అన్వేషించండి

Brahmamudi Serial Today July 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కనకాన్ని రెచ్చగొట్టిన రుద్రాణి – రాజ్ ను చెడామడా తిట్టిన కనకం

Brahmamudi Today Episode: రాజ్ ప్లాన్ ను చెడగొట్టేందుకు రుద్రాణి, కనకానికి ఫోన్ చేసి రెచ్చగొట్టడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  కల్యాణ్, అప్పును ప్రేమించట్లేదని చెప్పడంతో రాజ్‌ షాక్‌ అవుతాడు.  ఇంతలో ధాన్యలక్ష్మీ తనకిచ్చిన మాట సంగతేంటని కావ్యను అడుగుతుంది. అయితే తనకేం అవసరం. అదెందుకు మాటిస్తుందని స్వప్న అడుగుతుంది. దీంతో మీరిద్దరిని ఈ ఇంట్లోకి కోడళ్లు గా పంపినట్టే మీ అమ్మ అప్పును పంపేందుకు ప్లాన్ చేసిందేమో  అని రుద్రాణి అంటుంది. మా అమ్మ జోలికి వస్తే ఈరోజు నా అత్తవని కూడా చూడను అంటూ స్వప్న రుద్రాణికి వార్నింగ్‌ ఇస్తుంది.

రాహుల్‌: ఏయ్.. అందరిముందు ఎంత మాటొస్తే అంతా.. ఏది పడితే అది మా అమ్మను అంటే నాలుక చీరేస్తాను. నరికి పోగులు పెడతాను.

స్వప్న: మీ అమ్మను అంటే నీకు ఎక్కడో కాలింది కదా. మా అమ్మను అంటే మాకు కాలదా. నన్ను నరకాలంటే ముందు నీకు చేతులు ఉండాలి కదా. కాలేజీలో కరాటే నేర్చుకున్న చేతులు ఇవి

స్వప్న: ఆగు అక్క... చూశారుగా కవిగారు. మీ మనసులో అప్పు లేదు నిజమే. కానీ, మీరు పెళ్లి చేసుకుంటేనే ఈ నోళ్లు మూతబడతాయ్

రాజ్‌: ఒప్పేసుకోరా. పెళ్లి చేసుకుంటానని మాటివ్వు. నీ మనసులో అప్పు లేదుగా. ఇంకా ఎవరిని పెళ్లి చేసుకుంటే ఏంటీ. మీ అమ్మ అనిందనో. ఈ రుద్రాణి అత్త అన్నదనో. మీ వదిన మాటిచ్చిందనో వెళ్లి పెళ్లి చేసుకోరా.. మాటివ్వు

కళ్యాణ్‌: నేను ఇప్పుడు ఇంకో పెళ్లికి రెడీగా లేను వదిన. నా మనసంతా అల్లకల్లోలంగా ఉంది. అనామిక చేసిన గాయం ఇంకా మానకముందే నేను మళ్లీ పెళ్లికి రెడీ కాలేను. నాకు కొంచెం సమయం కావాలి

  అని చెప్పికళ్యాణ్‌ వెళ్లిపోతాడు. ధాన్యలక్ష్మిని అందరూ తిడతారు. తర్వాత కళ్యాణ్‌ దగ్గరకు వెళ్లిన రాజ్‌  నీ బాధను అందరిముందు బయటపెడితే.. సింపుల్‌గా అబద్ధం చెబుతావా. అని అడుగుతాడు. దీంతో కళ్యాణ్‌ తాను అప్పును కలిసిన విషయం చెప్తాడు. అప్పు ఇష్టంతోనే పెళ్లి చేసుకుంటుందని నాకు ఇష్టమున్నా ఏం లాభం అని కళ్యాణ్‌ బాధపడి వెళ్లిపోతాడు. తర్వాత కావ్య దగ్గరకు వెళ్లిన రాజ్‌

రాజ్‌: కల్యాణ్ మనసులో ఎవరున్నారో నీకు తెలిదా?

కావ్య: అది కాదు ముఖ్యం. కవిగారు ఏం చెప్పారనేది ముఖ్యం

రాజ్‌: అలా నువ్వే చెప్పించావ్. అప్పు ఈ ఇంట్లో అడుగుపెడితే.. మా పిన్ని వల్ల. రుద్రాణి వల్ల కష్టపడాల్సి వస్తుందని భయపెట్టావు.

  అని రాజ్‌ అనగానే ముందు అప్పు కూడా ఇష్టపడితే ఎవరు అడ్డొచ్చినా వారి పెళ్లి చేద్దాం అని అప్పుతో మాట్లాడమని రాజ్‌కు చెప్తుంది కావ్య. రాజ్‌ సరే అంటాడు. అంతా చాటు నుంచి వింటున్న రుద్రాణి పక్కకు వెళ్లి కనకానికి ఫోన్‌ చేస్తుంది. నువ్వు అనుకున్నది అనుకున్నట్లు చేస్తున్నావని అప్పును కూడా ఈ ఇంటి  కోడలిని చేయడానికి రాజ్‌ను రెచ్చగొట్టావని తిడుతుంది. దీంతో కనకం రుద్రాణని తిడుతుంది. ఎవరు ఏం చేసినా అప్పుకు నచ్చిన వాడితోనే నేను పెళ్లి చేయిస్తాను. దాన్ని ఎవరూ మార్చలేరు అని  కనకం ఫోన్‌ కట్‌ చేస్తుంది. తర్వాత రాజ్ కనకం ఇంటికి వెళ్తాడు.

రాజ్‌: అప్పును కల్యాణ్ ప్రేమిస్తున్నాడు. అప్పు కూడా కల్యాణ్‌ను మొదటి నుంచి ప్రేమిస్తుందని తెలుసు. అలాంటప్పుడు వాళ్ల పెళ్లికి ఎందుకు అడ్డు చెబుతున్నారు.

కనకం: అదేం లేదు బాబు. అప్పుకు వేరే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అయింది. అప్పు కూడా ఈ పెళ్లి ఇష్టం తోనే చేసుకుంటుంది.

రాజ్‌: మీరు అప్పును బలవంతం చేసి పెళ్లికి ఒప్పించారేమో?

కనకం: లేదు బాబు కావాలంటే మీరు ఒకసారి అప్పుతో మాట్లాడండి.

  అని చెప్పి అప్పును పిలుస్తుంది కనకం. అప్పు వచ్చి తాను ఇష్టంగానే పెళ్లి చేసుకుంటున్నానని చెప్పడంతో రాజ్‌ షాక్‌ అవుతాడు. తర్వాత అక్కడి నుంచి ఇంటికి వచ్చిన రాజ్‌ను కావ్య తిడుతుంది. మీ ఆస్తిని తన్నుకుపోవడానికి ఎవరు కుట్రలు చేస్తున్నారో తెలుసుకుని వచ్చారా? అంటూ కావ్య ప్రశ్నించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: 'రాయన్'కు మహేష్ బాబు రివ్యూ - ధనుష్ సినిమాపై సూపర్ స్టార్ ట్వీట్, ఏమన్నాడంటే?

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today October 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్‌ను అనుమానించిన వైజయంతి – కోల్‌కతా వెళ్లడానికి రెడీ అయిన మనోహరి 
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్‌ను అనుమానించిన వైజయంతి – కోల్‌కతా వెళ్లడానికి రెడీ అయిన మనోహరి 
Meghasandesam Serial Today October 18th: ‘మేఘసందేశం’ సీరియల్‌:  భూమి మెడలో తాళి కట్టబోయిన సూర్య – పోలీస్‌ గెటప్ లో వచ్చి పెళ్లి ఆపేసిన ఆకాష్‌
‘మేఘసందేశం’ సీరియల్‌:  భూమి మెడలో తాళి కట్టబోయిన సూర్య – పోలీస్‌ గెటప్ లో వచ్చి పెళ్లి ఆపేసిన ఆకాష్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
Nindu Manasulu Serial Today October 17th: నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!
నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
Mahindra XUV 3XO ZNG పేరుకే CNG కారు- అధిక మైలేజ్,పెట్రోల్ లాంటి పవర్ దీని సొంతం
NATS: తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం 'నాట్స్' మిషిగన్ చాప్టర్‌ ప్రారంభం... హరినాథ్ పొలిచర్లకు సత్కారం
తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం 'నాట్స్' మిషిగన్ చాప్టర్‌ ప్రారంభం... హరినాథ్ పొలిచర్లకు సత్కారం
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Embed widget