అన్వేషించండి

Brahmamudi Serial Today May July 21st:  ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌ను వెనక నుంచి కొట్టిన రౌడీలు – నిర్దోషిగా విడుదలైన అప్పు  

Brahmamudi Today Episode: శ్రీను కోసం వెళ్లిన రాజ్‌ను రౌడీలు తల మీద కొట్టడంతో స్పృహ కోల్పోతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: అప్పు కేసు హియరింగ్‌ నడుస్తుంది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అప్పు చేసింది తప్పే అని నిరూపించడానికి ప్రయత్నిస్తుంటాడు. కావ్యను పిలిచి ప్రశ్నిస్తాడు.

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌: తప్పు చేసిన శ్రీను ఇంటికి మీరు ఎందుకు వెళ్లారు..?

కావ్య: ఎందుకు అలా చేశారో అడగడానికి వెళ్లాను

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌: అయితే అబద్దం చెప్పించడానికి వెళ్లారా

కావ్య: అది మీరు చెప్తే ఎలా

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌: మీరు చెప్పేదంతా కోర్టు నమ్మాలి కదా.? ఇక మీరు వెళ్లొచ్చు… విన్నారు కదా మైలార్డ్‌ శ్రీనును కోర్టుకు రాకుండా చేస్తే.. కేసు నుంచి బయట పడొచ్చని అక్కా చెల్లెలు కలిసి ప్లాన్‌ చేశారు

అప్పు: నో మైలార్డ్‌ నేను ఏ తప్పు చేయలేదు. శ్రీను ఎక్కడ ఉన్నాడో కూడా నాకు తెలియదు. అయినా ఒక పోలీస్‌ అయి ఉండి కేసు విచారణ జరిగే టైంలో సాక్షిని కలవకూడదని నాకు తెలియదా..? నేను ఎందుకు కలుస్తాను

జడ్జి: అపూర్వ గారు మీరు పోలీస్‌ అయ్యుండి కోర్టులో ఎలా ఎప్పుడు మాట్లాడాలో తెలియదా..?

అప్పు:  సారీ మైలార్డ్‌

టెన్షన్‌ పడుతున్న కావ్య.. రాజ్‌ వస్తున్నాడేమో చూడ్డానికి బయటకు వెళ్లిపోతుంది.

కావ్య: ఈయన ఇంకా రాలేదేంటి..

యామిని: ఏంటి కావ్య భయం వేస్తుందా..? ఆర్గుమెంట్స్‌ లోపల జరుగుతుంటే.. నువ్వేంటి ఇలా గుమ్మం ముందు వెయిట్‌ చేస్తున్నావు. ఓ బావ సాక్ష్యం సంపాదించడానికి వెళ్లాడు అని చెప్పావు కదా..? వచ్చాడా..? అసలు వస్తాడా..? గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకుంటున్నావు. నీ చేతులతో నీ చెల్లెలు జీవితాన్ని పాడు చేస్తున్నావు. ఇలా నువ్వు బావ కోసం వెయిట్‌ చేస్తూ ఉండు.. లోపల నీ చెల్లికి జడ్జి గారు శిక్ష వేస్తారు

కావ్య: యామిని…

యామిని: ఏంటి కోపం వచ్చిందా..? తను జైలుకు వెళ్తుంది అంటేనే నువ్వు తట్టుకోలేవు.. ఇక నిజంగా వెళితే ఏలా తట్టుకుంటావు కావ్య.. నా మాట విని నేను చెప్పినట్టు విని ఇప్పటికైనా ఒప్పుకో కావ్య

కావ్య: ఒప్పుకోను అసలు ఒప్పుకోను పైన దేవుడు అనే వాడు ఒకడున్నాడు. ఆయన కచ్చితంగా సాక్షిని తీసుకుని వస్తారు.. నా చెల్లిని కాపాడతారు..

యామిని: నీదంతా బ్రమ యామిని.. వాస్తవంగా నీ చెల్లి తప్పించుకోలేదని నీకు కూడా తెలుసు.. పద కాసేపట్లో జడ్జి గారు వేసే శిక్ష విందాం

అని చెప్పి యామిని లోపలికి వెళ్లిపోతుంది. రౌడీల దగ్గర ఉన్న శ్రీను అమ్మను చూడాలి ఒక్కసారి ఇంటికి వెళ్లి వస్తాను అని బతిమాలుతుంటే రౌడీలు అందుకు ఒప్పుకోరు. దీంతో శ్రీను బలవంతంగా వెళ్లబోతుంటే.. రౌడీలు కొట్టబోతారు. ఇంతలో రాజ్‌ అక్కడికి వచ్చి రౌడీలను కొట్టి శ్రీనును తీసుకుని కారు దగ్గరకు రాగానే వెనక నుంచి ఒక రౌడీ పెద్ద కర్ర తీసుకుని వచ్చి రాజ్‌ తల మీద కొడతాడు. రాజ్‌ స్పృహ తప్పి కింద పడిపోతాడు. కోర్టులో వాదొపవాదాలు జరగుతుంటాయి.

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌: అప్పు తప్పు చేసిందని ఫ్రూవ్‌ అయింది. వెంటనే ఈమెకు శిక్ష వేసి న్యాయాన్ని కాపాడాలని కోరుతున్నాను

జడ్జి: మీరు ఏదైనా చెప్పేది ఉందా..?

అప్పు లాయర్‌: లంచం ఇచ్చిన శ్రీను కోర్టుకు హాజరు కాలేదు. కొంచెం టైం ఇస్తే తగిన సాక్ష్యాలు కోర్టుకు సమర్పిస్తాను.

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌: అబ్జక్షన్‌ యువరానర్‌.. ఇప్పటికే సాక్షిని కనిపించకుండా చేశారు. తక్షణమే అతన్ని వెతికించి అతనికి న్యాయం చేయాలని అప్పుకు వెంటనే శిక్ష వేయాలని కోరుతున్నాను.

అప్పు తప్పు చేసిందని ప్రూవ్‌ అయింది. అందుకే అంటూ జడ్డి శిక్ష గురించి చెప్పబోతుంటే.. రాజ్‌ , శ్రీనును తీసుకుని వస్తాడు. శ్రీను తాను కావాలనే అప్పును ఇరికించడానికి ఇదంతా చేశానని చెప్తాడు. ఎందుకు చేశావని జడ్జ అడిగితే డబ్బు కోసం ఇదంతా  చేశానని ఒక లేడీ తనకు డబ్బు ఇచ్చి ఇదంతా చేయించిందని యామిని పేరు బయటకు చెప్పడు దీంతో యామిని ఇరిటేటింగ్‌గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జడ్జి అప్పును నిర్దోషిగా విడుదల చేస్తాడు. శ్రీనుకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
Godavari Serial Today August 14th: 'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
Nindu Manasulu Serial Today August 14th: నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!
నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!
Podarillu Serial Today August 14th: నారాయణ కుటుంబం గుడికి రాకుండా తాయారు ఏం చేసింది..? మహాలక్ష్మీ ఎలా దీటుగా జవాబిచ్చింది.
పొదరిల్లు: నారాయణ కుటుంబం గుడికి రాకుండా తాయారు ఏం చేసింది..? మహాలక్ష్మీ ఎలా దీటుగా జవాబిచ్చింది.

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget