అన్వేషించండి

Brahmamudi Serial Today April 18th:  ‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణ చేత కేక్‌ కట్‌ చేయిద్దామన్న రాజ్‌ – రాజ్‌ను అనుమానించిన యామిని  

Brahmamudi Today Episode: అపర్ణ పుట్టినరోజు కూడా ఇవాళే అని తెలుసుకున్న  రాజ్‌ ఆమెతో కేక్‌ కట్‌ చేయించాలనుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Brahmamudi Serial Today Episode:  దేవుడి దగ్గర నిలబడ్డ రాజ్‌, కావ్యలను చూసి పంతులు.. అచ్చం సీతారాముల్లా ఉన్నారు మీ గోత్రం చెప్పండి అంటాడు. దీంతో కావ్య షాక్‌ అవుతుంది. రాజ్‌ మాత్రం మేము భార్యాభర్తలం కాదని కాకపోతే ఇద్దరం తెలుసని చెప్తాడు. అయితే ఎవరి పేరు మీద అర్చన చేయాలని అడుగుతాడు పంతులు. మా అమ్మ పుట్టినరోజు ఆవిడ పేరు మీద చేయించండి అంటాడు రాజ్‌. పంతులు పేరు అడగ్గానే భానుమతి అని చెప్తాడు. గోత్రం అడిగితే తెలియదు అంటాడు. దీంతో దేవుడి పేరుతో చేస్తానంటాడు పంతులు. మరోవైపు యామిని ఆలోచిస్తుంది. వైదేహి కాఫీ తీసుకుని వస్తుంది.

వైదేహి: యామిని కాఫీ తీసుకో

యామిని: అబ్బా ఎందుకు మమ్మీ అంతలా అరుస్తావు. మెల్లగా చెప్పొచ్చు కదా

వైదేహి: నేను మెల్లగా చెబితే నీకు వినిపించడం లేదు కదా అందుకు గట్టిగా అరిచాను కానీ ముందు కాఫీ తీసుకో.. నువ్వే పరధ్యానంలో ఉన్నావు

యామిని:  బావ శివాలయానికి వెళ్లింది నిజమే కానీ ఇంకా అక్కడే ఉన్నాడు. ఓన్లీ దర్శనం అయితే రెండే నిమిషాలు చాలు.  ఒకవేళ ప్రదక్షిణ చేస్తే పది నిమిషాలు కానీ ఇంకా అక్కడే ఉన్నాడంటే.. అర్చన కూడా చేయిస్తే దానికి ఇంకో పది నిమిషాలు.. మొత్తం అరగంట కావొచ్చు కానీ వెళ్లి గంటకు పైగా అవుతుంది. ఇంతసేపు అక్కడే ఏం చేస్తున్నాడో

వైదేహి:  భక్తి పారవశ్యంలో ముగినిపోయాడేమో

యామిని:  అంత భక్తి పారవశ్యంలో ముగినిపోవడానికి ఆయన భక్త కన్నప్ప కాదు మామ్. జస్ట్‌ రామ్‌గా మారిన రాజ్‌

వైదేహి:  అయితే అక్కడ ఏం చేస్తున్నాడంటావు

యామిని: అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్లు కలిసి ఉండాలి. లేదా తనే ఎవరినైనా కలవడానికి వెళ్లి ఉండాలి. రెండిట్లో ఏది జరిగినా మనకే ప్రమాదం మమ్మీ

వైదేహి: నువ్వు చెప్తుంటే నాకు డౌటు వస్తుంది బేబీ. మన ప్రమేయం లేకుండా అల్లుడు గారు డ్రెస్‌ ఆన్‌లైన్‌ లో బుక్‌ చేయడం ఏంటి..? ట్రెడిషనల్‌గా రెడీ అయి గుడికి వెళ్లడం ఏంటి..? ఎదుకైనా మంచిది నువ్వు కూడా గుడికి వెళ్లడం మంచిది

యామిని: కదా నేను కూడా అదే అనుకుంటున్నాను మమ్మీ. కానీ నువ్వు తనని చూస్తున్నావు కదా..? నేను ఎక్కడికి వస్తానన్నా కూడా సీరియస్‌ అవుతున్నాడు. ప్రతి విషయానికి నా మీద సీరియస్‌ అవుతున్నాడు. నేనేదో తన వెంట పడుతున్నట్టు ఫీల్‌ అవుతున్నాడు. ఇప్పుడు నేను గుడికి వెళితే ఎంత పెద్ద గొడవ చేస్తాడో అని ఆలోచిస్తున్నాను

వైదేహి:  గొడవ చేస్తాడని ఆలోచిస్తే మొదటికే మోసం వస్తుంది. ఇన్ని రోజులు నువ్వు పడిన కష్టం వేస్ట్‌ అవుతుంది.  చూడు యామిని రాజ్‌ మిస్‌ అయ్యాడని నువ్వు మళ్లీ డిప్రెషన్‌లోకి వెళ్తే ఆ బాధ పడే ఓపిక మాకు మళ్లీ లేదు. తిడితే తర్వాత సర్ది చెప్పుకోవచ్చు. కానీ తను నీ చేయి దాటి పోకుండా చూసుకో వెళ్లు

అని వైదేహి చెప్పగానే.. యామిని సరే మమ్మీ అంటూ వెళ్లిపోతుంది. రాజ్‌ గుడిలో అన్నదానం చేస్తుంటే అన్నం తినడానికి అపర్ణ వస్తుంది. డల్లుగా కూర్చుని ఉంటే రాజ్‌ గుర్తు పట్టి ఉదయం మీరు కిందపడుబోతుంటే ఆపాను కదా అని అడుగుతాడు. అవునని అపర్ణ చెప్తుంది.

రాజ్‌: మిమ్మల్ని చూస్తుంటే పది మందికి అన్నం పెట్టే వారిలా ఉన్నారు. కానీ మీరు ఇక్కడ వచ్చి భోజనం చేయడం ఏంటమ్మా..?

అపర్న: ఎందుకో నువ్వు అన్నదానం చేస్తుంటే తినాలనిపించింది అందుకే వచ్చాను బాబు. అలాగే నా పుట్టినరోజు కూడా ఇవాళే

రాజ్‌: ఆశ్చర్యంగా ఉందే ఇవాళ మా అమ్మ పుట్టినరోజు కూడా హ్యాపీ బర్తుడే అమ్మా

అపర్ణ:  ప్రతి సంవత్సరం నా కొడుకు వచ్చి ఇలాగే అన్నదానం చేసేవాడు. కానీ ఈ సంవత్సరం రాలేదు. కాలం మమ్మల్ని దూరం చేసింది బాబు

రాజ్‌: ఏం లేదమ్మా ఆ దేవుడు మీకు మీ కొడుకును దగ్గర చేరుస్తాడు

అపర్ణ:  నీ నోటి చలువ అది త్వరగా జరిగితే బాగుండు

రాజ్‌: నేను చెప్పాను కదమ్మా అది త్వరలోనే జరుగుతుందిలే.. మీ కొడుకు గురించి ఆలోచిస్తూ ఆ బాధలో సగం సగం తినకండి.. నన్ను కూడా మీ కొడుకే అనుకుని కడుపు నిండా తినండి

అపర్ణ: అలాగే బాబు

అంటూ అపర్ణ భోజనం చేస్తుంది. రాజ్‌, కావ్య దగ్గరకు వెళ్లి అపర్ణను చూపించి ఆవిడను చూస్తుంటే మా అమ్మే గుర్తుకు వస్తుంది. పైగా ఆవిడ పుట్టినరోజు కూడా ఇవాళేనట. నాకు ఇంకో హెల్ప్‌ చేస్తావా..? అని అడుగుతాడు. ఏంటని కావ్య అడగ్గానే.. నాకెందుకో ఆవిడ చేత కేక్‌ కట్‌ చేయించాలని ఉంది. నీకు ఓకే కదా అని అడుగుతాడు. రాజ్‌ మాటలకు కావ్య షాక్‌ అవుతుంది. గతం మర్చిపోయారు కానీ కొడుకు ప్రేమ అలాగే ఉంది అని మనసులో అనుకుని సరే మీ ఇష్టం అని చెప్తుంది. దీంతో రాజ్‌ అపర్ణ దగ్గరకు వెళ్లి మీ చేత కేక్‌ కట్‌ చేయించాలని ఉంది మీకు ఓకే కదా అమ్మా అని అడుగుతాడు. అపర్ణ ఎమోషనల్‌ షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌  అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి విహారి విశ్వప్రయత్నం! లక్ష్మీ ప్రాణాలకు ముప్పు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి విహారి విశ్వప్రయత్నం! లక్ష్మీ ప్రాణాలకు ముప్పు!
Godavari Serial Today July 22nd: 'గోదావరి' సీరియల్: తండ్రి డైరీ చదివిన జాను! మురళీ, నందుల రొమాంటిక్ సీన్ అదుర్స్!
'గోదావరి' సీరియల్: తండ్రి డైరీ చదివిన జాను! మురళీ, నందుల రొమాంటిక్ సీన్ అదుర్స్!
Jabardasth Latest Promo: 'జబర్దస్త్'లో ఆషాడం ఆఫర్లు... నవ్విస్తే డబ్బులు... అసలు బండారం బయటపెట్టిన 'హైపర్' ఆది
'జబర్దస్త్'లో ఆషాడం ఆఫర్లు... నవ్విస్తే డబ్బులు... అసలు బండారం బయటపెట్టిన 'హైపర్' ఆది
Jabardasth New Timing: ఆదివారానికి వచ్చిన 'జబర్దస్త్'... టైమింగ్ మారింది - కొత్తగా పాత టీమ్ లీడర్లు వచ్చారోచ్
ఆదివారానికి వచ్చిన 'జబర్దస్త్'... టైమింగ్ మారింది - కొత్తగా పాత టీమ్ లీడర్లు వచ్చారోచ్

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
Embed widget