Brahmamudi Serial Today January 13Th - ‘బ్రహ్మముడి’ సీరియల్: అప్పుకు బ్లడ్ ఇచ్చిన కళ్యాణ్, ప్రాణాపాయం నుంచి బయటపడినట్లేనా? అనామిక అలక
Brahmamudi Today Episode: అప్పుకు బ్లడ్ ఇచ్చి కళ్యాణ్, కావ్య ఇంటికి రావడంతో అందరూ మళ్లీ కావ్యను తిడతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్ గా జరిగింది.
![Brahmamudi Serial Today January 13Th - ‘బ్రహ్మముడి’ సీరియల్: అప్పుకు బ్లడ్ ఇచ్చిన కళ్యాణ్, ప్రాణాపాయం నుంచి బయటపడినట్లేనా? అనామిక అలక brahmamudi serial today episode January 13Th written update Brahmamudi Serial Today January 13Th - ‘బ్రహ్మముడి’ సీరియల్: అప్పుకు బ్లడ్ ఇచ్చిన కళ్యాణ్, ప్రాణాపాయం నుంచి బయటపడినట్లేనా? అనామిక అలక](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/13/0d6823e540dea1f0fd30e7ab462590be1705113784255879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Brahmamudi Serial Today Episode: కళ్యాణ్ హాస్పిటల్‌కు వచ్చి అప్పుకు బ్లడ్ ఇవ్వడంతో డాక్టర్ అవుటాఫ్ డేంజర్ అని చెప్తాడు. దీంతో కావ్య, కనకం, మూర్తి రిలీఫ్ అవుతారు. కళ్యాణ్‌కు చేతులెత్తి మొక్కుతారు. మీరు మాకు దేవుడితో సమానం అంటారు. దీంతో అంత మాట అనొద్దని ఆ దేవుడు నా ఫ్రెండ్‌ను సేవ్ చేసుకునే అదృష్టం నాకు ఇచ్చాడంతే.. అనడంతో మీరు పూజ మధ్యలో వచ్చారు ఇక బయలుదేరండి వెళ్లి పూజ కంప్లీట్ చేసుకోండి అనడంతో కావ్య, కళ్యాణ్ ఇంటికి వెల్లిపోతారు. ఇంట్లో అందరూ కళ్యాణ్ కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతలో కావ్య, కళ్యాణ్ ఇంటికి వస్తారు. బామ్మ అప్పుకు ఎలా ఉందని అడుగుతుంది.
కావ్య: క్షమించండి అమ్మమ్మ సడెన్‌గా ఫోన్ రావడంతో నా కాళ్లు చేతులు ఆడలేదు. అందరితో చెప్పి బాధపెట్టడం ఎందుకని వెళ్లిపోయాను. సమయానికి కళ్యాణ్ గారు వచ్చి అప్పు ప్రాణాలు నిలబెట్టారు.
అందరూ రిలీఫ్ గా ఊపిరి పీల్చుకుంటారు. అనామిక మాత్రం కోపంగా చూస్తుంటుంది. కావ్య అనామిక దగ్గరకు వెళ్లి సారీ చెప్తుంది.
ధాన్యలక్ష్మీ: అదేంటి నువ్వు క్షమించమని అడగడమేంటి? ఈ ఇంట్లో ఏదైనా తలపెడితే అందులో నువ్వు తలపెడతావు కదా? అలా తలదూర్చి అన్ని చెడగొట్టడం నీ జన్మహక్కు కదా?
కావ్య: చిన్నత్తయ్యా అంతా తెలిసి, అన్నీ తెలిసిన మీరే ఇలా మాట్లాడుతున్నారా? అవతల నా చెల్లెలు ప్రాణాపాయంలో ఉంటే వెళ్లకుండా ఎలా ఉంటాను. అది కూడా తప్పంటే ఎలా?
ధాన్యలక్ష్మీ: నువ్వు మాట్లాడకు.. అసలు పూజ మొదలుకాకముందే దీపపు కుందీ కింద పడేశావు. అప్పుడే అనుకున్నాను ఈ మహాతల్లి వల్ల పూజ ఆగిపోతుందేమోనని.. అదే జరిగింది.
కళ్యాణ్: అమ్మా వాంటెడ్‌గా వదిన ఏమీ చేయలేదు. ఇంకా అప్పు కోలుకోకముందే వదినే నన్ను బలవంతంగా ఇక్కడకు తీసుకొచ్చింది.
ధాన్యలక్ష్మీ: ఓ.. ఈవిడ బలవంతంగా తీసుకురాకపోయి ఉంటే నువ్వింకా అక్కడే వార్డు బాయ్ లాగా ఉండేవాడివన్నమాట.
రుద్రాణి: అసలు
అంటూ రుద్రాణి మాట్లాడబోతుంటే… నువ్వాపు ఇప్పటికే చాలా మాట్లాడావు. ఇంకొక మాట మాట్లాడితే అత్తవు అని కూడా చూడను. ఈ ఇంట్లో నీకే విలువ లేదు. నీ మాటకు విలువ ఉందనుకుంటున్నావా? అంటూ వార్నింగ్ ఇస్తుంది స్వప్న. రుద్రాణి కోపంగా స్వప్నను తిట్టబోతుంటే వాళ్ల అమ్మ అందరినీ తిట్టి ఇది ఇక్కడితో వదిలేయండి అని లోపలికి వెళ్లిపోతుంది. కల్యాణ్ వెళ్లి అనామికకు సారీ చెప్తాడు. అనామిక కూడా మీరు ఇవాళ ఒక ప్రాణం నిలబెట్టారు నాకు చాలా గర్వంగా ఉందని చెప్తుంది. మరోవైపు హాస్పిటల్‌లో కనకం, మూర్తి బాధపడుతూ ఉంటారు.
కనకం: ఏంటయ్యా ఇదంతా..ఏది జరక్కూడదని అప్పు అనుకుందో అదే జరుగుతుంది. ఆ కళ్యాణ్ బాబుకు దూరంగా వెళ్లిపోదామనుకుంటే ఆ దేవుడు దగ్గర చేస్తూనే ఉన్నాడు.
మూర్తి: నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావు. నేనిప్పుడు కావ్య ఇంటిలో ఏం జరుగుతుందోనని కంగారుపడుతున్నాను.
అనడంతో స్వప్న ఫోన్ చేస్తుంది. అప్పుకు ఎలా ఉందని అడుగుతుంది. డాక్టర్ కంగారుపడాల్సిన అవసరం లేదన్నారు అని కనకం చెప్పడంతో ఈ మాత్రం దానికి కావ్యకు ఫోన్ చేయాలా? అంటూ ఇంట్లో జరిగిన విషయం మొత్తం కనకానికి చెప్తుంది స్వప్న.
మూర్తి: ఏమైంది కనకం..
కనకం: మీరనుకున్నదే జరుగుతుందంట
అని ఇద్దరూ కలిసి బాధపడుతుంటే.. సిస్టర్ వచ్చి మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. అని చెప్పగానే కనకం,మూర్తి డాక్టర్ దగ్గరకు వెళ్లగానే పేషెంట్ ఇప్పుడు బాగానే ఉన్నారు. ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నాను. రెండు రోజుల తర్వాత తీసుకురండి చెకప్ కోసం అని చెప్పడంతో కనకం, మూర్తి అక్కడ నుంచి వెళ్లిపోతారు.
మరోవైపు అనామిక అలిగి కూర్చవడంతో కళ్యాణ్ వెళ్లి కూల్ చేస్తాడు. నా ప్యూచర్ మొత్తం నువ్వే అంటూ అనామికకు ప్రామిస్ చేస్తాడు. మరోవైపు అప్పు హాస్పిటల్ బిల్లు లక్షా ఇరవై వేల రూపాయలు అయ్యిందని మూర్తి, కనకం బాధపడుతుంటారు. కావ్యను అడుగుదామనుకుని మళ్లీ వద్దనుకుంటారు. మరోవైపు రాజ్ ఫోన్ మాట్లాడుతుంటే కావ్య వస్తుంది. కావ్య రావడంతో తర్వాత మాట్లాడతానని ఫోన్ పేట్టేస్తాడు రాజ్.
కావ్య కోపంగా నన్ను చూసి ఫోన్ కట్ చేశావు కదూ అంటూ రాజ్ మీద విరుచుకుపడుతుంది. దీంతో రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు డబ్బుల కోసం బయటకు వెల్లిన మూర్తి ఉత్తి చేతులతో తిరిగివచ్చి కనకంతో కలసి బాధపడతాడు. సిస్టర్ వచ్చి అప్పు పిలుస్తుందని చెప్పడంతో లోపలికి వెళ్లిన కనకం, మూర్తిలతో మీరు కళ్యాణ్‌కు ఎందుకు చెప్పారని అడుగుతుంది.
మేము చెప్పలేదని రాజ్‌కు కావ్య ఫోన్ చేసినప్పుడు కళ్యాణ్‌కు తెలిసి వచ్చాడని చెప్తారు. దీంతో అప్పు బాధపడుతుంది. ఎంత దూరం అవుదామనుకున్నా ఇలా దగ్గరవుతున్నామేంటి అని ప్రశ్నిస్తుంది. ఇంతలో సిస్టర్ వచ్చి మీకెప్పుడో డిశ్చార్జ్ రాశారు కదా మీరింకా వెళ్లలేదు అంటూ అడగుతుంది. కనకం మేము ఇంకా బిల్లు కట్టలేదనడంతో మీ అల్లుడు రాజ్ బిల్లు కట్టాడు మీరిక వెళ్లొచ్చు అని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో కనకం, మూర్తి హ్యాపీగా ఫీలవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)