అన్వేషించండి

Brahmamudi Serial Today Fabruary 7th:  ‘బ్రహ్మముడి’ సీరియల్ : పోలీస్‌ గా దుగ్గిరాల ఇంట్లో అడుగుపెట్టిన అప్పు – అహంకారం చూపించిన రుద్రాణి

Brahmamudi Today Episode:  కళ్యాణ్‌, అప్పులను ఇంట్లోనే ఉండిపోమ్మని అపర్ణ చెప్పడంతో రుద్రాణి కోప్పడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.    

Brahmamudi Serial Today Episode: పోలీస్‌ యూనిఫామ్‌లో దుగ్గిరాల ఇంటికి వచ్చిన అప్పును రుద్రాణి అవమానకరంగా మాట్లాడుతుంది. ఏంటి పగటి వేషాలు అంటూ వెటకారంగా తిడుతుంది. దీంతో కావ్య కోపంగా పగటివేషాలు వేయాల్సిన అవసరం మా అప్పుకు లేదని నిజంగానే ఎస్సై ట్రైనింగ్‌ పూర్తి చేసుకుని ఈ ఊరికే ఎస్సైగా వచ్చిందని చెప్తుంది.

రుద్రాణి:  చాలా సంతోషం మరి ఈ పోలీస్‌ గారు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు .. నిన్ను నీ మెగుడిని అవమానించినందుకు నీ అత్తకు వార్నింగ్‌ ఇవ్వడానికి వచ్చినట్టా..? లేక దొంగకేసులు పెట్టి అరెస్ట్‌ చేయడానికి వచ్చావా..? ఓ నాకు అర్థం అయింది. నీ పెళ్లికి ఒప్పుకోకుండా నిన్ను అవమానించిన  నీ అత్తయ్యా నిన్ను ఇంట్లోంచి తరిమేసింది కదా..? అలాంటివి ఇకపైన ఏమైనా చేస్తే పోలీస్‌గా ఎంతదూరం అయినా వెళ్తాను అని చెప్పడానికి వచ్చావు కదా

కళ్యాణ్‌: ఎందుకు అత్తయ్యా మీ మనసులో ఉన్న ఆలోచనలను మా మాటలుగా చెప్పాలనుకుంటున్నారు. నా భార్య పోలీస్‌ అయిందని ఈ ఇంటి పెద్దవాళ్లకు చెప్పి వాళ్ల ఆశీర్వాదం తీసుకుందామని ఇక్కడికి వచ్చాము.. పెద్దమ్మా..

అపర్ణ: ఒరేయ్‌ ఈ ఇంటికి పెద్ద దిక్కు మీ నాన్నమ్మ గారు. ముందు ఆవిడ ఆశీర్వాదం తీసుకోండి.. తర్వాత మీ అమ్మానాన్నల ఆశీర్వాదం తీసుకోండి.

అప్పు, కళ్యాణ్‌ ఇందిరాదేవి ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత వెళ్లి  ప్రకాష్‌, ధాన్యలక్ష్మీ ల ఆశీర్వాదం తీసుకుంటారు.

అపర్ణ:  ఈ ఆనందం శాశ్వతంగా ఉండిపోవాలంటే.. మీరు ఇక్కడే ఉండిపోవాలి.  

రుద్రాణి:  నువ్వు బాగానే చెప్తావు వదిన కానీ కళ్యాణ్‌ అందుకు ఒప్పుకోవాలి కదా.. ఎందుకంటే కళ్యాణ్‌ అనుకున్నట్టుగా ఇంకా మంచిపేరు సంపాదించలేదు. అందుకే రాడనుకుంటున్నాను

కళ్యాణ్‌:  విన్నావా పెద్దమ్మా ఈ ఇంట్లో మా అమ్మతో పాటు ఇంకా కొంతమంది మమ్మల్ని యాక్సెప్ట్‌ చేయడానికి రెడీగా లేరు. అందరూ ఒప్పుకున్న  రోజు ఇక్కడే ఉండిపోతాం

 ఇందిరాదేవి సరేలేరా ఆ గొడవలన్నీ ఇప్పుడెందుకు రేపు పాపకు బారసాల జరిపిస్తున్నాము.. మీరు ఇద్దరూ దగ్గరుండి మరీ  బారసాలను గ్రాండ్‌ గా జరిపించాలి అని చెప్తుంది. అందరూ నవ్వుకుంటారు. తర్వాత రాత్రికి స్వప్న, కావ్య, అప్పు ముగ్గురు గుమ్మం దగ్గర కూర్చుని తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు ఇంతలో లోపల పాప ఏడుస్తుంటే స్వప్వ వెళ్లి పాపను ఎత్తుకుంటుంది. అయినా పాప ఏడుపు ఆపదు. దీంతో కావ్య పాపను తీసుకుని బయటకు వచ్చి జోల పాట పాడుతుంది. పాప ఏడుపు ఆపేసి నిద్రపోతుంది. దీంతో స్వప్న, కావ్యను మెచ్చుకుంటుంది. వాళ్లను గమనిస్తున్న ఇందిరాదేవి, అపర్ణ ఎమోషనల్‌ అవుతారు.

ఇందిర: వీళ్లను ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందే..

అపర్ణ: అవును అత్తయ్యా నేను ఈ ఇంటికి కొత్తగా కాపురానికి వచ్చిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. నేను కూడా రాజ్‌ను  ఇలా ఒడిలో పెట్టుకుని జోల పాడేదాన్ని ఒకవైపు మీరు.. మరోవైపు ధాన్యలక్ష్మీ రాజ్‌ను నెత్తిన పెట్టుకుని చూసుకునే వారు

ఇందిరాదేవి:  అవునే ఆ రోజుల్లో ఎంతో సంతోషంగా ఉండేవాళ్లం. అప్పుడు మన దగ్గర ఇంత ఆస్థి ఉండేది కాదు. కానీ అందరం సంతోషంగా ఉండేవాళ్లం. కానీ ఈరోజు కోట్లు ఉన్నా.. ఆ సంతోషాన్ని మాత్రం కొనలేకపోతున్నాం

అపర్ణ:  బాధపడకండి అత్తయ్యా ఆ ముగ్గురిని చూస్తున్నారు కదా..? మన ఇంట్లో దూరం అయిన సంతోషాన్ని తప్పకుండా తీసుకొస్తారు.

అని చెప్పగానే ఇందిరాదేవి హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు ప్రకాష్‌ దగ్గరకు వెళ్లిన ధాన్యలక్ష్మీ కోపంగా తిడుతుంది. మీరు మౌనంగా ఉంటే మన కొడుకు భవిష్యత్తు నాశనం అయిపోతుంది అంటూ నిలదీస్తుంది. మీరే వెళ్లి కళ్యాణ్‌తో మాట్లాడండి అని చెప్తుంది. అయితే సరే కాస్త టైం తీసుకుని మాట్లాడతాను అని ప్రకాష్‌ చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Eknath Harika New House : కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ
కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ
Godavari Serial Today July 17th: 'గోదావరి' సీరియల్: నందు, మురళీల ఫస్ట్‌నైట్! గదిలో ట్విస్ట్‌లు మామూలుగా లేవుగా!
'గోదావరి' సీరియల్: నందు, మురళీల ఫస్ట్‌నైట్! గదిలో ట్విస్ట్‌లు మామూలుగా లేవుగా!
Nindu Manasulu Serial Today July 17th: నిండు మనసులు: నా భర్తని నీకు ఇచ్చేస్తున్నా తీసుకో.. ఈశ్వరి చెంప పగలగొట్టి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఇందిర!
నిండు మనసులు: నా భర్తని నీకు ఇచ్చేస్తున్నా తీసుకో.. ఈశ్వరి చెంప పగలగొట్టి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఇందిర!
Karthika Deepam 2 Serial Today July 17th: కార్తీకదీపం 2 సీరియల్: చెఫ్‌ని కొనేసిన మాలిని! కాఫీ పెట్టడం రాని జ్యోత్స్నతో పోటీలో వంటలు వండిస్తారా!
కార్తీకదీపం 2 సీరియల్: చెఫ్‌ని కొనేసిన మాలిని! కాఫీ పెట్టడం రాని జ్యోత్స్నతో పోటీలో వంటలు వండిస్తారా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Embed widget