అన్వేషించండి

Brahmamudi Serial Today April 16th:  ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌ బతికే ఉన్నాడన్న అపర్ణ – అపర్ణను అనుమానించిన రుద్రాణి   

Brahmamudi Today Episode: ఇంట్లో అందరి ముందు రాజ్‌ బతికే ఉన్నాడని గుడిలో అన్నదానం చేయిస్తున్నాడని అపర్ణ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode: రాజ్‌కు గిఫ్ట్‌ ఇవ్వడానికి షర్ట్‌ మీద ఆర్‌ లెటర్‌ స్టిచింగ్‌ చేస్తుంది కావ్య. ఇంతలో రాజ్‌ వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతాడు. తాను స్టిచ్‌ చేస్తుంది చూపిస్తుంది కావ్య ఎందుకు ఇలా కుడుతున్నావని రాజ్‌ అడుగుతాడు.

కావ్య: ఇది నా జ్ఞాపకంగా మీ గుండెలకు దగ్గరగా ఉండి నన్ను మీకు గుర్తు చేస్తే మీరు నా దగ్గరకు వచ్చే అవకాశం ఉంది కదా

రాజ్‌:  నువ్వు నన్ను ఎంత గొప్పగా ప్రేమించావో ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది కళావతి. నీ అంత గొప్పగా నేను ప్రేమించకపోవచ్చు కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను. నేను నీకు ఎంత దూరం వెళ్లినా సరే నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతాయి. అంత ప్రేమను ఇచ్చావు నాకు. ఒకవేళ నువ్వు అన్నట్టు అలాంటి పరిస్థితే వస్తే.. నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చేస్తాను. ఏదో ఒకరోజు ఏదో ఒక క్షణం నీకంటే గొప్పగా నేనే ప్రేమించానని నీకు అనిపించేలా చేస్తాను.

అని రాజ్‌ చెప్పినట్టు కావ్య కలగంటుంది.

కావ్య: నిజంగానే మీరు చెప్పిన పరిస్థితులు వచ్చేశాయండి. మీకు తెలియకుండానే.. నాకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మీరు నాకిచ్చిన మాట నిలబెట్టుకునే టైం వచ్చింది. ఈ జ్ఞాపకాన్ని తిరిగి మీ దగ్గరకే పంపిస్తున్నా.. దీన్ని ఆధారం చేసుకుని మీ గుండె లోతుల్లో ఉన్న జ్ఞాపకాలను బయటకు తీసుకురండి.

అనుకుంటూ షర్ట్‌ను కొరియర్‌ చేయమని అప్పుకు ఇవాళి అనుకుంటూ బయటకు వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్‌ కూడా కావ్యను రేపు ఎలాగైనా నిజం చెప్పమని అడగాలి అనుకుంటుంటాడు. ఇంతలో కావ్య ఫోన్‌ చేసి మీకో సర్‌ప్రైజ్‌ కొద్దిసేపట్లో కొరియర్‌ వస్తుంది చూడండి అని చెప్పి కాల్ కట్‌ చేస్తుంది. ఇంతలో కొరియర్‌ బాయ్‌ వచ్చి పిలుస్తాడు. యామిని వచ్చి ఎవరికి కొరియర్‌ అని అడుగుతుంది. రాజ్‌ కంగారుగా పరుగెత్తుకొచ్చి నాకే కొరియర్‌ అని పార్శిల్‌ తీసుకుని లోపలికి వెళ్లి ఓపెన్‌ చేసి చూస్తాడు. వెంటనే కావ్యకు ఫోన్‌ చేస్తాడు.

కావ్య:  గిఫ్ట్‌ అందిందా..?

రాజ్‌:  అందింది

కావ్య: అది చూస్తే మీకేం గుర్తు రాలేదా..?

రాజ్‌:  వచ్చింది

కావ్య: నిజంగానా..? ఏం గుర్తుకు వచ్చింది

రాజ్‌:  నా మీద మీకున్న అభిమానం కనిపించింది. నాకోసం మీరు పడ్డ కష్టం కనిపించింది.

కావ్య:  ఇంకేమీ గుర్తు రాలేదా..?

రాజ్‌:  ఇంకేమీ గుర్తు రావాలండి

కావ్య: ఏం లేదు లేండి.. ఇంతకీ ఆర్‌ అంటే తెలుసా..?

రాజ్: ఆర్‌ అంటే రామ్‌ అనే కదండి.. అయినా నాకోసం మీరెందుకు ఇంత కష్టపడ్డారు

అని అడుగుతుండగానే కావ్య రేపు గుడికి మీరు ఈ షర్ట్‌ వేసుకుని రావాలి అని చెప్పి కాల్ కట్‌ చేస్తుంది. పొద్దునే కావ్య అన్నదానానికి అన్ని రెడీ చేస్తుంటే రుద్రాణి చూసి తిట్టుకుంటుంది.

రుద్రాణి:  శ్రీవారు ఇంకా బతికే ఉన్నారన్న బ్రమలో బతుకుతున్న శ్రీమతి కావ్య గారు ఏదో కార్యానికి శ్రీకారం చుట్టినట్టు ఉంది.

కావ్య:  శుభకార్యమే లేండి

రుద్రాణి: అశుభం జరిగిన ఇంట్లో శుభకార్యమా..? అంటే ఆ శుభకార్యం ఎక్కడ జరిపిస్తున్నారు.

కావ్య:  మీరెప్పుడు అడుగుపెట్టని చోటు, అడుగుపెడదామన్నా అనుమతి దొరకని చోటు.

రాహుల్‌:  అంటే గుడే కదా

కావ్య: చూశారా తడుముకోకుండా టక్కున ఎలా చెప్పారో మీ పుత్రరత్నం

అపర్ణ: చాలా హుషారుగా అమ్మా కావ్య అన్ని సర్దేశావా..?

అపర్ణను అలా చూసి అందరూ షాక్‌ అవుతారు.

స్వప్న: కావ్య ఏం చెప్పి ఒప్పించిందో కానీ ఆంటీ ఒక్క పూటలో మొత్తం మారిపోయారు.

ఇంద్రాదేవి: కావ్య పూనుకున్నాకా..? కార్యం కాకుండా ఉంటుందా..?

ప్రకాష్‌: వదినను ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అన్నయ్యా..

సుభాష్‌: అవును ప్రకాషం.. తన పుట్టిన రోజు నాడే మళ్లీ పుట్టినట్టు కనిపిస్తుంది. తన ముఖం అలా వెలిగిపోతుంటే ఈ ఇంటికే వెలుగు వచ్చినట్టు ఉంది. హ్యాపీ బర్తుడే అపర్ణ

అందరూ అపర్ణకు బర్తుడే విషెష్‌ చెప్తాడు.

రుద్రాణి: రాలిపోతుందనుకున్న  పువ్వు రాగాలు పలుకుతున్నట్టు వదిన గారేంటి చాలా హుషారుగా ఉన్నారు

కావ్య:  అందరూ విష్‌ చేస్తుంటే మీకు అర్థం కాలేదా..? ఇవాళ మా అత్తయ్య బర్తుడే..

రుద్రాణి:  నువ్వేంటి వదిన నిన్నటి వరకు నా కొడుకే లేనప్పుడు పుట్టినరోజు ఎందుకు అన్నావు ఇవాళేంటి ఇలా రెడీ అయ్యావు

అపర్ణ: అక్కడ నా కొడుకే కదా అన్నదానం జరిపించేది

అపర్ణ మాటలకు అందరూ షాక్‌ అవుతారు.

అపర్ణ: అదే నా కొడుకు స్థానంలో నా కొడలు ఉండి అన్నదానం జరిపిస్తుంది అందుకే ఇలా ఉన్నాను

అంటూ కావ్యను తీసుకుని గుడికి వెళ్లిపోతుంది. అందరూ రుద్రాణిని తిట్టి లోపలికి వెళ్లిపోతారు. అప్పు ఆఫీసుకు వెళ్తుంటే.. రుద్రాణి ఆపి నువ్వు కూడా గుడికే వెళ్తున్నావా..? అని వెటకారంగా అడుగుతుంది. దీంతో అప్పు, రుద్రాణికి  స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌  అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 23rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: అంబిక వల్ల వారసుడికి ప్రమాదం ఉందని తెలుసుకున్న లక్ష్మీ! కొడుకు, కూతుళ్లని చూసి మురిసిపోయిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: అంబిక వల్ల వారసుడికి ప్రమాదం ఉందని తెలుసుకున్న లక్ష్మీ! కొడుకు, కూతుళ్లని చూసి మురిసిపోయిన విహారి!
Karthika Deepam 2 Serial Today May 23rd: కార్తీకదీపం సీరియల్: తల్లితో దీపకు మధురమైన అనుభవం! బుజ్జమ్మకి ఇచ్చి పడేసిన అక్క, బావలు!
కార్తీకదీపం సీరియల్: తల్లితో దీపకు మధురమైన అనుభవం! బుజ్జమ్మకి ఇచ్చి పడేసిన అక్క, బావలు!
Godavari Serial Today May 23rd: 'గోదావరి' సీరియల్: సింహాద్రి శంకర్‌ని మోసం చేస్తున్నాడా.. మురళీ లవ్‌కి సూర్య సపోర్ట్! లవ్ లెటర్ చిక్కులు తెస్తుందా!
'గోదావరి' సీరియల్: సింహాద్రి శంకర్‌ని మోసం చేస్తున్నాడా.. మురళీ లవ్‌కి సూర్య సపోర్ట్! లవ్ లెటర్ చిక్కులు తెస్తుందా!
Nindu Noorella Saavasam Serial Today May 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి ప్లాన్‌ సక్సెస్‌ - రణవీర్‌ తో వెళ్లనున్న అంజు   
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి ప్లాన్‌ సక్సెస్‌ - రణవీర్‌ తో వెళ్లనున్న అంజు   

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
IPL 2026 RR VS MI Result Update: స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై రాయ‌ల్స్ గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై RR గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Crime Thriller OTT : వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
Tiger Trapped In Cage: నలుగురు మహిళల్ని చంపిన పులిని బంధించిన అధికారులు.. స్థానిక ప్రజలుకు బిగ్ రిలీఫ్
నలుగురు మహిళల్ని చంపిన పులిని బంధించిన అధికారులు.. స్థానిక ప్రజలుకు బిగ్ రిలీఫ్
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Embed widget