అన్వేషించండి

Brahmamudi Serial Today February 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : అప్పు, కళ్యాణ్‌ ఇన్‌ – రాహుల్‌, రుద్రాణి ఔట్‌ – ట్విస్ట్‌ మామూలుగా లేదు

Brahmamudi Today Episode: అప్పు, కళ్యాణ్‌ ఇంటికి రాగానే.. రాహుల్‌, రుద్రాణిలను ఇంట్లోంచి వెళ్లగొట్టమని ఇందిరాదేవి, సీతారామయ్యకు చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  ఆస్థి పంపకాలు చేస్తానన్న సీతారామయ్య కాళ్ల మీద పడి తనను క్షమించమని అడుగుతాడు ప్రకాష్‌. ఆస్థి పంపకాలు చేయోద్దని అందరం కలిసే ఉందామని ప్రాధేయపడతాడు. అయితే ఆస్థి పంచకూడదంటే మీరు కళ్యాణ్‌, అప్పులను ఇంటికి తీసుకురావాలని చెప్తాడు సీతారామయ్య. సరే అంటారు ప్రకాష్‌, ధాన్యలక్ష్మీ. తర్వాత ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్తుంది రుద్రాణి.

రుద్రాణి: శ్రీరాముడితో కలిసి సీత అరణ్యవాసానికి వెళ్లినట్టు నువ్వు కూడా వెళ్లాలనుకుంటున్నావా..? లేకపోతే భర్త మాటలు జవదాటని భార్య అని ఏదైనా న్యూస్‌ చానెల్‌లో హెడ్‌లైన్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నావా..?

ధాన్యలక్ష్మీ: అసలు నువ్వు ఏం అడగాలనుకున్నావో అడుగు రుద్రాణి.

రుద్రాణి: నేనేం ఏం అడుగుతాను. ఇన్ని రోజులు నీకు నీ కొడుక్కు ఆస్థి దక్కాలని.. నీ తరపున పోరాడాను. నిన్ను అలాగే తీర్చిదిద్దాను. కానీ నువ్వేంటి ఇలా మారిపోయావు. బెల్లం కొట్టిన రాయిలా చలనం లేకుండా ఉండిపోయావు. మీ ఆయన అలా అడుగుతుంటే.. నువ్వెందుకు అలా ఉండిపోయావు

ధాన్యలక్ష్మీ: నువ్వే అడగొచ్చు కదా..? నేను అడిగి అందరి ముందు చెడ్డదాన్ని కావాలి. గయ్యాలి దాన్ని కావాలా..? నువ్వు మాత్రం తెర వెనక కథ నడిపిస్తూ తెరముందు మంచిదానిలా తిరుగుతుంటావా..?

రుద్రాణి: ధాన్యలక్ష్మీ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను అడిగే దానికి నువ్వు అడిగే దానికి చాలా తేడా ఉంది. నేను వాళ్ల రక్తం పంచుకుని పుట్టినదాన్ని కాదు. కానీ మీకు అన్ని హక్కులు ఉన్నాయి ఆస్థిలో వాటా అడగొచ్చు.

అని ధాన్యలక్ష్మీని రెచ్చగొట్టాలని రుద్రాణి ప్రయత్నిస్తుంది. కానీ ధాన్యలక్ష్మీ మాత్రం నా కొడుకు సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత రోజు అప్పు కళ్యాణ్‌ బల్లు ఆరేస్తుంటే.. ప్రకాష్‌, ధాన్యలక్ష్మీ వస్తారు.

అప్పు: అత్తయ్యా.. మామయ్యా బాగున్నారా..?

కళ్యాణ్‌: అమ్మా నాన్నా.. ఎలా ఉన్నారు..?

ప్రకాష్‌: బాగానే ఉన్నాం అమ్మా..

ధాన్యలక్ష్మీ: బాగానే ఉన్నాం కళ్యాణ్‌..

అప్పు: లోపలికి రండి మామయ్యగారు

ప్రకాష్‌: మేము లోపలికి రావడం కాదు. మీరే మాతో పాటు రావాలి

అప్పు, కళ్యాణ్‌ షాక్‌ అవుతారు.

కళ్యాణ్‌: మేమా.. ఎక్కడికి రావాలి నాన్నా

ప్రకాష్‌:  చల్లకొచ్చి ముంత దాస్తావెంటుకు.. చెప్పు వాళ్లకు

ధాన్యలక్ష్మీ : మనం మన ఇంటికి వెళ్లాలి.. రండి

మరోసారి కళ్యాణ్‌, అప్పు షాక్‌ అవుతారు.

ప్రకాష్‌: ఇంత మంచి వార్త చెబితే అలా షాక్‌ అవుతారేంట్రా

ధాన్యలక్ష్మీ : మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. ఇన్ని రోజులు మిమ్మల్ని దూరం పెట్టి తప్పు చేశానేమో.. నన్ను క్షమించండి.

కళ్యాణ్‌ : అమ్మా ఏం మాటలవీ.. నువ్వు మమ్మల్ని అలా దూరం పెట్టడంతోనే మంచి జరిగిందేమో.. స్వతహాగా ఎదగాలన్న ఆశ రెట్టింపైంది. కానీ నేను ఇంకా పూర్తి స్థాయి రైటర్‌గా స్థిరపడలేదు. అవకాశాల కోసం తిరగాలి. ఈ టైంలో అక్కడికి వస్తే ఎలా..?

ధాన్యలక్ష్మీ: ఇవే పనులు మన ఇంట్లో ఉండి  కూడా చేసుకోవచ్చు కదా

అని ధాన్యలక్ష్మీ చెప్పగానే ప్రకాష్‌ కూడా ఓరేయ్‌ మీ అమ్మే వచ్చి అడిగితే ఇంకా కాదంటావేంట్రా పదండి ముందు మన ఇంటికి అంటాడు. అప్పు, కళ్యాణ్‌లను తీసుకుని ఇంటికి వస్తారు. ఇంట్లో కావ్య వాళ్లు గ్రాండ్‌ వెల్‌కం చెప్తారు. ఇంతలో ఇందిరాదేవి తాను ఓ నిర్ణయం తీసుకున్నానని ఇల్లు ముక్కలు అవ్వకుండా ఉండాలంటే రాహుల్‌, రుద్రాణి బయటకు వెళ్లిపోవాలని చెప్తుంది. అందరూ సపోర్టు చేస్తారు. ఆస్థిలో వాటా ఇస్తే తీసుకుని వెళ్తానని రుద్రాణి అంటుంది. చిల్లిగవ్వ కూడా ఇచ్చేది లేదని బయటకు వెళ్లిపోమ్మని సీతారామయ్య చెప్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 23rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: భక్తవత్సలాన్ని కాపాడిన మహా! హరికృష్ణ మర్డర్ మిస్టరీని మహా ఛేదిస్తోందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: భక్తవత్సలాన్ని కాపాడిన మహా! హరికృష్ణ మర్డర్ మిస్టరీని మహా ఛేదిస్తోందా!
Nindu Manasulu Serial Today October 23rd: నిండు మనసులు: ప్రేరణలో మార్పు! తల పట్టుకున్న సిద్ధూ, ఇందిర! నిజం చెప్పేస్తుందా!
నిండు మనసులు: ప్రేరణలో మార్పు! తల పట్టుకున్న సిద్ధూ, ఇందిర! నిజం చెప్పేస్తుందా!
Godavari Serial Today October 23rd: 'గోదావరి' సీరియల్: జాను, సంజయ్‌ల ఫస్ట్‌నైట్! అగ్రిమెంట్ పక్కన పెట్టేసి కలిసిపోయారుగా!
'గోదావరి' సీరియల్: జాను, సంజయ్‌ల ఫస్ట్‌నైట్! అగ్రిమెంట్ పక్కన పెట్టేసి కలిసిపోయారుగా!
Meghasandesam Serial Today October 23rd: ‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను పూల్‌ను చేసిన ఆకాష్‌ - కొత్త ప్లాన్‌ చెప్పిన భూమి  
‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను పూల్‌ను చేసిన ఆకాష్‌ - కొత్త ప్లాన్‌ చెప్పిన భూమి  

వీడియోలు

Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
Sanju Samson 67 Runs vs New Zealand | న్యూజిలాండ్‌పై సంజూ శాంసన్ ధనాధన్ బ్యాటింగ్
Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
చైనా‌తో ఘర్షణపై ITBP డీజీ కీలక ప్రకటన.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ
చైనా‌తో ఘర్షణపై ITBP డీజీ కీలక ప్రకటన.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ
CM Revanth Reddy: వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
Jio Platforms IPO: చరిత్ర సృష్టించిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ.. కోటి పైగా సబ్‌స్క్రిప్షన్లతో వరల్డ్ రికార్డు
చరిత్ర సృష్టించిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ.. కోటి పైగా సబ్‌స్క్రిప్షన్లతో వరల్డ్ రికార్డు
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
Vidadala Rajini: పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
AP Local Body Elections: 15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
Jo Jo Caution 2 Video : మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
Hyderabad Air Pollution: హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
Embed widget