అన్వేషించండి

Brahmamudi Serial Today August 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్: నిజం తెలిసి షాకైన రాజ్ – అయోమయంలో కావ్య

Brahmamudi serial today episode August 27th: కావ్య కడుపులో బిడ్డకు తండ్రి తానేనని తెలుసుకున్న రాజ్‌ షాక్‌ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode:  రాత్రి పూట తాగొచ్చి రాజ్‌ ఇంట్లో గొడవ చేస్తుంటే కావ్య కిందకు వచ్చి మళ్లీ ఎందుకు వచ్చావు అంటూ తిడుతుంది. దీంతో రాజ్‌ వెటకారంగా నవ్వుతూ..

రాజ్: మళ్లీ అదే ప్రశ్న నేను నిన్ను కలిసినప్పటి నుంచి అదే ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. నన్ను దూరం పెడుతున్నట్టు పెడుతూనే ఉన్నావు.. కానీ నిన్ను ప్రేమించేలా చేశావు.

కావ్య: ప్రేమించమని నేను మిమ్మల్ని అడిగానా..?

రాజ్‌: అదే కదా చెప్తున్నాను. ప్రేమించేలా చేశావు. నువ్వు వద్దన్నా ప్రేమించేశాను. మంచి మనిషిని చూడగానే అభిమానించేస్తాను. మంచి మనసును చూడగానే ప్రేమించేస్తాను

కావ్య:  అది నా తప్పా

రాజ్‌:  కాదమ్మా నీ తప్పు కానే కాదు. కానీ నువ్వు చేసిన తప్పేంటో తెలుసా…? నేను నిన్ను ప్రేమిస్తున్నట్టే నువ్వు నన్ను ప్రేమించడం. ఇప్పటికైనా నిజం ఒప్పుకో కళావతి నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రతిసారి నేను నీ కళ్లల్లో ఆనందాన్ని చూశాను. ఆఫీసులో ప్రాబ్లం అనగానే నీకు సాయం చేస్తే కన్నీళ్లు పెట్టుకున్నావు. నీ చెల్లెలు అరెస్ట్ కాకుండా కాపాడితే గుండెలకు హత్తుకున్నావు. ఎందుకు ఇదంతా చేశావు. నా మీద ప్రేమ లేకుండానే ఇన్నాళ్లు నా వెంట ఎందుకు నడిచావు 

కావ్య: మహానుభావ తప్పై పోయింది. నువ్వు ఈరోజు వచ్చి ఇలా నిలదీస్తావని తెలిసి ఉంటే.. అసలు నీకు దగ్గర అయ్యేదాన్నే కాదు.. నీతో మాట్లాడేదాన్నే కాదు.. నీతో..

రాజ్‌:  చెప్పు కళావతి ఏం మాట పడిపోయింది ఎందుకు నాతో ప్రేమలో పడేదానివే కాదు అని అందామనుకుంటున్నావా..? కదా.. అదే కదా..? ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది కళావతి ఇన్ని రోజులు ఇదే మాట కోసం ఎదురుచూశాను. సరే జరిగిందేదో జరిగిందని మర్చిపోదాం. నువ్వు కూడా నన్ను ఇష్టపడ్డావు కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్‌ అయిపోయాను. (అందరూ హ్యాపీగా ఫీలవుతారు. రుద్రాణి ఇరిటేటింగ్ గా ఫీలవుతుంది.) అవును నాకు తెలుసు.. నువ్వు కడుపుతో ఉన్నావని నాకు తెలుసు.. అయినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. నువ్వు నన్ను ఎంత మోసం చేసినా కడుపులో ఒక బిడ్డ పెరుగుతుందన్న నిజాన్ని దాచిపెట్టినా..? నీ మీద ప్రేమను చంపుకోలేకపోతున్నాను. నిన్ను మర్చిపోయి దూరంగా వెళ్లలేకపోతున్నాను. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నాను. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని కూడా నేనే అవుతాను. ఆ బిడ్డ బాధ్యతను నేనే తీసుకుంటాను

రుద్రాణి: వీడేంట్రా ఇంత పెద్ద ట్విస్టు ఇచ్చాడు. నిజం తెలిస్తే వదిలేసి వెళ్లిపోతాడు అనుకుంటే.. పెళ్లి చేసుకుంటానంటాడేంటి..?

రాహుల్‌:  నాకు మాత్రం ఏం తెలుసు మమ్మీ ఇంట్లో రోజుకొకరు ట్విస్టు ఇవ్వడం బాగా అలవాటైపోయింది

రాజ్‌:  కానీ ఒక్క కండీషన్‌ ఇప్పటి వరకు నువ్వేంటో నీ గతమేంటో నేనెప్పుడూ అడగలేదు. ఇక భవిష్యత్తులో కూడా అడగాలనుకోవడం లేదు. నీ మీద నమ్మకంతో లైఫ్‌లాంగ్‌ నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. అలా జరగాలంటే నాకో నిజం తెలియాలి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు..? నువ్వు నన్ను మోసం చేయాలి అనుకున్నావా..? లేకపోతే నువ్వే మోసపోయావా..? ఈ రెండు ప్రశ్నలకు నాకు సమాధానం చెప్పు చాలు కళ్లు మూసుకుని నీ మెడలో తాళి కట్టి జీవితాంతం నీకు తోడుగా నిలబడతాను

రుద్రాణి: ఇది కదా అసలైన ట్విస్ట్‌ అంటే దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి వీడే అని అది చెప్పదు. ఆ నిజం తెలిసే వరకు వీడు పెళ్లి చేసుకోడు

రాహుల్‌: ఇప్పుడు అసలు కథ మొదలైంది మమ్మీ వీళ్లందరూ కలిసి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో చూద్దాం

రాజ్‌:  నిజం చెప్పు కళావతి

యామిని వస్తుంది.

యామిని: నువ్వు ఎంత అడిగినా నిజం చెప్పదు బావ ఎందుకంటే తన కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో కళావతి కూడా తెలియదు. ఎందుకంటే తాను పబ్బుల్లో తిరిగేది  చాలా మందితో కలిసేది అందుకే ఎవరని చెప్పలేకపోతుంది కావచ్చు

రాజ్‌: నిజం చెప్పు కళావతి లేదంటే యామిని చెప్పిందే నిజం అనుకోవాల్సి వస్తుంది.

అనగానే అపర్ణ కోపంగా రాజ్‌ను కొడుతుంది. 

అపర్ణ: ఇది నువ్వు తాళి కట్టిన భార్య.. నువ్వు నా కొడుకు లాంటి వాడివి కాదురా..? నా పేగు తెంచుకుని పుట్టిన నా కన్న కొడుకువి. ఈ కుటుంబం నీది నువ్వు పుట్టింది ఇక్కడే.. పెరిగింది ఇక్కడే.. వీళ్లందరూ నీ వాళ్లురా..? కావ్య నెల తప్పడానికి కారణం నువ్వు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వు

అంటూ చెప్పగానే.. రాజ్‌ షాక్‌ అవుతాడు. అందరూ షాక్‌ అవుతారు.  అపర్ణ నిజం చెప్తుందని ఊహించని యామిని భయంతో వణికిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
Godavari Serial Today August 7th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
Nindu Manasulu Serial Today August 7th: నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
Karthika Deepam 2 Serial Today August 7th: కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget