అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Brahmamudi Serial Today January 30th: కావ్యను తన కారులో ఆఫీసుకు పంపిన అపర్ణ – మరో రుద్రాణిలా అనామిక మారుతుందన్న ప్రకాష్

Brahmamudi Today Episode: కావ్యను రాజ్ ఆఫీసుకు తీసుకెళ్లకపోవడంతో అపర్ణ తన కారులో కావ్యను ఆఫీసుకు పంపించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: బెడ్‌రూంలో కళ్యాణ్‌ కవితలు రాస్తూ కూర్చుని ఉంటాడు ఇంతలో అనామిక వచ్చి ఏం చేస్తున్నావు కళ్యాణ్‌ అని అడుగుతుంది. కళ్యాణ్‌ పలకకుండా అలాగే కవితలు రాస్తుంటాడు. అనామిక కోపంగా  ఏం చేస్తున్నావని అడుగుతుంది. కళ్యాణ్‌ పలకకుండా

కళ్యాణ్‌: నేను కవిని కాదన్నవాడిని కలంతో పొడుస్తాను.  నాకు రాయడం రాదన్నవాడినిన రాయిచ్చుకు కొడతాను.

అనామిక: కళ్యాణ్‌.. (గట్టిగా ఆరుస్తుంది)

కళ్యాణ్‌: పిలిచావా అనామిక.

అనామిక: లేదు మూలిగాను.  

  అంటూ కోపంగా అనామిక నువ్వు ఇంట్లో ఖాలీగా ఎందుకు కూర్చున్నావు. అంటూ ఈ కవితలు రాయడం ఆపేసి ఆఫీసుకు వెళ్లు అని చెప్తుంది. దీంతో కళ్యాణ్‌ నేను ఆఫీసుకు వెళ్లి అక్కడ ఏం చేయాలో చెప్పు.. నాది బిజినెస్‌ మైండ్‌ కాదు.. అంటూ మళ్లీ కవితలు మొదలు పెట్టగానే అనామిక సీరియస్‌గా తిడుతూ కళ్యాణ్‌ను వెంటనే ఆఫీసుకు వెళ్లాలని పట్టుబడుతుంది. ఇవాళ కావ్య వెళ్లింది. రేపు స్వప్న కూడా వెళ్లుతుంది. నువ్వు మాత్రం కవితలు రాసుకుంటూనే కూర్చుంటావా? అనగానే సరేలే ఆలోచిస్తాను అంటాడు కళ్యాణ్‌. మరోవైపు రాజ్‌ కారులో తీసుకెళ్లకపోవడంతో బయటే నిలబడి అటు ఇటు తిరుగుతుంది కావ్య. కావ్యను గమనించిన అపర్ణ లోపలికి పిలుస్తుంది. లోపలికి వచ్చిన కావ్యను ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నావు టైంకు ఆఫీసుకు వెళ్లాలని తెలియదా? అని అడుగుతుంది. క్యా్‌బ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాను అని కావ్య చెప్పగానే.. మీకు షేర్‌ అటోలో  వెళ్లడం అలవాటేగా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది ధాన్యలక్ష్మీ. దీంతో కోపంగా అపర్ణ..

అపర్ణ: కావ్య ఈ ఇంటికి ఈ వంశానికి పెద్ద కోడలు. ఆటోల్లో వెళ్లాల్సిన కర్మ ఈ ఇంటి కోడలుకు లేదు.

ఇందిరాదేవి: బాగా చెప్పావు అపర్ణ

అనగానే అపర్ణ వెళ్లి తన కారు కీస్‌ తీసుకొచ్చి కావ్యకు ఇస్తుంది.

అపర్ణ: నువ్వు నా కారులో వెళ్లు బయట డ్రైవర్‌ యాదగిరి ఉన్నాడు తీసుకుని వెళ్లు నువ్వు ఎందులోనూ తక్కువగా ఫీల్‌ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఇంటి వారసుడి భార్య హోదాలో ఆఫీసుకు వెళ్తున్నావు. నువ్వక్కడ ఖరీదైన కారులోంచి దిగితేనే ఈ ఇంటికి గౌరవంగా ఉంటుంది. తాళాలు తీసుకో.. ఎక్కువ మాట్లాడితే నీకు అన్నింటికన్నా ఖరీదైన కారు నేను కొనిపెడతాను. మొదటిసారి వెళ్తున్నావు.. మంచిరోజు వెళ్తున్నావు.. సంతోషంగా వెళ్లు.. దర్జాగా వెళ్లు.

ఇందిరాదేవి: మంచి నిర్ణయం తీసుకున్నావు అపర్ణ. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఇంటి కోడలు స్థాయి పెంచావు.  

  అనగానే కావ్య .. ఇందిరాదేవి, అపర్ణ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుని  వెళ్లిపోతుంది. ధాన్యలక్ష్మీ మాత్రం బాధపడుతూనే ఉంటుంది. మరోవైపు ప్రకాష్‌ రూంలో రెడీ అవుతుంటాడు. ఇంతలో ధాన్యలక్ష్మీ వచ్చి ప్రకాష్‌ను  తిడుతుంది. కావ్యను ఆఫీసుకు పంపిస్తుంది. కళ్యాణ్‌ ను ఎవరూ కూడా గుర్తించడం లేదని బాధపడతుంది. దీంతో ప్రకాష్‌ కోడలు రాగానే నీకు ఇగోలు చాలా పెరిగిపోయాయి.. ఆ కోడలును చూస్తే మరో రుద్రాణిలా కనిపిస్తుంది. అంటూ ప్రకాష్‌ వెళ్లిపోతాడు. మరోవైపు అప్పు ఇంటికి వచ్చి తన ఫ్రెండ్‌ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ.. ఫ్రెండ్స్‌ కూడా నా ప్రేమలో అంతా డబ్బే చూస్తున్నారు. కనిపిస్తున్నాడు కదా అని చేతికి అందుతాడు అనుకున్న కానీ అందనంత ఎత్తులో ఉన్నాడని తెలుసుకోలేకపోయా అని మనసులో అనుకుంటుంది. ఇంతలో కనకం అప్పుకు భోజనం తీసుకుని వస్తుంది. అప్పటికే అప్పు నిద్రపోయి ఉంటుంది. ఎప్పటిలాగే ఆఫీస్‌ లోపలికి వెళ్లున్న రాజ్‌  ఎంప్లాయిస్‌ అందరూ ప్లవర్‌ బోకేలతో నిలబడి ఉండటం చూసి షాక్‌ అవుతాడు. నేనేమైనా కొత్తగా వస్తున్నానా అని అడగడంతో లేదని కొత్త మేడం వస్తున్నారు ఆమె కోసమే వెయిట్‌ చేస్తున్నాం అంటారు. నాకు తెలియకుండా ఎవరు అని అడగడంతో ఇంతలో కావ్య వచ్చి కారు దిగి లోపలికి వస్తుంది. అందరూ కావ్యకు గ్రాండ్‌ వెళ్కం చెప్తారు. రాజ్‌ జెలసీగా ఫీలవుతాడు. శృతిని లోపలికి పిలిచి ఎడాపెడా వాయిస్తాడు రాజ్‌. అయితే ఇదంతా సుభాష్‌ సారే చేయమన్నారని శృతి చెప్పడంతో రాజ్‌ కామ్‌గా ఉంటాడు. అయితే కావ్య మేడం గారికి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ మీ చేతుల మీదుగానే ఇవ్వమని సుభాష్‌ సారే చెప్పారు అనగానే రాజ్‌ అయిష్టంగానే అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ కూడా ఇస్తాడు. 

కావ్య: నా సీటు ఎక్కడ?

రాజ్‌: బయట గేటు దగ్గర స్టూలు ఉంటుంది అక్కడ కూర్చొపో..

కావ్య: హలో ఎగ్జిక్యూటివ్‌ డిజైనర్‌ ఇక్కడ

రాజ్‌: ఏయ్‌ నీ ఇష్టం ఉన్నచోట కూర్చోపో..

కావ్య: అయితే మీరు లేవండి మీ సీట్లో కూర్చుంటాను.

రాజ్‌: ఏయ్‌ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు..

కావ్య: మీరు చాలా తక్కువ చేస్తున్నారా?

రాజ్‌: నేనేం చేస్తున్నాను.

అని అడగ్గానే ఏం చేస్తున్నారో.. ఏం చేయబోతున్నారో అన్ని తేల్చుకోవడానికే వచ్చానని కావ్య చెప్పగానే రాజ్‌ షాక్‌ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: తల్లికి 'పద్మవిభూషణుడి' స్పెషల్‌ బర్త్‌డే విషెష్‌ - ఆకట్టుకుంటున్న ఫొటోలు, మురిసిపోతున్న మెగా ఫ్యాన్స్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget