అన్వేషించండి

Brahmamudi Serial Today April 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : కళ్యాణ్‌కు చెక్‌ పవర్‌ ఇస్తానన్న రాజ్‌ - బిడ్డను తీసుకుని బయటకు వెళ్లిపోమన్న అపర్ణ

Brahmamudi Today Episode: కంపెనీ భాధ్యతలు లీగల్ గా కళ్యాణ్ కు ఇస్తానని రాజ్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రాహుల్‌, రుద్రాణిని తిట్టినట్లు నాటకం అడతాడు. అనామిక చూడాలని రాహుల్‌ ఇంకా గట్టిగా రుద్రాణిని తిడుతుంటాడు. నువ్వసలు తల్లివేనా అంటూ కోప్పడతాడు. అది గమనించిన అనామిక రాహుల్‌ను ఏంటిది తల్లితో ఇలాగేనా మాట్లాడేది అంటుంది. దీంతో నా బాధ నీకు అర్థం కాదులే అనామిక అంటూ రాహుల్‌ వెళ్లిపోతాడు. రుద్రాణి బాధపడుతుంది. కళ్యాణ్‌ ఎండీ అయ్యాడు. కనీసం నన్ను మేనేజర్‌ను అయినా చేయమని అడుగుతున్నాడు అంటూ రుద్రాణి బాధపడుతుంది. దీంతో రాహుల్‌ అడిగన దాంట్లో న్యాయం ఉంది కదా అని అనామిక చెప్తుంది. కళ్యాణ్‌ ను ఒప్పించి రాహుల్‌ను మేనేజర్‌ను చేసే బాధ్యత నాది అంటూ హామీ ఇస్తుంది అనామిక. ఇప్పుడే కాదు మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి అని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు రూంలో రాజ్‌ బాబు ఏడుస్తుంటే  ఆడిస్తూ ఉంటాడు.

రాజ్‌: ఊరుకోరా పాలు వస్తున్నాయి. అమ్మ రానివ్వు.. అమ్మ వస్తుంది. ఎత్తుకుంటుంది. పాలు ఇస్తుంది. ఏడవకు నాన్న ఏడవకు అమ్మ వచ్చేస్తుంది.

కావ్య: హలో మాస్టారు ఎమన్నారు అమ్మనా? నేను అమ్మనా.. ? ఎవరికి అమ్మనయ్యాను. ఎప్పుడు అయ్యాను. మీరు కన్న బిడ్డకు నన్ను తల్లిని చేస్తారా? మరి వాడి తల్లిని ఎం చేస్తారు. మీరు ఏం అయినా చేసుకోండి నన్ను అమ్మా అని ఎలా పరిచయం చేస్తారు. ఇంకోసారి నన్ను అమ్మా అంటే ఊరుకునేదే లేదు. కాఫీ

రాజ్‌: నాకా.. చల్లారిపోయిందా?

కావ్య: కోపమా?

రాజ్‌: కాదు కాఫీ..

రాజ్‌ కాఫీ తాగుతుంటే వెన్నెల గురించి ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటుంది కావ్య. ఇంతలో తన ఫ్రెండ్‌ తప్పిపోయిందని తను ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఏం చేయాలని రాజ్‌ను అడుగుతుంది. ఎందుకు తప్పిపోయిందని అడగ్గానే దాని మొగుడు కూడా నీలాగే బిడ్డను తీసుకొచ్చి నీలాగే చేశాడని అది తట్టుకోలేక పోయిందని చెప్పగానే సోషల్‌ మీడియాలో వెతకమని రాజ్‌ చెప్పి ఇంతకీ మీ ఫ్రెండ్‌ పేరు ఏంటని అడగ్గానే పున్నమి అని చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత అందరూ హల్లో కూర్చుని ఉండగా లాయర్‌ అక్కడికి వస్తాడు.

సుభాష్‌: ఈ ఇంట్లో మిమ్మల్ని రమ్మని ఎవరైనా పిలిచారా?

రాజ్‌: నేనే రమ్మన్నాను.

సుభాష్‌: రాజ్‌ ఇప్పుడు లాయర్‌ గారితో అవసరం ఏముంది.

రాజ్‌: చాలా ఉంది డాడీ..

ప్రకాశం: ఆ చాలా అవసరం ఎవరికుంది?

రాజ్‌: ఈ ఇంటికి ఈ ఇంటి సభ్యులకు మన కంపెనీకి అక్కడ స్థానాలకు

అపర్ణ: రాజ్‌ ఎప్పుడూ లేనిది ఈ ఇంటికి లాయర్‌ గారు వచ్చారంటే నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. ఈ ఇంటికి లాయర్‌ గారితో ఎప్పుడూ అవసరం రాకూడదని కోరుకునే సభ్యురాలిగా చెప్తున్నాను. నీ మనసులో ఏమైనా ఉంటే ముందుగా మాతో చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకో..

రాజ్‌: ఇది నేను తీసుకున్న నిర్ణయం కాదు మమ్మీ మీరంతా కలిసి ఆమోదించిందే..! మీ నిర్ణయాన్ని నేను సమ్మతించాను అంతే

ఇందిరాదేవి: ఎంట్రా ఆ నిర్ణయం ఎవరికి వారు నిర్ణయాలు తీసుకోవడం అమలు చేయడం మొదలుపెడితే ఈ ఇంట్లో పెద్దరికం ఏమైనట్టు

 అనగానే నేను సొంతంగా తీసుకున్న నిర్ణయం ఏం కాదు ఇది. నా ప్లేస్‌ లో కూర్చున్న కళ్యాణ్‌కు లీగల్‌గా అన్ని పవర్స్‌ ఇవ్వబోతున్నాను అందుకే లాయర్‌ గారిని రమ్మనాను అనగానే అనామిక, ధాన్యలక్ష్మీ హ్యాపీగా ఫీలవుతారు. మిగతా అందరూ షాక్‌ అవుతారు. అనామిక మాత్రం కళ్యాణ్‌తో ఒక్క చెక్కుమీద సంతకం తీసుకున్నానంటే నా పుట్టింటి అప్పులన్నీ తీరిపోతాయి అని మనసులో అనుకుంటుంది. మరోవైపు అందరూ కలిసి రాజ్ మనసు మార్చాలని చూస్తారు. ఒక బిడ్డ కోసం అన్ని వదులుకోవడం ఎందుకు అంటూ కావ్య నిలదీస్తుంది. ఇప్పటికైనా ఆ బిడ్డ పుట్టుక వెనక ఉన్న నిజాన్ని అందరి ముందు చెప్పండి అని కోరుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ఫేస్ చూసుకోమని కామెంట్ చేశారు... కట్ చేస్తే నేషనల్ అవార్డు కొట్టాడు!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బావిలో సిరిని సుభాష్‌కి అప్పగించిన అంబిక! ఇంటిళ్లపాది కంగారు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: బావిలో సిరిని సుభాష్‌కి అప్పగించిన అంబిక! ఇంటిళ్లపాది కంగారు!
Nindu Manasulu Serial Today October 14th: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ 6 నెలలు కలిసి ఉండాల్సిందే! అదరగొట్టిన జడ్జి! రాజశేఖరాన్ని చంపాలని చూసిన విజయానంద్!
నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ 6 నెలలు కలిసి ఉండాల్సిందే! అదరగొట్టిన జడ్జి! రాజశేఖరాన్ని చంపాలని చూసిన విజయానంద్!
Godavari Serial Today October 14th: 'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 14: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
నువ్వులేక నేను లేను: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget