అన్వేషించండి

Brahmamudi Serial Today April 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందుకు బర్తుడే విషెష్‌ చెప్పిన రేఖ – రేఖను తిట్టిన అపర్ణ

Brahmamudi serial today episode April 7th: ఆస్థి కోసం నువ్వు ఆడుతున్న నాటకాలు నాకు తెలుసు అంటూ అపర్ణ కోపంగా రేఖను తిడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode: అపర్ణ ఇచ్చిన కావ్య బుక్‌ మొత్తం చదివి అలాగే నిద్రలోకి జారుకుంటుంది ఇందు. అప్పుడే కావ్య ఆత్మ వచ్చి ఇందును నిద్రలేపుతుంది. నిద్ర లేచిన ఇందు కావ్యను చూసి షాక్‌ అవుతుంది.

కావ్య: ఏంటి అచ్చం నీలాగే ఉన్నానని ఆశ్చర్యపోతున్నావా..? నువ్వు నా రక్తానివే కదా..?

ఇందు: అమ్మా.. అమ్మా…

కావ్య: ఏమైందమ్మా ఇప్పుడెందుకు అలా బాధపడుతున్నావు..?

ఇందు: అమ్మ నన్ను వదిలేసి ఎందుకు వెళ్లిపోయావు అమ్మ

కావ్య: నేను ఎక్కడికి వెళ్లాను.. నీ మనసులోనే ఉన్నాను. నీ ప్రతి ఆలోచనలోనూ నేను ఉన్నాను..

ఇందు: నాకు భయంగా ఉందమ్మా..?

కావ్య: ఎందుకు భయపడుతున్నావు ఇందు అంత కష్టం ఇప్పుడు ఏమి వచ్చింది

ఇందు: అమ్మా ఆ రేఖ..

కావ్య: తాతయ్య వాళ్లను చంపేస్తాను అంది. ఆస్థి కోసం సంతకం పెట్టాలని బెదిరిస్తుంది అంతే కదా

ఇందు: అంతే అంటావేంటి అమ్మా.. వాళ్లను ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావడం లేదమ్మ

కావ్య: జవాబు లేని ప్రశ్న అంటూ ఈ లోకంలోనే లేదు ఇందు. నువ్వు ప్రయత్నిస్తే ఈ సమస్యకు కూడా తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది

ఇందు: లేదమ్మా నీ అంత ధైర్యం కానీ నీ అంత తెలివి కానీ నాకు లేవు.. నీలా కష్టం వస్తే నేను యుద్దం చేయలేను

కావ్య: అలా అని ఎవరన్నారు. నువ్వు నా రక్తానివి నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు..

ఇందు: లేదమ్మా నేను ఓడిపోయాను.. వాళ్లను కాపాడుకోవడం కోసం ఆస్థి మొత్తం ఇచ్చేయాలని డిసైడ్‌ అయిపోయను. మీ ఆశయాలను ఆశలను నాశనం చేసేశాను. నేను ఈ యుద్దంలో ఓడిపోయాను అమ్మ. నీ కూతురుగా ఉండే అర్హత నాకు లేదమ్మా

కావ్య: ఇందు అన్నీ యుద్దాలు గెలవాలని ఎందుకు అనుకుంటున్నావు..పోనీ నేను ఏమైనా అన్ని యుద్దాలు గెలిచాను అనుకుంటున్నావా..? కొన్నిసార్లు మనకు పోరాడే అవకాశం కూడా ఉండదు. కాలం కలిసి రానప్పుడు కలిసొచ్చే వరకు ఎదురుచూడాలి. నువ్వు ఇప్పుడు సంతకం పెట్టినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు. నీకంటూ ఓ రోజు వస్తుంది. నువ్వు చేసే పనిలో న్యాయం ఉన్నప్పుడు ఈ ప్రకృతే నీకు అండగా నిలబడి నిన్ను గెలిపిస్తుంది.

ఇందు: అమ్మా తప్పకుండా గెలిపిస్తుందా..?

కావ్య: తప్పకుండా గెలిపిస్తుంది. కానీ అది జరగాలంటే ముందు నిన్ను నువ్వు నమ్మాలి. నువ్వు అనుకున్నది సాధించగలను అని నమ్మాలి. అప్పుడు నువ్వు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది. ఇందు కాస్త జాగ్రత్తగా ఆలోచించు.. ఒక వెలుగులా నీకు మార్గం దొరుకుతుంది నీ మీద నమ్మకం పెట్టుకుని ఆలోచించు

అంటూ కావ్య మాయం అవుతుంది. ఇందు ధైర్యంగా ఆలోచిస్తాను అమ్మా అనుకుంటూ పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయమే రేఖ, భ్రమరాంబ, భూషణ్‌  ఇందు రూంలోకి వెళ్లి బర్తుడే విషెష్‌ చెప్తారు. అంతా చూస్తున్న అపర్ణ రేఖను తిడుతుంది. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. స్వాతి వచ్చి ఏ నిర్ణయం తీసుకున్నావు అక్కా అని అడిగితే నన్ను నేను కిడ్నాప్‌ చేసుకుంటాను. కేక్‌ కట్‌ చేయగానే అని ఇందు చెప్తుంది. స్వాతి షాక్‌ అవుతుంది. తర్వాత అందరూ గెస్ట్‌హౌస్‌ కు వెళ్తారు. బర్తుడే పార్టీ కోసం ఏర్పాట్లు జరుగుతుంటాయి. చక్రి వచ్చి రేఖకు వార్నింగ్‌ ఇచ్చి వెల్లిపోతాడు. మరోవైపు ఇందును కిడ్నాప్‌ చేసేందుకు వెయిటర్లుగా గెటప్‌ వేసుకుని రాజు, లక్కీ అక్కడికి వెళ్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి విహారి విశ్వప్రయత్నం! లక్ష్మీ ప్రాణాలకు ముప్పు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి విహారి విశ్వప్రయత్నం! లక్ష్మీ ప్రాణాలకు ముప్పు!
Godavari Serial Today July 22nd: 'గోదావరి' సీరియల్: తండ్రి డైరీ చదివిన జాను! మురళీ, నందుల రొమాంటిక్ సీన్ అదుర్స్!
'గోదావరి' సీరియల్: తండ్రి డైరీ చదివిన జాను! మురళీ, నందుల రొమాంటిక్ సీన్ అదుర్స్!
Jabardasth Latest Promo: 'జబర్దస్త్'లో ఆషాడం ఆఫర్లు... నవ్విస్తే డబ్బులు... అసలు బండారం బయటపెట్టిన 'హైపర్' ఆది
'జబర్దస్త్'లో ఆషాడం ఆఫర్లు... నవ్విస్తే డబ్బులు... అసలు బండారం బయటపెట్టిన 'హైపర్' ఆది
Jabardasth New Timing: ఆదివారానికి వచ్చిన 'జబర్దస్త్'... టైమింగ్ మారింది - కొత్తగా పాత టీమ్ లీడర్లు వచ్చారోచ్
ఆదివారానికి వచ్చిన 'జబర్దస్త్'... టైమింగ్ మారింది - కొత్తగా పాత టీమ్ లీడర్లు వచ్చారోచ్

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
Embed widget