవాలా? వ్యామోహం అనుకోవాలా? ఇప్పుడు నేనేం చేయాలి. నా కాపురం నిలబెట్టమని ఈ ఇంటి పెద్దరికాన్ని ప్రాధేయపడాలా? నాకు అన్యాయం చేయోద్దని నా భర్త కాళ్లు పట్టుకుని వేడుకోవాలా? నా కాపురంలో చిచ్చు పెట్టొద్దని ఈ అప్పు చేతులు పట్టుకుని వేడుకోవాలా? అంటూ నిలదీస్తుంది.

ధాన్యలక్ష్మీ: ఎందుకురా ఇలాంటి పని చేశావు. ఎన్నాళ్ల నుంచి ఇలా కలుసుకుంటున్నారు. ఇంతకు బరితెగించి ఎందుకు ప్రవర్తిస్తున్నారురా?

అపర్ణ: ధాన్యలక్ష్మీ తొందరపడకు..మన పెంపకాన్ని మనమే నమ్మకపోతే బిడ్డలు ఎలా నలిగిపోతారో నీకు తెలియదు. నాకు తెలుసు? అసలేం జరిగిందో ఆ పిలల్నే అడిగి తెలుసుకుందాం.

ప్రకాష్‌: అవును ధాన్యం. మన కళ్యాణ్‌ గురించి మనమే తప్పుగా అనుకోకూడదు. వాడి మనస్తత్వం వేరు ఇలాంటి ఆలోచనలు వాడికి రావు.

స్వప్న: మా అప్పు కూడా అలాంటిది కాదు. ఏదైనా ఉన్నది ఉన్నట్లే మాట్లాడుతుంది.  స్నేహం చేస్తే ప్రాణమైన ఇస్తుంది. కాబట్టి ఏం జరిగిందో వాళ్లను అడిగే తెలుసుకుందాం.

అనామిక: నువ్వు మధ్యలో రాకు నువ్వు రాహుల్‌ ను ఏ విధంగా పెళ్లి చేసుకున్నావో.. మీ అక్క ఎలా పెళ్లి చేసుకుందో మీ అమ్మ అప్పును కళ్యాణ్‌ కు  ఇచ్చి ఎలా పెళ్లి చేయాలనుకుందో నాకు తెలుసు.

కావ్య: నువ్వు మాట్లాడకు. నీకన్నా పెద్దవాళ్ల ముందు నీ భాషని సంస్కారంగా చేసుకుని మాట్లాడు.

  అనగానే అనామిక కోపంగా ఇది నా జీవితం, నా కాపురం నన్ను నా భర్త మోసం చేసినందుకు ఆయన్ని ప్రశ్నించే అధికారం నాకు లేదా అంటుంది అనామిక. వెంటనే నీకు ఆ అధికారం ఉంది. అనగానే అనామిక షాక్‌ అవుతుంది. కానీ అడ్డమైన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని చెప్తాడు కళ్యాణ్‌. అప్పు కూడా నేనేంటో నాకు తెలుసు అంటుంది అప్పు. ఇంతలో కనకం, మూర్తి వస్తారు. కనకం అనామికకు వార్నింగ్‌ ఇస్తుంది. ఎన్నిసార్లు దాన్ని దోషిగా నిలబెడతారు. ఎన్నిసార్లు దాని శీలాన్ని శంకిస్తారు అంటూ కనకం ప్రశ్నిస్తుంది.

అనామిక: ఏయ్‌ నోరుంది కదా అని ఇంతెత్తున అరిచి మా నోళ్లు మూయించాలని చూస్తున్నావా? టీవీల్లో ఏం చూపిస్తున్నారో చూడు. నీ కూతురు నా భర్తతో హోటల్‌ గదిలో దొరికింది. అది తెలుసుకుని వచ్చావా నువ్వు. వాళ్లిద్దరూ ఆ గదిలో రహస్యంగా కలుసుకోవాల్సిన అవసరం ఏంటో తెలుసుకున్నావా?

కనకం: తెలుసుకోలేదు. ఎందుకు తెలుసుకోవాలి. నీ మొగుడు అలాంటి వాడు కాదు. నా కూతురు అలాంటిది కాదు. నమ్మకం నా కూతురు మీదే కాదు నీ భర్త మీద కూడా నమ్మకం. స్నేహం కోసం నా బిడ్డ మీద ఈగ కూడా వాలనివ్వని మనిషి. ఇలాంటి వ్యవహారాలు నడుపుతాడంటే నేను చచ్చినా నమ్మను.

  అని కనకం చెప్పగానే రాజ్‌ కూడా కళ్యాణ్‌, అప్పులను వెనకేసుకొస్తాడు. అయితే అక్కడకు ఎందుకు వెళ్లారని అడుగుతాడు. అందరూ కూడా ఎందుకు వెళ్లారని  అదే అడుగుతారు.  వాళ్లు ఎందుకు వెళ్లారో నాకు తెలుసని కావ్య చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. కావ్య అసలు మాయ గురించి జరిగింది మొత్తం చెప్తుంది.

అనామిక: శబాష్‌ మీ కుటుంబానికి నాటకాలు రాయడం మాత్రమే వచ్చు అనుకున్నాను ఇలాంటి దిక్కుమాలిన కథలు అల్లడం కూడా వచ్చన్నమాట. నీ చెల్లెలు మీద పడ్డ మచ్చ తుడిచేయడానికి బాగానే కథలు అల్లుతున్నావు.

కావ్య: అనామిక నీ కళ్లకు బాగానే అనుమానపు పొరలు కమ్మాయి. ఇక నిన్ను ఆ భగవంతుడు కూడా మార్చలేడు.

అనగానే మారని మనిషి గురించి మనకెందుకు వదిన అంటాడు కళ్యాణ్‌. మీరెన్నైనా చెప్పండి ఇక నుంచి కళ్యాణ్‌, అప్పు కలవడానికి నేను ఒప్పుకోను అంటుంది అనామిక. నువ్వేంటే చెప్పేది నేనే కలవనివ్వను అంటూ కనకం అప్పును తీసుకుని వెళ్లిపోతుంది. అనామిక కోపంగా నీకు ఎవరి బుద్దులు వచ్చాయోనని కళ్యాణ్‌ను తిడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ప్రభాస్‌ వల్లే నేను ఇలా అయ్యాను - బేబీ బంప్‌ చూపిస్తూ దీపికా ఆసక్తికర కామెంట్స్‌

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 7th: కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 7th:మందుతాగి వచ్చి అందరి ముందు రచ్చచేసిన ప్రియా...సుందరి నకిలి చిట్టీ అంటూ గొడవ
నువ్వులేక నేను లేను: మందుతాగి వచ్చి అందరి ముందు రచ్చచేసిన ప్రియా...సుందరి నకిలి చిట్టీ అంటూ గొడవ
Podarillu Serial Today August 7th: మాధవ్‌ను వెతికి ఇంటికి తీసుకొచ్చిన చక్రి....పెద్దకొడుకు చెంపపగులగొట్టిన నారాయణ
పొదరిల్లు: మాధవ్‌ను వెతికి ఇంటికి తీసుకొచ్చిన చక్రి....పెద్దకొడుకు చెంపపగులగొట్టిన నారాయణ
Gundeninda Gudigantalu August 7th: తప్పతాగి రోడ్డుమీద గొడవ చేసిన మనోజ్‌...స్టేషన్‌కు తరలించిన అరుణ్‌
గుండెనిండా గుడిగంటలు: తప్పతాగి రోడ్డుమీద గొడవ చేసిన మనోజ్‌...స్టేషన్‌కు తరలించిన అరుణ్‌

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Embed widget