అన్వేషించండి

Brahmamudi Serial Today April 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందు కిడ్నాప్‌ -  ఆనందంలో ఐశ్వర్య

Brahmamudi serial today episode April 11th: బర్తుడే పార్టీ నుంచి ఇందును రాజు, లక్కీ కిడ్నాప్‌ చేయగానే ఐశ్వర్య హ్యాపీగా ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode: ఇందు కేక్‌ కటింగ్‌ చేశాక రాజు వచ్చి కేక్‌ తీసుకుని వెళ్తుంటే.. ఐశ్వర్య వెళ్లి ఆపేస్తుంది. మీరు చేస్తామన్నదేంటి..? చేస్తున్నదేంటి..? అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో రాజు మిషన్‌ పని చేయడం లేదు కొంచెం ఆగండి అంటాడు.

ఐశ్వర్య: నాకు కావాల్సింది సాకులు కాదు.. రిజల్ట్స్‌ ఇప్పుడు మీ వల్ల నా ప్లాన్‌ అంతా వేస్ట్ అయింది. మీ వల్ల కాకపోతే తప్పకుని ఉండాల్సింది. అనవసరంగా ప్లాన్‌ మొత్తం ఫెయిల్‌ చేశారు.

రాజు: ఇంక ఆపుతావా..? మేము ఏం కావాలని చేయలేదు. అయినా ఇంకా సంతకం పెట్టలేదు కదా..? ఇందు సంతకం పెట్టదు.. మేము అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేస్తాం.. నువ్వేం వర్రీ అవ్వకు

భ్రమరాంబ: లాయర్‌ గారు ఫైల్‌  తీసుకుని రండి..

లాయర్‌: ( ఫైల్‌ తీసుకెళ్లి) ఇక్కడ సంతకం చేయండి మేడం

భ్రమరాంబ: మా ఇందు చదువుకోలేదండి సంతకం ఎలా పెడుతుంది..?

వ్యక్తి: ఇన్ని కోట్లకు వారసురాలు అయ్యుండి సంతకం పెట్టేంత చదువు కూడా లేదా..? అదేంటి

భూషణ్‌: అంటే చిన్నప్పటి నుంచి తనును చదివించడానికి చాలా ట్రై చేశాం.. తనకు చదువు అబ్బలేదు..

రేఖ: అయినా కోట్లు ఉన్నప్పుడు చదువుతో పనేముంది మీరెంతో చదువుకున్నవాళ్లే ఫ్యూచర్‌లో తన కింద పని చేస్తారు

భ్రమరాంబ: బాగా చెప్పావు రేఖ ఏంటి లాయరు గారు సంతకం పెట్టకపోతే ఏంటి వేలి ముద్ర వేయోచ్చు కదా

లాయరు: వేయోచ్చు మేడం

భ్రమరాంబ: అయితే వెళ్లి ఇంక్‌ ప్యాడ్‌ తీసుకురండి

లాయరు వెళ్లి ఇంక్‌ ప్యాడ్‌ తీసుకొచ్చి ఇందుకు ఇస్తాడు. రేఖ దగ్గరుండి ఇందు చేత వేలి ముద్ర వేయిస్తుంటే.. అప్పుడే లక్కీ తీసుకొచ్చిన మిషన్‌ ఆన్‌ అవుతుంది. రాజు కూడా మరోవైపు నుంచి స్మోక్‌ బాంబ్‌ పేలుస్తాడు. ఆ దెబ్బకు అందరూ దగ్గుతూ స్పృహ కోల్పోతారు. రాజు వెంటనే వెళ్లి ఇందు చేయి పట్టుకుని బయటకు తీసుకొస్తాడు. బయటి నుంచి ఐశ్వర్య చూసి హ్యాపీగా ఫీలవుతుంది. బయటకు వెళ్లిన ఇందును కారెక్కమని రాజు చెప్పగానే..

ఇందు: అయ్యో ఆగండి మర్చిపోయాను.. బ్యాగ్‌ తెచ్చుకుంటాను.. ( చెట్టు చాటున ఉన్న బ్యాగు తెస్తుంది) బ్యాగ్‌ మర్చిపోయాను ఇక వెళ్దామా..?

లక్కీ: మావ ఈ అమ్మాయిని మనం కిడ్నాప్‌ చేస్తున్నామా..? లేక మనల్నే ఈ అమ్మాయి కిడ్నాప్‌ చేస్తుందా..?

రాజు: ఓరేయ్‌ మనం వదిలిన స్మోక్‌ దెబ్బకు మతి పోయిందేమో ముందు మనతో పాటు రానివ్వు

ఇందు: హలో ఏంటి అలా చూస్తున్నారు. మళ్లీ అందరూ వస్తారు. వెళ్దాం పదండి.. రండి త్వరగా కారు ఎక్కండి.. వెళ్దాం పదండి.. కారు త్వరగా స్టార్ట్‌ చేయండి నాకు చాల సంతోషంగా ఉంది. నా లైఫ్‌లో ఫస్ట్‌టైం ఇలాంటి అడ్వెంచర్‌ చేయడం.. నాకు ఈరోజు రెక్కలు వచ్చి ఆకాశంలో ఎగిరిపోతున్నట్టు ఉంది

లక్కీ:  మేడం ఇక్కడ ఏం జరుగుతుందో మీకు ఏమైనా ఐడియా ఉందా..?

ఇందు: కిడ్నాపే కదా చేస్తున్నారు.. చూడ్డానికి మీరు వెధవల్లా ఉన్నా కిడ్నాప్‌ బాగానే  చేస్తున్నారు

రాజు: మమ్మల్ని తిట్టడం పక్కన పెట్టు అక్కడ స్మోక్‌ వల్ల అందరూ పడిపోయారు కదా..? మరి నువ్వెందుకు పడిపోలేదు..

ఇందు: ఓ అదా..? స్మోక్‌ స్టార్ట్‌ అవ్వగానే.. నా ముక్కికి చున్ని అడ్డుపెట్టుకున్నాను

రాజు: చున్నీ ఓకే కర్చీప్‌తో ఎప్పుడైనా ట్రై చేశారా..?

అంటూ తన చేతిలో మత్తు మందు స్ర్పే చేసిన కర్చీప్‌ ఇందు ముఖంపై పెట్టగానే స్పృహ కోల్పోతుంది. రాజు వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు లోపల శేషుకు స్పృహ రాగానే అందరినీ లేపుతాడు. అందరూ ఇందు ఎక్కడ అని కంగారు పడుతుంటే ఐశ్వర్య వెళ్లి ఎవరో ఇద్దరు మనుషులు ముసుగు వేసుకుని ఇందును తీసుకెళ్లిపోయారు అని చెప్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు.

రేఖ:  భూషణ్‌ వెంటనే పోలీసులకు ఫోన్‌ చేయ్‌ మన ఇంటికి వచ్చి మన ముందే అమ్మాయిని ఎత్తుకెళ్లిన వాళ్లని చంపేయాలి

భూషణ్‌: ఓకే రేఖ ఇప్పుడే చేస్తున్నాను.

కట్‌ చేస్తే ఇందును ఒక పాడుబడిన ఇంట్లో బంధిస్తారు రాజు, లక్కీ. ఐశ్వర్యకు ఫోన్‌ చేసి రేఖను 20లక్షలు డిమాండ్‌ చేయమని చెప్తుంది. రాజు ఇరవై కాదు కోటి రూపాయలు అని చెప్పగానే.. ఐశ్వర్య, లక్కీ షాక్‌ అవుతారు. తర్వాత పోలీసులు రేఖ వాళ్ల ఇంట్లో ఎంక్వైరీ చేస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
Illu Illalu Pillalu Serial Today August 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget