అన్వేషించండి

Brahmamudi Serial Today August 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కావ్యకు క్యాన్సర్‌ - హాస్పిటల్‌లో చూసి రాజ్‌ షాక్

Brahmamudi serial today episode August 11th: హాస్పిటల్‌లో కావ్య అంకాలజిస్ట్‌ను కలవడంతో రాజ్‌ షాక్ అవుతాడు. ఎమోషనల్‌ అవుతూ బాధపడతాడు.  

Brahmamudi Serial Today Episode:  హాస్పిటల్‌కు వెళ్తున్న కావ్యను చూసి బాధపడుతుంది అపర్ణ. భర్తతో కలిసి వెళ్లాల్సిన దానివి ఇలా ఒంటరిగా వెళ్లే పరిస్థతి వచ్చింది అంటూ ఎమోషనల్‌ అవుతుంది. కావ్య కారులో వెళ్తుంటే మరో పక్క నుంచి కారులో వస్తున్న రాజ్‌ చూస్తాడు.

రాజ్: కళావతి గారేంటి ఆఫీసు ఇటు సైడు ఉంటే తను అటు సైడు వెళ్తుంది. ఈ రూట్‌ లో ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి. అన్ని హాస్పిటల్స్‌ ఉన్నాయి కదా..? ఏదో డౌటు కొడుతుంది. ఫాలో చేద్దాం.. కళావతి గారు  ఏంటీ హాస్పిటల్‌కు వెళ్తున్నారా..?

అనుకుని కావ్యకు కాల్‌ చేస్తాడు.

కావ్య: ఈయనేంటి ఇప్పుడు ఫోన్‌ చేస్తున్నారు..?

రాజ్‌ : హలో కళావతి గారు ఎక్కడున్నారు..?

కావ్య: ( మనసులో) ఇప్పుడు హాస్పిటల్‌కు వెళ్తున్నాను అని చెబితే హాస్పిటల్‌కు వచ్చేస్తా అంటాడు

రాజ్‌: హలో కళావతి గారు వినిపిస్తుందా..? వినిపిస్తే ఎక్కడున్నారు అంటే చెప్పరేంటండి..?

కావ్య: నేను కొంచెం బయటకు వచ్చానండి..

రాజ్: నేను మీ కోసం మీ ఇంటికి వస్తుంటే.. మీరేంటండి బయటకు వెళ్లిపోయారు.

కావ్య: అంటే రామ్‌ గారు అర్జెంట్‌గా ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చింది. అందుకే చెప్పా పెట్టకుండా వెళ్లిపోతున్నాను బాయ్‌..

రాజ్‌:  డౌటు లేదు.. కళావతి గారు నాతో ఏదో దాస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలి. ముందు కళావతి గారిని ఫాలో చేస్తే తెలుస్తుంది.

రాజ్‌ కావ్యను ఫాలో చేస్తుంటాడు. కావ్య హాస్పిటల్‌ కు వెళ్తుంది.

రాజ్‌: కళావతి గారు హాస్పిటల్‌ కి వెళ్తుందేంటి..? అంటే కావ్యకు ఏదైనా హెల్త్‌ ఇష్యూ ఉందా..? కళావతి గారు ఈరోజు మీరు దాస్తున్న నిజం ఏంటో కనుక్కుంటాను

అనుకుంటూ కావ్యను ఫాలో అవుతూ హాస్పిటల్‌ లోకి వెళ్తాడు. లోపలికి వెళ్లిన కావ్య డాక్టర్‌ ప్రియను కలవాలని అపాయింట్మెంట్‌ ఉందని రిసెప్షన్‌లో చెప్తుంది. మేడం ఇవాళ అంకాలజీ వార్డులో ఉన్నారని అక్కడికి వెళ్లండి అని చెప్పగానే.. కావ్య వెళ్తుంది. వెనకే వెళ్లిన రాజ్‌ అంకాలజీ డిపార్ట్‌మెంట్‌ బోర్డు చూసి కావ్యకు క్యాన్సర్‌ అనుకుని బాధపడుతూ వెళ్లి పక్కన కూర్చుంటాడు. ఇంతలో బయటకు వచ్చిన కావ్య రాజ్‌ను చూస్తుంది.

కావ్య: ఈయనేంటి ఇక్కడు ఉన్నారు. ఇప్పుడు ఈయన కంట పడితే నానా ప్రశ్నలు వేసి చంపుతారేమో..?

 కావ్య రాజ్‌ను చూసీ చూడనట్టు వెళ్లిపోతుంటే..

రాజ్: ఆగండి కళావతి గారు నాకు కనిపించకూడదని.. నా నుంచి తప్పించుకుని పారిపోతున్నారా..?  ఇంకా ఎంతకాలం అని పారిపోతారు.. ఇంకెన్నేళ్లు నాకు ఈ విషయం తెలియకుండా దాచేస్తారు కలావతి గారు. సూదిని మూట కట్టినంత మాత్రానా అది దాగదు కళావతి గారు. ఏదో ఒక వంక నుంచి అది బయటపడుతుంది. అలాగే మీరు నా దగ్గర దాస్తున్న నిజం కూడా ఇవాళ బయటపడింది.

కావ్య షాక్‌ అవుతుంది.

కావ్య: ఏం మాట్లాడుతున్నారు రామ్‌ గారు.

రాజ్‌:  ఇక చాలు నటించింది చాలు కళావతి గారు నాకు నిజం తెలిసిపోయింది. చెప్పండి కళావతి గారు.. ఎందుకు ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర  దాచారో చెప్పండి.. ఎందుకు నాకీ నిజాన్ని చెప్పకుండా మోసం చేశారో చెప్పండి. నిజం చెప్తే నేను అర్తం చేసుకోలేను అనుకున్నారా..? మిమ్మల్ని అపార్థం చేసుకుంటాను అనుకున్నారా..? నాకు ఆ రోజే డౌటు వచ్చింది కళావతి గారు.. మీరు నన్ను వద్దు అనడానికి ఇలాంటి బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది అని కానీ అది ఇంత బలమైన కారణం అని ఇప్పుడే తెలిసింది కళావతి గారు..

కావ్య: రామ్‌ గారు అది కాదండి..

రాజ్: వద్దు కళావతి గారు ఇంకా ఈ విషయాన్ని నా దగ్గర దాచే ప్రయత్నం చేయకండి.. ఒకవేళ చేసినా.. నేను నమ్మను.. ఎందుకంటే మీరు ఆ గదిలో నుంచి వచ్చినప్పుడే నాకు పూర్తిగా అర్థం అయింది మీకు క్యాన్సర్‌ అని.

కావ్య: (మనసులో) ఓహో ఈయనకు ఇలా అర్థం. అయిందా..? ఇంకా నయం నాకు ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం తెలిసిందేమో అనుకున్నాను

మనసులో అనుకున్న కావ్య నవ్వుతూ తనకు క్యాన్సర్‌ లేదని చెప్తుంది. రాజ్‌ నమ్మడు.. బాధపడుతూ ఉంటాడు. కట్‌ చేస్తే ఇంటి దగ్గర అపర్ణ, ఇందిరాదేవి.. కావ్య కోపం వెయిట్‌ చేస్తుంటారు. ఇంతలో రాజ్‌, కావ్య రాగానే రాజ్‌ బాధపడుతూ ఏదేదో మాట్లాడుతుంటే కావ్య మెల్లగా రాజ్‌కు నిజం తెలియదని అపర్ణ వాళ్లకు చెప్తుంది. దీంతో వాళ్లు నవ్వుకుంటారు. రాజ్‌ ను నమ్మించడానికి కావ్య డాక్టర్‌కు ఫోన్‌ చేసి స్పీకర్‌ పెట్టి మాట్లాడుతుంది. డాక్టర్‌ క్యావ్యకు ఏ ప్రాబ్లమ్‌ లేదని చెప్పగానే.. రాజ్ సిగ్గు పడతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట

 

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Pavithra : జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
Illu Illalu Pillalu Serial Today August 17th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమకి గోరింటాకు పెట్టిన ధీరజ్! చేతి మీద కల్యాణ్ పేరు రాసిందెవరు?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమకి గోరింటాకు పెట్టిన ధీరజ్! చేతి మీద కల్యాణ్ పేరు రాసిందెవరు?
Brahmamudi Serial Today August 17th: ‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీతో నందు గురించి మాట్లాడిన ఇందు – రాజును అవమానించిన చలపతి
‘బ్రహ్మముడి’ సీరియల్: వెంకీతో నందు గురించి మాట్లాడిన ఇందు – రాజును అవమానించిన చలపతి
Karthika Deepam 2 Serial Today August 17th: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌ని లవ్ చేస్తున్నా.. నా పెళ్లి చేస్తే మీ జీవితాలు మార్చేస్తా!
కార్తీకదీపం 2 సీరియల్: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌ని లవ్ చేస్తున్నా.. నా పెళ్లి చేస్తే మీ జీవితాలు మార్చేస్తా!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget