అన్వేషించండి

Brahmamudi Serial Today February 4th: ‘బ్రహ్మముడి’ సీరియల్: మినిస్టర్‌ కాలర్‌ పట్టుకున్న రాజ్‌ - వార్నింగ్‌ ఇచ్చిన కావ్య

Brahmamudi serial today episode February 4th: తన ఇంటికి వచ్చి బెదిరించిన మినిస్టర్‌ కాలర్‌ పట్టుకుంటాడు రాజ్‌. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode: దుగ్గిరాల ఇంట్లో అందరూ యాక్సిడెంట్‌ గురించి కంగారు పడుతుంటే అప్పుడే మినిస్టర్‌ ధర్మేంద్ర వస్తాడు. ఆయనను చూసి అందరూ షాక్‌ అవుతారు. యాక్సిడెంట్‌ గురించి ధర్మేంద్ర మాట్లాడతాడు.

ధర్మేంద్ర: ఈరోజు మీ కార్లకు యాక్సిడెంట్ జరగడానికి, తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి కారణం మీ అబ్బాయి రాజ్, మీ కోడలు కావ్యలే

రాజ్‌ కోపంగా ధర్మేంద్ర కాలర్ పట్టుకుంటాడు.

రాజ్‌: చేసిందంతా చేసి నా ఫ్యామిలీ జోలికి వస్తావా? నా ఫ్యామిలీని చంపాలని చూస్తావా? నా ఇంటికొచ్చి నా ఎదురుగా నిలబడతావా..?

ధర్మేంద్ర: ఈ ఆవేశమే మిమ్మల్ని ఇంతదాకా తీసుకొచ్చింది. మీ అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది

సుభాష్‌: ఎవరు ఈయన? మినిస్టర్ అంటున్నాడు? మన మీద ఇంత కక్ష ఏంటీ?

ధర్మేంద్ర: మీవాడు చెప్పలేకపోతున్నాడు.. నేనే చెబుతాను. మీకు నాకు ఎలాంటి శతృత్వం లేదు.. మీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. కానీ మీ కొడుకు, కోడలు నా ఫ్యామిలీ జోలికి వచ్చారు.. నేను ఊరుకుంటానా? అందుకే నేను మీ ఫ్యామిలీ జోలికి, మీ ఇంటికి రావాల్సి వచ్చింది. ఏం జరిగిందో మీ అబ్బాయి చెబుతాడు.. అదంతా విన్న తర్వాత నాలాంటి వాడి జోలికి, నా ఫ్యామిలీ జోలికి రావొద్దని చెప్పండి అందరూ బతికిపోతారు. కాదు.. కూడదు అని మళ్లీ నా ఇంటి వైపు చూస్తే నేను మళ్లీ మీ ఇంటికి రావాల్సి వస్తుంది. కానీ ఈసారి మీతో చర్చించడానికో, మీకు వివరణ ఇవ్వడానికో కాదు... మీ అందరి ఫోటోలకు దండలు వేయడానికి వస్తాను

కావ్య: నీ బెదిరింపులకు మేం భయపడం..

ధర్మేంద్ర:  కుర్రోళ్లకు ఏం అర్ధం కావడం లేదు. నేనంటే ఏంటో చూసి కూడా ఇలాగే మాట్లాడుతున్నారు.. మీరే నచ్చజెప్పండి.. నా జోలికి వస్తే మీ ఇంట్లో ఎవ్వరూ మిగలరు

అని వార్నింగ్‌ ఇస్తాడు ధర్మేంద్ర. అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అందరూ భయపడుతుంటారు. అసలేం జరిగిందని ఇంట్లో వాళ్లు అడగ్గానే.. రాజ్‌ నిజం చెప్పబోతుంటే.. కావ్య ఆపేసి ఆఫీసు గొడవలు ఇంతదాకా వస్తాయి అనుకోలేదు ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని చెప్తుంది. తర్వాత రుద్రాణి, ధర్మేంద్ర పార్టీ చేసుకుంటుంటారు.

ధర్మేంద్ర: నువ్వు మామూలు మహిళవి కాదు.. మహా అరుదైన మహిళవి.. నువ్వు రాజకీయాల్లోకి వస్తే నన్నే మించిపోతావు

రుద్రాణి:  నాకు అలాంటి ఆశలు లేవు.. కేవలం పగ మాత్రమే ఉంది. నేను వర్కవుట్ అయ్యే ఐడియా మాత్రమే ఇచ్చాను..  నీ భార్య కన్నీళ్లు పెట్టుకునే అవకాశం ఉండకూడదు అన్నారు, ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. ఆ కావ్య, రాజ్‌లు ఇకపై మీ ఇంటి గురించి, మీ గురించి ఆలోచించరు

ధర్మేంద్ర: నువ్వు చెప్పినట్లు ఆ ఫ్యామిలీ కళ్లలో చావు కనిపించింది. ఆ రాజ్, కావ్యల కళ్లలో భయం చూశాను

రుద్రాణి: ఆ కుటుంబంలో ఉన్నవాళ్లంతా సెంటిమెంటల్ ఫూల్స్.. ఎవరి కోసం వాళ్లు బతకరు, పక్కవాళ్లకి కన్నీళ్లు రావొద్దని బతుకుతారు

ధర్మేంద్ర: నా వెనకుండి నన్ను బాగా నడిపిస్తున్నావు.. నీ రుణం తీర్చుకునే అవకాశం మాత్రం నాకు ఇవ్వడం లేదు

రుద్రాణి: ఆ సందర్భం ముందుంది.. ఆ ఇంట్లో ప్రళయం, నా కొడుక్కి పట్టాభిషేకం.. ఒకేసారి జరగాలి. అప్పుడే కలిసి మళ్లీ పార్టీ చేసుకుందాం

అనుకుంటూ పార్టీ ఎంజాయ్‌ చేస్తుంటారు. మరోవైపు కావ్య, రాజ్‌ ఆలోచిస్తుంటారు. ధర్మేంద్రను డైరెక్టుగా ఎదుర్కోలేమని డిసైడ్‌ అవుతారు. ఇద్దరూ కలిసి ఒక ప్లాన్‌ చేస్తారు. అందుకోసం ముందు డాక్టర్‌ చక్రవర్తి ఎక్కడున్నాడో తెలుసుకోవాలనుకుంటారు. మరుసటి రోజు తులసి కనిపించకపోవడంతో దర్మేంద్ర కంగారు పడుతుంటాడు. అప్పుడే రాజ్‌ కాల్‌ చేస్తాడు.

రాజ్‌: ఏం మినిస్టర్‌ గారు మీ ఆవిడ కనిపించడం లేదా..?

మినిస్టర్‌: ఏయ్‌ నాతో ఆటలొద్దు.. నా భార్యను ఏం చేశారు

రాజ్‌: ఏమీ చేయలేదు మినిస్టర్‌ గారు జస్ట్‌ మీ ఆవిడను డాక్టర్‌ చక్రవర్తి దగ్గరకు తీసుకెళ్లి నిజం చెప్పించబోతున్నాం

 అంటూ రాజ్‌ చెప్పగానే.. మినిస్టర్‌ భయపడతాడు. వెంటనే రాజ్‌ను బతిమాలుతూ నిజం చెప్పొద్దని రిక్వెస్ట్‌ చేస్తాడు. రాజ్‌ కాల్‌ కట్‌ చేయగానే.. మినిస్టర్‌ కారేసుకుని వెళ్లిపోతాడు. మరోవైపు తులసి, కావ్య దగ్గరకు వెళ్లి ఎందుకు ఇంత ఉదయమే రమ్మన్నారు అని అడగుతుంది. మీకు పాలు పడటం లేదు కదా నాకు తెలిసిన ఆయుర్వేద డాక్టర్‌ వస్తున్నారు.. అందుకోసమే మిమ్మల్ని రమ్మన్నాను అని చెప్తుంది. దీంతో తులసి హ్యాపీగా కావ్యకు థాంక్స్‌ చెప్తుంది. మరోవైపు మినిస్టర్‌ కారును రాజ్‌ ఫాలో అవుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today July 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఐశ్వర్యను ట్రాప్‌ చేస్తున్న శశి – లక్కీని అవమానించిన ఐశ్వర్య
‘బ్రహ్మముడి’ సీరియల్: ఐశ్వర్యను ట్రాప్‌ చేస్తున్న శశి – లక్కీని అవమానించిన ఐశ్వర్య
Aishwarya Varma: ఎదిరించి ఇండస్ట్రీలోకి.. భర్త ఫుల్ సపోర్ట్.. చామంతి సీరియల్ నటి ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ విషయాలు
ఎదిరించి ఇండస్ట్రీలోకి.. భర్త ఫుల్ సపోర్ట్.. చామంతి సీరియల్ నటి ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ విషయాలు
Abhishek Yannam: 'ఇంటింటి రామాయణం' సీరియల్ అభిషేక్.. మోడలింగ్ నుంచి బుల్లితెర స్టార్ వరకు!
ఇంటింటి రామాయణం' సీరియల్ అభిషేక్.. మోడలింగ్ నుంచి బుల్లితెర స్టార్ వరకు!
Jaya Chiravuri: యూఎస్‌లో వ్లాగర్, యూట్యూబ్‌లో సంచలనం.. బుల్లితెరపై ఎంట్రీ.. జయ చిరవూరి రియల్ లైఫ్ స్టోరీ!
యూఎస్‌లో వ్లాగర్, యూట్యూబ్‌లో సంచలనం.. బుల్లితెరపై ఎంట్రీ.. జయ చిరవూరి రియల్ లైఫ్ స్టోరీ!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Embed widget