అన్వేషించండి

Brahmamudi Serial Today January 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కావ్యకు అన్నం తినిపించిన రాజ్ - రాజ్ ఫోన్ చూసి షాకైన కళ్యాణ్

Brahmamudi Today Episode: రాజ్, శ్వేత ల మధ్య ఉన్న రిలేషన్ ఎంటో తెలుసుకోవాలని కావ్య, కళ్యాణ్ కలసి రాజ్ ఫోన్ ఓపెన్ చేసి చూస్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: బాధతో అలిగిపడుకున్న కావ్య దగ్గరకు రాజ్‌ వచ్చి ఎందుకు ఇలా ఉన్నావని అడుగుతాడు. ఏం లేదని కావ్య చెప్తుంది.  తిన్నావా అని రాజ్‌ అడుగుతే ఇవాళ ఎవరితో తిట్లు  తినలేదని వెటకారంగా రిప్లై ఇస్తుంది. దీంతో రాజ్‌ బయటకు వెళ్లిపోతాడు. కావ్య ఆలోచిస్తూ ఉండగా ఇంతలో రాజ్‌ భోజనం ప్లేట్‌ తీసుకుని వచ్చి కావ్య చేతులు కట్టేసి భోజనం తినిపిస్తుంటాడు. కావ్య అన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ భోజనం చేస్తుంది. తర్వాత రాజ్‌ టాబ్లెట్స్‌ ఇస్తాడు కావ్యకు. తర్వాత ఇంక తీరిగ్గా పడుకో నేను హాయిగా పడుకుంటాను అని రాజ్‌ చెప్తుండగానే శ్వేత కాల్‌ చేస్తుంది. రాజ్‌ తనకు అర్జెంట్‌ కాల్‌ వస్తుంది. నేను మాట్లాడి వస్తాను అంటూ బయటకు వెళ్తాడు. కావ్య బాధగా చూస్తూ.. కృష్ణుడి విగ్రహం దగ్గరకు వెళ్లి..

కావ్య: కృష్ణ నీ మాయలో నేను పడుతున్నానా? ఎనిమిది మంది భార్యలలో ఒక భార్య దగ్గరుంటే మిగతా ఏడుగురి భార్యలను నువ్వు ఎం మాయ చేసి ఎలా మభ్యపెట్టి నీ పబ్బం గడుపుకున్నావో.. నాకు అర్థం కావడం లేదు. ఇందాక నా గదిలో ఒక మాయ జరిగింది. నా భర్త నాకు భోజనం తినిపించాడు. అప్పుడు ఏమీ అనకుండా నా చేతులు కట్టేశాడు. ఆ గోరు ముద్దల రుచి చూసి నా నోరు నేనే కట్టేసుకున్నాను. ఇలాంటిదేనా నువ్వు కూడా ఉపయోగించింది. మా ఆయన నీలాగే చేస్తున్నట్లు అనిపించింది. అప్పటిదాకా నాతో ఉండి ఆ తర్వాత ఇంకెవరితోనో ఆనందంగా ఉండి అసలు ఆయన ఏం చేయాలనుకుంటున్నారు. ఏది సత్యం ఏది అసత్యం ఈరెండిటి మధ్య ఉన్న గీత మీద నేనున్నాను. గీత చెప్పినట్లు నువ్వే నా సమస్యను పరిష్కరించాలి.

అంటూ కృష్ణున్ని వేడుకుంటుంటే ఇంతలో బామ్మ వచ్చి కావ్యను ఇక్కడేం చేస్తున్నావని అడగ్గానే రాజ్‌ విషయాన్ని ఇన్‌డైరెక్టుగా తన ఫ్రెండ్‌కు జరిగిన సంఘటన అని చెప్తుంది. దీంతో ప్రశ్నించాలని.. అనుమానంతో ఉండటం కన్నా భర్తను నిలదీసి అడగాలని సూచిస్తుంది. దీంతో కావ్య కృష్ణుడి వైపు చూసి ఈ విధంగా నాకు దారి చూపావా జగద్గురు అని  మనసులో అనుకుంటుంది. నువ్వు ప్రశాంతంగా పడుకో రేపు మీ ఫ్రెండుకు చెప్పు అని బామ్మ వెళ్లిపోతుంది.

కావ్య: నిజంగా నువ్వు అమ్మమ్మతో నా కర్తవ్యాన్ని చెప్పించావు స్వామి. ముందు ఆ ఇద్దరి మధ్య ఉన్నదేంటో కనుక్కుంటాను.  

కళ్యాణ్‌, కావ్య మాట్లాడుకుంటుంటారు.

కావ్య: అమ్మమ్మగారు నా ఫ్రెండు కోసం ఇచ్చిన సలహా పాటించాలంటే ఏం చేయాలో.. ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియడం లేదు కవిగారు.

కళ్యాణ్‌: ఒక కవి నుంచి కవిత్వం రావాలంటే భావావేశం రావాలి. ఒక భార్య నుంచి విప్లవం రావాలంటే ప్రేమావేశం రావాలి. ప్రేమ ప్లస్‌ ఆవేశం ఈ రెండు కావాలి. మీకెలాగు అన్నయ్య ప్రేమ ఉంది ఇక రావాల్సింద ఆవేశమే..

కావ్య: ఆవేశం తెచ్చుకుంటే ఆయాసం తప్ప ఇంకేం మిగులుతుంది కవిగారు. మీ అన్నయ్య దగ్గరకు వెళ్లి మీకు ఆ అమ్మాయికి ఏంటి సంబంధం చెప్పండి  అని నిలదీస్తే బాగుండదు కదా?

కళ్యాణ్‌: అందుకే వదిన మనం నవ్వినట్లే ఉండాలి. చేసేది చేస్తూనే ఉండాలి. ఏమీ ఎరుగనట్లు నటించాలి. అన్నీ తెలసుకుంటూనే ఉండాలి.

కావ్య: అసలు ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి కవిగారు.

కళ్యాణ్‌: ఆ కాలంలో షర్ట్‌కు అంటిన కుంకుమ బొట్టు వల్లో.. పొడుగాటి తల వెంట్రుకల వల్లో గుర్తు పట్టేవారు. ఈ కాలంలో కనిపెట్టాలంటే సులువైన పద్దతి ఎప్పుడో కనిపెట్టారు. అదే సెల్‌ఫోన్‌. ముందు అన్నయ్య సెల్‌ఫోన్‌ నుంచి మొదలుపెడదాం.

కావ్య: అంటే చాటింగ్‌ చెక్‌ చేద్దామా?

కళ్యాణ్‌: అవును అప్పుడే మనం చీటింగ్‌ గురించి తెలుసుకోవచ్చు.

 అని ఇద్దరూ ప్లాన్‌ వేసుకుని రాజ్‌ బెడ్‌ రూం దగ్గరకు వస్తారు. రాజ్‌ ఫోన్‌లో శ్వేతతో చాట్‌ చేస్తుంటాడు. అన్నయ్య బాత్రూంలోకి వెళ్లగానే  ఫోన్‌  తీసుకొని చెక్‌ చేద్దాము అంటూ కళ్యాణ్‌ చెప్తుండగానే రాజ్‌ బాత్రూంలోకి వెళ్తాడు. కావ్య లోపలకి వెళ్లి రాజ్‌ ఫోన్‌ తీసుకురావడానికి భయపడి ఉత్తి చేతులతో బయటకు వస్తుంది. మీకు సంస్కారం ముఖ్యమా..? మీ సంసారం ముఖ్యమా అని కళ్యాణ్‌ అడుగుతాడు. నాకు సంసారమే ముఖ్యం కానీ నా మనసు ఎందుకో ఒప్పుకోవడం లేదు  అంటుంది కావ్య.. అయితే మీరు నాకు అమ్మ తర్వాత అమ్మ లాంటి వారు నేను మీకోసం ధైర్యం చేస్తాను. అంటూ కళ్యాణ్‌ లోపలికి వెళ్ళి ఫోన్‌ తీసుకొచ్చి ఒపెన్‌ చేసి చూసి షాక్‌ అవుతాడు. కావ్య కంగారుపడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ : చేదు వార్త చెప్పిన ప్రియాంక.. బిగ్‌బాస్‌కు వెళ్లకుండా ఉండాల్సిందంటూ ఏడ్చిన నటి

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 23rd: 'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!
'గోదావరి' సీరియల్: ఇద్దరి మధ్య అది జరిగిందే.. బామ్మ సందడి! ఒకే బెడ్ మీద నందు, మురళీ! సింహాద్రి భయానికి కారణం!
Nindu Manasulu Serial Today July 23rd: నిండు మనసులు: రేపటి నుంచి గణ 2.0..! తల్లిలా చూసుకుంటా అన్న ఇందిరకు గణ చెప్పిన సమాధానం ఏంటి?
నిండు మనసులు: రేపటి నుంచి గణ 2.0..! తల్లిలా చూసుకుంటా అన్న ఇందిరకు గణ చెప్పిన సమాధానం ఏంటి?
Illu Illalu Pillalu Serial Today July 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అక్క కాళ్లు కడిగి కన్నీరు పెట్టుకున్న వేదవతి! రామరాజు ఇంట్లో సందడే సందడి!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అక్క కాళ్లు కడిగి కన్నీరు పెట్టుకున్న వేదవతి! రామరాజు ఇంట్లో సందడే సందడి!
Podarillu Serial Today July 23th:డ్రైవింగ్ లైసెన్స్‌ తెచ్చుకున్న మహా...శైలూకు పెళ్లిచూపులతో ఇంట్లో గొడవలు
పొదరిల్లు: డ్రైవింగ్ లైసెన్స్‌ తెచ్చుకున్న మహా...శైలూకు పెళ్లిచూపులతో ఇంట్లో గొడవలు

వీడియోలు

Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్‌లు రెడీ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
Embed widget