అన్వేషించండి

Brahmamudi Serial Today August 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యను ఓదార్చిన అపర్ణ, ఇందిరాదేవి – రాజ్‌ను మత్తుకు బానిసను చేయాలనుకున్న యామిని

Brahmamudi serial today episode August 23rd: రాజ్‌కు మందు అలవాటే నేర్పిస్తుంది యామిని. దీంతో రాజ్‌ తాగి రోడ్ల మీద పడిపోతుంటాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode:  రాజ్‌, కావ్యలు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ బాధపడుతుంటారు. ఒకరినొకరు చేసుకున్న చిలిపి పనులు గుర్తు చేసుకుంటారు. ఇక రుద్రాణ మాత్రం రాజ్‌ వెళ్లిపోయాడని హ్యాపీగా ఉంటుంది.

రుద్రాణి:  హమ్మయ్యా చాలా రిలాక్స్‌డ్‌గా ఉంది రాహుల్‌

రాహుల్‌: నాకు మాత్రం చాలా గిల్టీగా ఉంది మామ్‌

రుద్రాణి: ఎందుకు రా రాహుల్‌..

రాహుల్‌: ఎందుకేంటి..? ఇందాక అందరూ నిన్ను కార్నర్‌ చేసి ఎలా తిట్టారో విన్నావు కదా..?

రుద్రాణి: అయ్యో రాహుల్‌ ఆ మాత్రం దానికే నువ్వు ఫీల్‌ అవుతున్నావా..? మన లాంటి వాళ్లు కొన్ని విషయాల్లో చాలా ప్రాక్టికల్‌గా ఉండాలిరా..? దున్నపోతు మీద వాన పడితే ఎలా దులిపేసుకుంటుందో అలా దులిపేసుకోవాలి. ఇన్ని రోజులు రాజ్ ను బయటకు ఎలా పంపించాలా..? మన ఆస్థి మనకు వచ్చేలా ఎలా చేయాలా..? అని టెన్షన్‌ పడ్డాను. కానీ వాడంతట వాడే ఈ ఇంటికి దూరంగా వెళ్లిపోతున్నాడురా..? రాజ్‌ ఎట్టి పరిస్థితుల్లో ఇక ఈ ఇంటికి తిరిగిరాడు

రాహుల్‌:  అంత కచ్చితంగా ఎలా చెప్తున్నావు మామ్‌ వాడు గతం మర్చిపోతేనే ఈ ఇంటిని వెతుక్కుంటూ వచ్చాడు. అలాంటిది ఆ కావ్య మీద కోపంతో వెళ్లిన వాడు మళ్లీ తిరిగి రాడా..?

రుద్రాణి: కోపంతో వెళ్లి ఉంటే మళ్లీ తిరిగి వచ్చేవాడేమో కానీ రాజ్‌ మోసపోయి వెళ్లాడు. అందుకే ఇంకెప్పటికీ తిరిగి రాడు. ఒకవేళ రాజ్‌ ఇంటికి రావాలంటే కావ్య ప్రగ్నెన్సీకి కారణం ఎవరో చెప్పాలి. అలా చెప్పాలంటే కావ్య రాజ్‌ గతం అంతా గుర్తు చేయాలి. కానీ గతం గుర్తు చేస్తే రాజ్‌ కు ప్రాబ్లమ్‌ కాబట్టి కావ్య చచ్చినా చెప్పదు. ఇక రాజ్‌, కావ్యను ఎలా క్షమిస్తాడు. తిరిగి ఎలా అడుగుపెడతాడు

రాహుల్‌: మమ్మీ నువ్వు నిజంగా సూపర్ మమ్మీ.. నీ బుర్రే బుర్ర

అంటూ  రాహుల్‌, రుద్రాణిని మెచ్చుకుంటాడు. రూంలో బాధపడుతూ కూర్చున్న కావ్య దగ్గరకు అపర్ణ, ఇందిరాదేవి వెళ్తారు.

ఇందిరాదేవి: పొద్దుటి నుంచి ఏమీ తినలేదు.. టైం ఎంత అవుతుందో తెలుసా..? కనీసం ఇప్పుడైనా టిఫిన్‌ చేయ్‌ కావ్య

కావ్య: ఆకలి చచ్చిపోయింది అమ్మమ్మ..నాకు తినాలని లేదు

ఇందిరాదేవి: పిచ్చి పిల్ల నా మనవడు ఏదో నాలుగు తప్పుడు మాటలు అన్నాడని వాటినే తలుచుకుంటూ కూర్చుంటే ఎలా..?

అపర్ణ: ఇందులో నీ తప్పేం ఉంది కావ్య నువ్వెందుకు బాధపడాలి

కావ్య: నేను అదే అంటున్నాను అత్తయ్య ఇందులో నేను చేసిన తప్పు ఏముంది. ఆయన చేత తాళి కట్టించుకోవడం నేను చేసిన తప్పా..? ఆయన నన్ను ఎంత దూరం పెట్టినా నవ్వుతూ భరిస్తూ ఉండటం నేను చేసిన తప్పా..? గతం గుర్తు లేని ఆయనకు నిజం చెప్తే ఆయనకు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయపడ్డాను. తనంటే నాకు ఎంత ఇష్టం ఉన్నా ఇప్పుడు తనంటే ఇష్టం లేదని చెప్పడం నా తప్పా..?

అపర్ణ: నీ బాధ మేము అర్థం చేసుకోగలం కావ్య కానీ వాడి మీద కోపాన్ని నీ బిడ్డ మీద చూపించకు

ఇందిరాదేవి: అవును కావ్య నీ కోసం కాకపోయినా నీ కడుపులో పెరుగుతున్న ఈ ఇంటి వారసుడి కోసమైనా నువ్వు తినాలి

కావ్య:  సరే ఆయన నన్ను తిట్టారని నేనెందుకు నా బిడ్డను పస్తులు ఉంచాలి. నా కారణంగా నా బిడ్డ ఎందుకు ఆకలితో ఉండాలి.. కానీ ఒక తల్లిగా నా బిడ్డను ఆకలితో ఉంచి వాడికి అన్యాయం చేయలేను అత్తయ్యా ఇవ్వండి

అని అపర్ణ తీసుకొచ్చిన అన్నం తింటుంది కావ్య. ఇక రాజ్‌ టిఫిన్‌ చేయకుండా వెళ్లిపోతే యామిని వెనకాలే వెళ్లి ఏమైంది బావ మూడ్‌ బాగాలేదా..? అని అడుగుతుంది. అవును యామిని ఏం చేసినా కలావతే గుర్తుకు వస్తుంది అని చెప్తాడు. దీంతో యామిని రాజ్‌కు మందు అలవాటు చేసుకోమ్మని బాటిల్‌ ముందు పెడుతుంది. రాజ్‌ పుల్లుగా మందు తాగి రోడ్లు మీదకు వెళ్లి పడుకుంటాడు. అటువైపు వెళ్తున్న కావ్య చూసి రాజ్‌ దగ్గరకు వెళ్లి ఇంటికి రమ్మని అడుగుతుంది. రాజ్‌ రానని చెప్తాడు. మత్తులో కిందపడిపోగానే కావ్య రాజ్‌ను కారులో తీసుకెళ్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today October 5: రాగిణిని బెదిరించి సాక్ష్యాలు తీసుకోవాలని యువరాజు ప్రయత్నం..నిషికకు గట్టిగా బుద్ధి చెప్పిన ధాత్రి
జగద్ధాత్రి సీరియల్: రాగిణిని బెదిరించి సాక్ష్యాలు తీసుకోవాలని యువరాజు ప్రయత్నం..నిషికకు గట్టిగా బుద్ధి చెప్పిన ధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్రిష్‌ని ఇంటికి తీసుకొచ్చిన విహారి! మహాకి మరో బాధ్యత!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్రిష్‌ని ఇంటికి తీసుకొచ్చిన విహారి! మహాకి మరో బాధ్యత!
Godavari Serial Today October 5th: 'గోదావరి' సీరియల్: జానుకి పెళ్లైపోయిందని తెలిసి గుండె పగిలేలా ఏడ్చిన సూర్య! నడిరోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయిన జాను!
'గోదావరి' సీరియల్: జానుకి పెళ్లైపోయిందని తెలిసి గుండె పగిలేలా ఏడ్చిన సూర్య! నడిరోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయిన జాను!
Nindu Manasulu Serial Today October 5th: నిండు మనసులు: ప్రేరణతో కలిసిపోవడం తనకి ఇష్టమే అని చెప్పేసిన సిద్ధూ! విజయానంద్ మంట పెడతాడా!
నిండు మనసులు: ప్రేరణతో కలిసిపోవడం తనకి ఇష్టమే అని చెప్పేసిన సిద్ధూ! విజయానంద్ మంట పెడతాడా!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Embed widget