అన్వేషించండి

Brahmamudi Serial Today August 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌ కోసం దుగ్గిరాల ఇంటికి వెళ్లిన యామిని – రాజ్‌ను కట్లతో చూసి ఎమోషనల్‌ అయిన దుగ్గిరాల ఫ్యామిలి

Brahmamudi serial today episode August 8th:  రాజ్‌ దొరికాడని తెలుసుకున్న యామిని రాజ్‌ కోసం దుగ్గిరాల ఇంటికి వెళ్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode:  కావ్య ఏడుస్తూ బయటకు వెళ్లడం చూసిన రుద్రాణి ఇది ఇలా పరుగెట్టుకుంటూ వెళ్తుందంటే ఆ రాజ్‌ కు ఏదో జరిగినట్టు ఉంది. అని మనసులో అనుకుంటూ కావ్యను తిడుతుంది. అప్పుడే కిందకు వచ్చిన ఇందిరాదేవి కోపంగా రుద్రాణిని తిడుతుంది.

రుద్రాణి: రాజ్‌ ఇంట్లోంచి వెళ్లిపోవడానికి కారణం కావ్య.. తప్పులన్నీ కావ్య చేస్తే నువ్వు నన్ను తిడతావేంటి..? అయినా ఇప్పడు అంత పెద్ద తప్పు నేనేం చేశాను

ఇందిరాదేవి: నువ్వు పుట్టడమే పెద్ద తప్పు. కాసేపు నోరు మూసుకుని సైలెంట్‌గా ఉండు. లేదంటే నీ గదిలోకి వెళ్లు నా మనవరాలు కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లింది అక్కడ ఏదో జరిగింది అని కాదు.. నా మనవడు దొరికాడు.

అందరూ హ్యాపీగా ఫీలవుతారు. రుద్రాణి షాక్‌ అవుతుంది.

సుభాష్‌: ఏంటమ్మా నువ్వు చెప్పేది రాజ్‌ దొరికాడా..?

అపర్ణ: అవునండి ఇందాకే కావ్యకు వాళ్ల ఫ్రెండ్‌ ఎవరో ఫోన్‌ చేసి చెప్పారు.. అందుకే అది అంత ఆగమేఘాల మీద వెళ్లింది

కళ్యాణ్‌: ఇతకీ అన్నయ్య ఎక్కడ ఉన్నాడంట పెద్దమ్మ

అపర్ణ: వాళ్ల ఫ్రెండ్‌ దగ్గరే ఉన్నాడంట కళ్యాణ్‌

సుభాష్‌: అయితే వెంటనే కావ్యకు ఫోన్‌ చేసి అడ్రస్‌ పెట్టమను.. మనం కూడా వెళ్దాం

అపర్ణ: ఉండండి ఫోన్‌ తీసుకోస్తాను

ఇందిరాదేవి: వద్దు అపర్ణ ఆగు..

ప్రకాష్‌: ఎందుకమ్మా అడ్రస్‌ పెడితే మనం అందరం కూడా వెళ్తాం కదా

ఇందిరాదేవి: నా మనవడు అందిరి మీద అలిగి వెళితే అందరం వెళ్లి తీసుకొచ్చే వాళ్లం. ఈ టైంలో మనం అక్కడికి వెళితే వాడు దానితో సరిగ్గా మాట్లాడలేడు..

సుభాష్‌: అవును అమ్మా అయితే ఇక రాజ్‌కు నిజం చెప్పేద్దాం..

అపర్ణ: ఏమంటున్నారు అండీ మీరు

సుభాష్: అవును అపర్ణ ఇవాళ కావ్య తన ప్రేమను యాక్సెప్ట్‌ చేయలేదనే అలిగి వెళ్లిపోయాడు. రేపు మనమే వాడి పేరెంట్స్‌ అని తెలుసుకుంటే మన మీద ఎంత అలుగుతాడో ఏంటో ఆలోచించండి.. అందుకే నిజం చెప్పేద్దాం

అనగానే అందరూ ఆలోచిస్తుంటారు. రుద్రాణి మాత్రం వెంటనే ఈ విషయం యామినికి చెప్పాలని పక్కకు వెళ్లి ఫోన్‌ చేసి చెప్తుంది. మరోవైపు రేవతి ఇంటికి వెళ్లిన కావ్య కంగారుగా రాజ్‌ ఎక్కడున్నాడు అని అడుగుతుంది. రేవతి లోపలికి తీసుకెళ్తుంది.

కావ్య: సరిపోయిందా..? ఇంకా పెద్ద యాక్సిడెంట్‌ చేసుకోవాల్సింది. ఇంకా రెండు మూడు కట్లు కట్టేవారు కదా

రాజ్‌: అవసరం అయితే తగిలించుకుంటాను.. మీకెందుకు అయినా మీరెందుకు ఇక్కడకు వచ్చారు.. అక్కా నేను చెప్పాను కదా చెప్పకూడదు అని నీకు ఈ తమ్ముడి కంటే తనే ఎక్కువై పోయింది కదా..?

కావ్య:  ఏంటి ఆవిడ మీద అరుస్తున్నారు..  తప్పు చేసింది మీరు.. చెప్పకుండా వెళ్లిపోయింది మీరు.. యాక్సిడెంట్‌ చేయించుకుంది మీరు.. దెబ్బలు తగిలించుకుంది మీరు..

రాజ్‌:  అవును నాకే కదా యాక్సిడెంట్‌ జరిగింది నా వల్ల ఏదో మీకు యాక్సిడెంట్‌ జరిగినట్టు ఎందుకు గొడవ చేస్తున్నారు. నాకేం అయితే మీకెందుకు..? అసలు నేనెవరిని మీ లైఫ్‌లో  

కావ్య: నాకు మీకు ఏ సంబంధం లేదా.?

రాజ్‌: లేదని నిన్న మీరే చెప్పారు కదా..? నేనెవరో దారిన పోయే దానయ్యను అని నాకేం అయితే మీకెందుకు

కావ్య: ఇలా అడదిడ్డంగా వాగారంటే చంపేస్తాను.. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు.. లవ్‌ ఫెయిల్‌ అయిందని ఏడ్చుకుంటూ వెళ్లి యాక్సిడెంట్‌ చేసుకోవడానికి.. రాత్రి నుంచి మీరు ఇంటికి రాలేదని యామిని చెప్పేసరికి నా గుండె ఆగినంత పనైంది. మీరు ఏమయ్యారో ఎక్కడున్నారో తెలియక నేను ఎంత టెన్షన్‌ పడ్డానో తెలుసా..? ఒక్క మాట ఫోన్‌ చేసి చెప్పి ఉంటే మీ ఆస్తులు ఏమైనా పోయేవా..? నేను తిడుతుంటే మీరు నవ్వుతున్నారేంటి..? గతంతో పాటు కామన్‌సెన్స్‌ కూడా మర్చిపోయారా..?

రాజ్‌: ఫస్ట్‌ టైం ఒక మనిషి మనల్ని తిడుతున్నా ఆనందంగానే ఉందండి. మీ మనసులో నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని నిన్న ఎందుకు అలా మాట్లాడారు..? అసలు ఇష్టమే లేనట్టు ఎందుకు అలా ప్రవర్తించారు. మీరు అన్నట్టు నేను నిజంగానే పరాయి వాణ్ని అయింటే నాకు ఏం జరిగినా  మీరు పట్టించుకునే వారే కాదు.. మీరు కూడా నన్ను ఇష్టపడుతున్నారు కాబట్టే ఇలా ఇంత దూరం వచ్చారు.

కావ్య:  ఏవండి మీకు ఒక్కసారి చెబితే అర్థం కాదా.? నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు

రాజ్‌: మరైతే ఎందుకు వచ్చారు వెళ్లిపోండి

కావ్య: వెళ్తాను కానీ నిన్ను తీసుకునే ఇక్కడి నుంచి వెళ్తాను.. మా అత్తయ్య.. అమ్మమ్మ వాళ్లు నీకోసం బాధపడుతున్నారు.. వాళ్ల కోసమే నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను

అంటూ బలవంతంగా రాజ్‌ను తీసుకుని వెళ్తుంది కావ్య. కట్లతో ఇంటిక వచ్చిన రాజ్‌ను చూసి అందరూ బాధపడతారు. ఎమోషనల్‌గా మట్లాడతారు. రాజ్‌ కూడా కావ్య ప్రేమించడం లేదని బాధపడతాడు. ఇంతలో యామిని వచ్చి లవ్‌లో ఫెయిల్‌ అయితే చనిపోవాలా బావ అంటూ మాట్లాడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today October 8th: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల చేతుల్లో రౌడీ హతం! సిద్ధూ జాబ్ రిస్క్‌లోకి వెళ్తుందా!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణల చేతుల్లో రౌడీ హతం! సిద్ధూ జాబ్ రిస్క్‌లోకి వెళ్తుందా!
Meghasandesam Serial Today October 8th: ‘మేఘసందేశం’ సీరియల్‌: సూర్యను చితకబాదిన గగన్‌ - అయోమయంలో అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: సూర్యను చితకబాదిన గగన్‌ - అయోమయంలో అపూర్వ
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 8: శీనయ్యను విక్కీ ఇంటికి తీసుకొస్తుండగా కాల్పులు..రాధ ఎవరో చెప్పకుండానే కన్నుమూత
నువ్వులేక నేను లేను: శీనయ్యను విక్కీ ఇంటికి తీసుకొస్తుండగా కాల్పులు..రాధ ఎవరో చెప్పకుండానే కన్నుమూత
Podarillu Serial Today Oct 8: కన్నాగాడి తల్లి అడ్రెస్‌ పట్టేసిన చక్రి..మహాను తీసుకుని జమున ఇంటికి వెళ్లిన చక్రి
పొదరిల్లు: కన్నాగాడి తల్లి అడ్రెస్‌ పట్టేసిన చక్రి..మహాను తీసుకుని జమున ఇంటికి వెళ్లిన చక్రి

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
Embed widget