అన్వేషించండి

Brahmamudi Serial Today January 31st:  ‘బ్రహ్మముడి’ సీరియల్ :  స్వప్న అకౌంట్‌ లోంచి డబ్బులు కొట్టేసిన రాహుల్‌ – రుద్రాణి అకౌంట్‌ హ్యాక్‌ చేసిన స్వప్న

Brahmamudi Today Episode: స్వప్న రాహుల్‌ ఒకరి అకౌంట్‌ను మరోకరు హ్యాక్‌ చేసి డబ్బులు కొట్టేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఫన్నీగా జరిగింది.    

Brahmamudi Serial Today Episode: కావ్య ముందు తానే గొప్ప అని నిరూపించుకునేందుకు రాజ్‌ ప్రయత్నిస్తాడు. అందుకోసం కావ్య వేసిన డిజైన్‌ నెక్లెస్‌ ను వేలంలో ఎక్కువ రేటుకు అమ్మాలనుకుంటాడు. అందుకోసం ఆన్‌లైన్‌ ఆక్షన్‌ నిర్వహిస్తాడు. అందులో తన ఫ్రెండ్‌ సూరజ్‌ పాల్గొని నెక్లెస్‌ రేటు ఎక్కువ పెరిగేలా చేస్తాడు. అనుకున్నట్టుగానే.. 25 లక్షల నెక్లెస్‌ ను రాజ్‌ తన తెలివితో కోటి ఎనభై లక్షలకు అమ్మిస్తాడు. దీంతో కావ్య ఆశ్చర్యపోతుంది.   

రాజ్‌: నువ్వు ఊహించిన రేటు ఎంత..?

కావ్య: 25 లక్షలు..

రాజ్‌: వచ్చింది ఎంత..?

కావ్య: కోటి ఎనభై లక్షలు

రాజ్‌: సో నువ్వు ఎంత కష్టపడి డిజైన్‌ వేశావో ఎంత క్రియేటివ్‌గా డిజైన్‌ వేశావో అన్నది పాయింటా..? దాన్ని ఇంత రేటుకు అమ్మడం పాయింటా..?

కావ్య: మహానుభావ మీరే గ్రేటు.. ఒప్పుకున్నాను.

రాజ్‌: నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేనే గ్రేట్‌..

కావ్య: అవును అంటున్నానుగా..

రాజ్: ఇంకెప్పుడు డిజైనర్‌ సీఈవో గ్రేట్‌ అనకు..

కావ్య: కలలో కూడా అనను..

రాజ్‌: ఇక్కడుంది స్వరాజ్‌ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంటాడు.

అని చెప్పగానే.. కావ్య కూడా ఒప్పుకుంటున్నాను మహానుభావ అంటుంది. మరోవైపు స్వప్న తన ప్లాట్‌ లో రెంట్‌కు ఉన్న వ్యక్తికి ఫోన్‌ చేసి రెంట్‌ ఇంకా పే చేయలేదని అడుగుతుంది. లేదు మేడం ఇప్పుడే రెండు లక్షలు మీకు సెండ్‌ చేశాను. చూసుకోండి అని చెప్తాడు. స్వప్న సరే అంటుంది. దూరం నుంచి అంతా వింటున్న రుద్రాణి, రాహుల్‌ బాధపడతారు. మనం చిల్లర కోసం కష్టపడుతుంటే అది మా నాన్న ఇచ్చిన ఆస్థితో హ్యపీగా ఉంది చూడు అంటుంది రుద్రాణి. అవును మమ్మీ అంటూ రాహల్‌ బాధపడతాడు. తర్వాత ఇద్దరూ కలిసి ప్లాన్‌ ప్రకారం  స్వప్నకు ఫోన్‌ లో లింక్‌ పంపించి అకౌంట్‌ లో డబ్బులు కొట్టేస్తారు. డబ్బులు పోయాయని స్వప్న బాధపడుతుంటే చూసి నవ్వుకుంటారు. సూరజ్‌, రాజ్‌ ఆఫీసుకు వస్తాడు. ఆక్షన్‌ విషయంలో కంగ్రాట్స్‌ చెప్తాడు.

రాజ్‌: చెప్పరా..? ఏంటి ఇలా వచ్చావు.

సూరజ్: గుడ్‌ న్యూస్‌ తో వచ్చానురా..? అరేయ్‌ గుడ్‌ న్యూస్‌ అంటే హ్యాపీగా చూస్తావనుకుంటే ఆశ్యర్యగా చూస్తావేంట్రా..?

రాజ్‌: ఆ పదం విని చాలా రోజులైందిరా..? అందుకే అలా అనిపించింది.

సూరజ్: మీ డిజైన్స్‌ అమెరికా క్లయింట్స్‌కు బాగా నచ్చాయి. వాళ్లతో మీటింగ్‌ అరైంజ్‌ చేశాను. మీరు అమెరికా వెళ్లి వాళ్లకు మీ డెమో ఇస్తే కాంట్రాక్ట్‌ ఓకే చేసుకోవచ్చు.

కావ్య: కంగ్రాట్స్‌ అండి ఎప్పుడు వెళ్తున్నారో చెప్పండి లగేజీ మొత్తం సర్దేస్తాను.

సూరజ్: వాడొక్కడే కాదండి.. మీరు కూడా వెళ్లాలి.  వీసా త్వరగా వచ్చేలా చేసుకోండి

అంటూ చెప్పి వెళ్లిపోతాడు సూరజ్‌. కావ్య ఆశ్యర్యంతో గంతులేస్తుంది. తీన్మార్‌ డాన్స్‌ చేస్తుంది. మరోవైపు రాహుల్‌ రుద్రాణి కలిసి తన డబ్బులు కొట్టేశారని తెలుసుకున్న స్వప్న ఎలాగైనా వాళ్లను బోల్తా కొట్టించాలని స్వప్న కూడా ఒక లింక్‌ రాహుల్‌కు పంపిస్తుంది. రాహుల్‌ అది క్లిక్‌ చేయగానే.. అకౌంట్‌ లో డబ్బులు మొత్తం స్వప్న అకౌంట్‌ లోకి వెళ్తాయి. దీంతో రాహుల్‌, రుద్రాణి లబోదిబోమంటారు. స్వప్న వచ్చి వెటకారంగా డబ్బులు పోయాయా అని అడుగుతుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు షాక్ - బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన ఏసీబీ కోర్టు
ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు షాక్ - బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన ఏసీబీ కోర్టు
Telangana News: రోహిణ్ రెడ్డి, సుమంత్ గన్నులతో బెదిరించారు - కేసు నమోదు చేయాలి - పోలీసులకు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
రోహిణ్ రెడ్డి, సుమంత్ గన్నులతో బెదిరించారు - కేసు నమోదు చేయాలి - పోలీసులకు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
NRI arrest in US: అమెరికాలో భార్యపై వేధింపులు -  కాలిఫోర్నియాలో తిరుపతి NRI జెస్వంత్  అరెస్టు
అమెరికాలో భార్యపై వేధింపులు - కాలిఫోర్నియాలో తిరుపతి NRI జెస్వంత్ అరెస్టు
Chiranjeevi: పర్మిషన్ లేకుండా 'మెగాస్టార్' ట్యాగ్ వాడొద్దు - చిరంజీవి పర్సనాలిటీ రైట్స్‌కు కోర్టు రక్షణ
పర్మిషన్ లేకుండా 'మెగాస్టార్' ట్యాగ్ వాడొద్దు - చిరంజీవి పర్సనాలిటీ రైట్స్‌కు కోర్టు రక్షణ
Advertisement

వీడియోలు

Vizag Google Data Centre Controversy | వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ పై ప్రశ్నలకు సమాధానాలేవి..? | ABP
Aus vs Ind 2nd ODI Highlights | రెండు వికెట్ల తేడాతో భారత్ పై రెండో వన్డేలోనూ నెగ్గిన ఆసీస్ | ABP Desam
Netaji Subhash Chandra Bose | నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ చరిత్ర | ABP Desam
కోహ్లీ భయ్యా.. ఏమైందయ్యా..? అన్నీ గుడ్లు, గుండు సున్నాలు పెడుతున్నావ్!
గిల్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చిన పాకిస్తాన్ ఫ్యాన్‌.. ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు షాక్ - బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన ఏసీబీ కోర్టు
ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు షాక్ - బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన ఏసీబీ కోర్టు
Telangana News: రోహిణ్ రెడ్డి, సుమంత్ గన్నులతో బెదిరించారు - కేసు నమోదు చేయాలి - పోలీసులకు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
రోహిణ్ రెడ్డి, సుమంత్ గన్నులతో బెదిరించారు - కేసు నమోదు చేయాలి - పోలీసులకు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
NRI arrest in US: అమెరికాలో భార్యపై వేధింపులు -  కాలిఫోర్నియాలో తిరుపతి NRI జెస్వంత్  అరెస్టు
అమెరికాలో భార్యపై వేధింపులు - కాలిఫోర్నియాలో తిరుపతి NRI జెస్వంత్ అరెస్టు
Chiranjeevi: పర్మిషన్ లేకుండా 'మెగాస్టార్' ట్యాగ్ వాడొద్దు - చిరంజీవి పర్సనాలిటీ రైట్స్‌కు కోర్టు రక్షణ
పర్మిషన్ లేకుండా 'మెగాస్టార్' ట్యాగ్ వాడొద్దు - చిరంజీవి పర్సనాలిటీ రైట్స్‌కు కోర్టు రక్షణ
TFJA New Committee: టీఎఫ్‌జేఏ నూతన కార్యవర్గం... అధ్యక్షుడిగా వైజే రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నిక
టీఎఫ్‌జేఏ నూతన కార్యవర్గం... అధ్యక్షుడిగా వైజే రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నిక
Electricity Bill: ఇంటిలోని ఈ 5 వస్తువుల వల్లే ఎక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది!
ఇంటిలోని ఈ 5 వస్తువుల వల్లే ఎక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది!
పోలీసులు, అంబులెన్స్ కు ఫోన్ చేయకుండా.. జనాలు ఫోన్లో వీడియో తీస్తున్నారు:  కర్నూలు ప్రమాదంపై ప్రత్యక్షసాక్షి
పోలీసులు, అంబులెన్స్ కు ఫోన్ చేయకుండా.. జనాలు ఫోన్లో వీడియో తీస్తున్నారు: ప్రత్యక్షసాక్షి
Kurnool Bus Mishap Exgratia: కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
Embed widget