అన్వేషించండి

Brahmamudi Serial Today May July 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేవతిని వెల్లగొట్టిన అపర్ణ – రుద్రాణి ప్లాన్‌ సక్సెస్‌

Brahmamudi serial today episode July 26th: రుద్రాణి ప్లాన్‌ ప్రకారం అపర్ణతో రేవతిని ఇంట్లోంచి వెళ్లగొట్టిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రేవతి, జగదీష్‌లను చూసిన అపర్ణ, సుభాష్‌ షాక్‌ అవుతారు. అపర్ణ కోపంగా రేవతిని తిడుతుంది. మళ్లీ ఎందుకు వచ్చావని నిలదీస్తుంది.

కావ్య: ఏం అంటున్నారు అత్తయ్య మీరు ఇంటికి వచ్చిన వాళ్లను ఎవరో అనుకుని తిడుతున్నారేమో తన పేరు రేవతి.. ఆ రోజు నన్ను మా అక్కను కాపాడింది అని చెప్పానే ఈవిడే

అపర్ణ: ప్రాణాలు కాపాడిందో.. కాపాడుతున్నట్టు నటించి తిరిగి ఇంటికి రావడానికి ప్లాన్‌ చేసిందో ఎవరికి తెలుసు..

రేవతి: అమ్మా…?

అపర్ణ: నోర్మూయ్‌.. అలా పిలిచే అర్హత నువ్వు ఎప్పుడో కోల్పోయావు.. ఆరోజే చెప్పాను. నువ్వు తిరిగి ఇంట్లో అడుగుపెట్టడం జరిగితే అది నా చావుతోనే అని ఏంటి..? చూస్తున్నావు.. నేను చచ్చానని ఇంట్లో అడుగుపెట్టావా..?

కావ్య: అత్తయ్యా ఒక్క నిమిషం.. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. రేవతి గారు మీ కూతురు అన్న విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు. నేను మీ కోడలు అన్న విషయం ఇప్పటి వరకు తనకు తెలియదు. అందుకేనేమో పిలిచాను అత్తయ్యా నా మాట కాదనలేక రేవతి గారు ఇక్కడికి వచ్చారు..

స్వప్న: అవును ఆంటీ.. నా చెల్లెలు చెప్పేది నిజం ఆరోజు మేము ప్రమాదంలో ఉంటే మేము ఎవరో కూడా తెలియకుండా రేవతి గారే మమ్మల్ని  కాపాడారు.. అలాంటి మనిషిని ఇలా అవమానించడం కరెక్టు కాదనిపిస్తుంది

కావ్య: అవును అత్తయ్యా ఒకసారి మీరే ఆలోచించండి.. ఎప్పుడో ఏదో గొడవ జరిగిందని ఆ గొడవను  మనసులో పెట్టుకుని ఇప్పుడు అవమానించడం ఏంటి..? ఒకవేళ మీరు చెప్పినట్టు తను మీ కూతురే అయితే తను చేసిన తప్పులన్నీ మర్చిపోయి ఇదే మంచిరోజు అనుకుని తనని క్షమించేయోచ్చు కదా

రుద్రాణి:  చాలా బాగుంది.. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందట.. ఇన్ని రోజులుగా మా వదిన… కూతురు చేసిన మోసాన్ని, అవమానాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ తనలో తాను బాధపడుతుంటే.. మళ్లీ నువ్వు ఈరోజు అవన్నీ గుర్తు చేయడానికి తీసుకొచ్చావా..? అసలు ఆ రోజు ఈ రేవతి ఏం చేసిందో నీకు తెలుసా..? కట్టుకున్న మొగుడి కోసం కన్న తల్లిదండ్రులను అవమానించంది. పుట్టింటితో బంధమే అవసరం లేదని మాట్లాడింది. బంధాలకు విలువ ఇవ్వని నాకే ఆ రోజు కడుపు మండిపోయింది

కావ్య: రుద్రాణి గారు ఇది ఒక తల్లికి బిడ్డకు మధ్య జరుగుతుంది. మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది

రుద్రాణి: అయితే నువ్వెందుకు చేసుకుంటున్నావు.. నీకు ఏం సంబంధం ఉందని ఆవిడను ఇక్కడకు తీసుకొచ్చావు

కావ్య: మీకొక్కసారి చెబితే అర్థం కాదా..? రేవతి గారు అత్తయ్య కూతురు అన్న విషయమే నాకు తెలియదు. పొరపాటున తీసుకొచ్చాను అని చెప్తున్నాను కదా..?

రుద్రాణి: సరే నీకు తెలియదు. రేవతి మా వదిన కూతురు అన్న విషయం రేవతికి తెలుసు కదా..? నువ్వు తెలియకనే మా వదినతో ఫోన్‌లో మాట్లాడించి రేవతిని పిలిపించావు అనుకుందాం కానీ రేవతికి తెలుసు కదా..? ఫోన్‌లో మాట్లాడుతున్నది కన్న తల్లి అని అప్పుడు ఎందుకు నిజం చెప్పలేదు.. ఆ విషయాన్ని దాచిపెట్టి మొగుణ్ని తీసుకుని వచ్చింది అంటే ఇదంతా తన ప్లాన్‌లో భాగం అని అర్థం చేసుకోలేమా..?

రాజ్‌: ఆంటీ మీ మాటలు వింటుంటే ఏదో ఒక వంకతో వాళ్లిద్దరిని విడగొట్టాలని చూస్తున్నట్టు ఉంది. వాళ్లు విడిపోవడం మీకు అంత ఇష్టమా..?

రుద్రాణి: నాకు అలాంటి ఉద్దేశం ఎందుకు ఉంటుంది. నాకు అలాంటి ఆలోచన ఏం లేదు

ఇందిరాదేవి: లేకపోతే ఈ చెత్త వాగుడు అంతా ఎందుకు వాగుతున్నావు.. అపర్ణ మనసును ఇంకా ఎందుకు పాడు చేస్తున్నావు..

రుద్రాణి: నేనేం మాట్లాడలేదు అమ్మా

అంటూ రుద్రాణి నంగనాచి మాటలు చెప్తుంటే.. ఇందిరాదేవి తిడుతుంది. అపర్ణ దగ్గరకు వెళ్లి కన్వీన్స్‌ చేయాలని చూస్తుంది. కావ్య కూడా కన్వీన్స్‌ చేయాలని చూస్తే అపర్ణ కోపంగా కావ్యను తిట్టి రేవతిని ఇంట్లోంచి వెళ్లిపోమ్మని వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో జగదీష్‌ రేవతిని తీసుకుని వెళ్లిపోతాడు. తర్వాత ఇందిరాదేవి రాజ్‌, కావ్యలను తిడుతుంది. మీరు చేసిన పనికి ఇన్ని రోజులు తాను పడిన శ్రమ వృథా అయిందని బాధపడుతుంది. రేవతి కూడా ఎమోషనల్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి విహారి విశ్వప్రయత్నం! లక్ష్మీ ప్రాణాలకు ముప్పు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి విహారి విశ్వప్రయత్నం! లక్ష్మీ ప్రాణాలకు ముప్పు!
Godavari Serial Today July 22nd: 'గోదావరి' సీరియల్: తండ్రి డైరీ చదివిన జాను! మురళీ, నందుల రొమాంటిక్ సీన్ అదుర్స్!
'గోదావరి' సీరియల్: తండ్రి డైరీ చదివిన జాను! మురళీ, నందుల రొమాంటిక్ సీన్ అదుర్స్!
Jabardasth Latest Promo: 'జబర్దస్త్'లో ఆషాడం ఆఫర్లు... నవ్విస్తే డబ్బులు... అసలు బండారం బయటపెట్టిన 'హైపర్' ఆది
'జబర్దస్త్'లో ఆషాడం ఆఫర్లు... నవ్విస్తే డబ్బులు... అసలు బండారం బయటపెట్టిన 'హైపర్' ఆది
Jabardasth New Timing: ఆదివారానికి వచ్చిన 'జబర్దస్త్'... టైమింగ్ మారింది - కొత్తగా పాత టీమ్ లీడర్లు వచ్చారోచ్
ఆదివారానికి వచ్చిన 'జబర్దస్త్'... టైమింగ్ మారింది - కొత్తగా పాత టీమ్ లీడర్లు వచ్చారోచ్

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Embed widget