అన్వేషించండి

Brahmamudi Serial Today August 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: బెట్టు వీడి భోజనం చేసిన రాజ్ – ఫ్రెండ్స్ రూంలోంచి వెళ్లిపోయిన అప్పు, కళ్యాణ్

Brahmamudi Today Episode:

Brahmamudi Serial Today Episode: రాజ్‌కు బాగా ఆకలి వేస్తుంటే కిచెన్‌లోకి వెళ్లి పాలు వేడి చేసుకుని తాగబోతుంటే పాల గిన్నె కిందపడిపోతుంది. దీంతో రాజ్‌ చేయి కాలుతుంది. ఇంతలో కావ్య వచ్చి చేయి కాలిందా? అంటూ సెటైర్లు వేస్తుంది. తర్వాత మీకు ఆకలిగా ఉంటే వడ్డిస్తాను పదండి అటుంది. నీ చేతి వంట తిననని ముందే చెప్పానుగా అంటాడు రాజ్‌ దీంతో మీరు నా చేతి వంట తినరని తెలిసే సాయంత్రం పనిమనిషి శాంతతో  వండించాను అంటుంది. దీంతో సరే అని రాజ్‌ వెళ్లి స్వయంగా వడ్డించుకుని తింటాడు. ఆ వంటను మెచ్చుకుంటూ తింటాడు రాజ్. ఇంతలో అపర్ణ వచ్చి రాజ్ అన్నం తినడం చూసి హ్యాపీగా ఫీలవుతుంది.

అపర్ణ: ఎవరో అన్నం తినను అని చెప్పి రాక్షసుడిలా అర్థరాత్రి తింటున్నాడు.

రాజ్‌: మామ్ ఇది పనిమనిషి శాంత చేసిన వంట. నేను మెనూ ఇస్తాను రోజు నాకోసం ఇలాగే స్పెషల్‌గా చేయించమను.

అపర్ణ: సరే వారం రోజుల దాకా శాంత రాదు. వచ్చాకా చెబుతాను.

రాజ్‌ భోజనం చేసి వెళ్లిపోతాడు.

అపర్ణ: వాడు ఆకలికి ఉండలేడు ఎలా అని భయపడ్డాను. కానీ, నీ చేతి వంటను శాంత వంట అని చెప్పి తినిపించావ్.

కావ్య: ఈ టెక్నిక్ ఓసారి మీ దగ్గర కూడా వాడాను. మీరు తిననంటే మావయ్యతో పంపించాను.

అపర్ణ: అమ్మనా కోడలా.. ఎంత గడుసుదానివి

   అంటూ ఇద్దరూ మాట్లాడుకుని వెళ్లిపోతారు. మరోవైపు రూంలో పడుకున్న రాజ్‌కు నిద్ర పట్టక కళ్యాణ్‌ గురించి ఆలోచిస్తుంటాడు. నాకు నిద్ర పట్టడం లేదు. ఇది మాత్రం దున్న పోతులా నిద్రపోతుంది అనగానే నేనేం నిద్ర పోలేదు అంటుంది కావ్య. కళ్యాణ్‌ గురించి ఇద్దరి మధ్య ఫన్నీగా గొడవ జరుగుతుంది. రాజ్‌, కళ్యాణ్‌కు ఫోన్‌ చేసి ఇంటికి రమ్మని అడుగుతాడు. కళ్యాణ్‌ రాలేనని నా సంతోషం కోరుకునే వాడివే అయితే నన్ను ఇలా ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఫోన్‌ కట్‌ చేస్తాడు. దీంతో కావ్య సెటైర్లు వేస్తుంది. ఇప్పుడు నేను దున్నపోతులా. మీరు మేకపోతులా పడుకోండి అటుంది.  మరోవైపు అప్పు ఫ్రెండ్స్ బయట చలిలో ఇబ్బంది పడుతూ పడుకోవడం చూస్తాడు కళ్యాణ్‌.

అప్పు: ఏమైంది..? వాళ్లను అలా చూస్తున్నవేంటి కవి.

కళ్యాణ్‌: వాళ్లను చూడు మనకు ప్రైవసీ ఇవ్వాలని చెప్పి నీ ఫ్రెండ్స్ బయట చలిలో పడుకున్నారు. వాళ్ల రూమ్‌లో వాళ్లు పడుకోలేకపోయారు. ఈ రాత్రికి తప్పలేదు. ఇంకా ఇక్కడ ఉంటే తప్పు అవుతుంది. ఏదోటి చేద్దాం.  కానీ, ఇంత మంచి ఫ్రెండ్స్‌ కు మన వల్ల ఇబ్బంది రాకూడదు. వీళ్లు రోజుకో అబద్ధం చెప్పి ఇలాగే కష్టపడుతుంటారు. కాబట్టి మనం వేరే దారి చూసుకుందాం.

అప్పు: నీ ఇష్టం నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాం. వాళ్లను ఎక్కువ కష్ట పెట్టడం నాకు ఇష్టం లేదు.

 మరుసటి రోజు ఉదయం అప్పు ఫ్రెండ్స్ లేస్తారు. మనం ఇక్కడ పడుకున్నామని తెలిస్తే వాళ్లు ఫీల్ అవుతారు. మనం మన ఫ్రెండ్ రూమ్‌లో పడుకుని వచ్చామని చెబుదామని రూంలోకి వస్తారు.

కళ్యాణ్‌: హాయ్‌ సినిమా ఎలా ఉంది.

కిరణ్‌: చాలా బాగుంది.

కళ్యాణ్‌: అవును సినిమా అయిపోయాక ఎక్కడికి వెళ్లారు. రాత్రి రూంకు  ఎందుకు రాలేదు.

ఫ్రెండ్‌: సినిమా చూశాక లేట్ అయింది. అందుకే ఫ్రెండ్ రూమ్‌కు వెళ్లి పడుకున్నాం.

 అని తమ ఫ్రెండ్స్‌ అబద్దం చెప్పడంతో అప్పు, కళ్యాణ్‌ మనసులో ఎమోషనల్‌ గా ఫీలవుతారు. ఇక మేము వెళ్తాము  అని అప్పు చెప్పే సరికి ఫ్రెండ్స్‌ అందరూ ఎందుకు ఏమైందని అడుగుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

kalavari kodalu kanaka mahalakshmi serial today march 26th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్ర కోసం లక్ష్మీ విహారితో ఏం చెప్పింది? లక్ష్మీ గర్భవతి అని పండు విహారికి చెప్పేస్తాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్ర కోసం లక్ష్మీ విహారితో ఏం చెప్పింది? లక్ష్మీ గర్భవతి అని పండు విహారికి చెప్పేస్తాడా!
Nindu Manasulu Serial Today March 26th: నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల్ని విడదీసేసిన మంజుల! ఇందిరకు షాక్ ఇచ్చిన సిద్ధూ తల్లిదండ్రులు!
నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల్ని విడదీసేసిన మంజుల! ఇందిరకు షాక్ ఇచ్చిన సిద్ధూ తల్లిదండ్రులు!
Podharillu Serial Today March 26th:శైలు విషయంలో కేశవ్‌ను మహా, కన్నా ఎలా ఆడుకున్నారు? సర్టిఫికేట్ల కోసం మహా ఏం చేసింది..?
పొదరిల్లు: శైలు విషయంలో కేశవ్‌ను మహా, కన్నా ఎలా ఆడుకున్నారు? సర్టిఫికేట్ల కోసం మహా ఏం చేసింది..?
chinni serial today march 26th: చిన్ని సీరియల్: చిన్నిని మ్యాడీ క్షమించేస్తాడా! దేవాతో చిన్ని చేసిన ఛాలెంజ్ ఏంటి?
చిన్ని సీరియల్: చిన్నిని మ్యాడీ క్షమించేస్తాడా! దేవాతో చిన్ని చేసిన ఛాలెంజ్ ఏంటి?

వీడియోలు

Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam
Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trump Warns Iran: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Metformin: డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
IPL 2026: ఐపీఎల్‌లో పరుగుల వర్షం! బౌలర్లను చిత్తు చేసి అత్యధిక స్కోర్లు నమోదు చేసిన 5 మ్యాచ్‌లు ఇవే!
ఐపీఎల్‌లో పరుగుల వర్షం! బౌలర్లను చిత్తు చేసి అత్యధిక స్కోర్లు నమోదు చేసిన 5 మ్యాచ్‌లు ఇవే!
TVS Bikes 2026: టీవీఎస్‌లో సామాన్యుడి బడ్జెట్ నుంచి రేసింగ్ ట్రాక్ వరకు అందుబాటులో ఉన్న మోడళ్లు, ధరల వివరాలు ఇవే?
టీవీఎస్‌లో సామాన్యుడి బడ్జెట్ నుంచి రేసింగ్ ట్రాక్ వరకు అందుబాటులో ఉన్న మోడళ్లు, ధరల వివరాలు ఇవే?
Embed widget