అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2026

(Source: ECI/ABP News)

Brahmamudi Serial Today April 11th:  ‘బ్రహ్మముడి’ సీరియల్ : కావ్యకు షాక్‌ ఇచ్చిన రాజ్‌ - కంగారులో యామిని

Brahmamudi Today Episode: చెప్పాపెట్టకుండా రాజ్‌ కారేసుకుని కావ్య ఆఫీసుకు వచ్చి షాక్‌ ఇస్తాడు. దీంతో ఇవాల్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: అప్పు, హాల్లో ఇంద్రాదేవి, స్వప్న, రుద్రాణి కూర్చుని ఉంటారు. ఇంతలో అప్పు, కళ్యాణ్‌ వస్తారు. ఆఫీసుకు వెళ్తున్నామని చెప్తారు. వారిద్దరిపై స్వప్న సెటైర్లు వేస్తుంది. అందరూ నవ్వుకుంటారు. అప్పు, కళ్యాణ్‌ వెళ్లిపోతారు. ఇంతలో కావ్య ఆఫీసుకు వెళ్తూ సీతారామయ్య, ఇంద్రాదేవి వేసుకునే టాబ్లెట్స్‌ గురించి చెప్తుంది.

రుద్రాణి: ఈసారి ఏ రెస్టారెంట్‌కు వెళ్తున్నారో అమ్మగారు

 కావ్య:  నేరుగా ఆఫీసుకే వెళ్తున్నాను రుద్రాణి గారు. కష్టపడి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నాతో కారులోనే రావొచ్చు. పైగా వీడియోలు తీసుకునే అవసరమే రాదు

స్వప్న: అత్తయ్యా మా కావ్య నీకు మంచి ఆఫర్‌ ఇచ్చింది. త్వరపడు

రుద్రాణి: ఏయ్‌ స్వప్న ఏం మాట్లాడుతున్నావు

స్వప్న: నేను మతి ఉండే మాట్లాడుతున్నాను. నీకే ఈ మధ్యన మతి తప్పినట్టు ఉంది. ఉడికిన కూరలను చూసి పచ్చివి అంటున్నావు జాగ్రత్త అత్తా

అంటూ స్వప్న వెళ్లిపోతుంది.  కావ్యను ఎలాగైనా కలవాలని తన నోటి నుంచి నిజం చెప్పించాలని రాజ్‌ అనుకుని బయటకు వెళ్లబోతుంటే.. యామిని చూస్తుంది.

యామిని:  వచ్చేశావా బావ నేను నీకోసమే చూస్తున్నాను

 యామిని ఫాథర్‌: యామిని నీతో కలిసి టిఫిన్‌ చేయాలని నీకోసమే వెయిట్‌ చేస్తుంది. వచ్చేయండి టిఫిన్‌ చేద్దాం.

 రాజ్‌:  నాకు ఇప్పుడు ఆకలిగా లేదండి.. నువ్వు టిఫిన్‌ చేయ్‌ యామిని

యామిని: ఇంతసేపు నీ కోసమే వెయిట్‌ చేశాను కదా బావ. నాకోసం కాఫీ తాగుతూ కంపెనీ అయినా ఇవ్వు బావ

రాజ్‌:  లేదు యామిని నాకు అర్జెంట్‌ వర్క్‌ ఉంది నేను వెళ్లాలి

 వైదేమి:  అయితే యామినిని కూడా తీసుకెళ్లండి బాబు

యామిని:  మమ్మీ ఎందుకు బావను ఇబ్బంది పెడతావు. బావ ఏ పని మీద వెళ్తున్నాడో ఏంటో..?  ప్రతి ఒక్కరికి పర్సనల్స్‌ ఉంటాయి కదా..?  అలాంటి పనుల మీద వెళ్తున్నప్పుడు మనం డిస్టర్బ్‌ చేయకూడదు మమ్మీ. బావ నువ్వు మమ్మీ మాటలేం పట్టించుకోకు నువ్వు ఎక్కడికైనా వెళ్లు.. కానీ నువ్వు వెళ్లిన చోట నీకు ఏ ప్రాబ్లమ్‌ వచ్చినా ఇక్కడ ఈ చిన్ని గుండె తట్టుకోలేదు

రాజ్‌:  ఓకే యామిని బై..

వైదేహి: ఇంతసేపు రాజ్‌తో మాట్లాడింది మన యామియేనా..?

యామిని:  ఏం డౌటా ఎందుకు..?

 వైదేహి:  ఆశ్చర్యంగా ఉంది యామిని మీ నాన్న కూడా నువ్వు ఇచ్చిన షాక్‌తో అలా చూస్తుండిపోయాడు

యామిని: మగాళ్లను మన దారిలోకి తెచ్చుకోవాలి అంటే మనమే వాళ్ల దారిలోకి వెళ్లి ప్రేమగా లాలించాలి, బుజ్జగించాలి అని నువ్వే చెప్పావు కదా మామ్‌. నువ్వు అలా చెప్పిన తర్వాత నేను తన దగ్గరకు వెళ్లి ప్రేమగా కారు కీస్‌ కూడా ఇచ్చాను.

వైదేహి: నువ్వు నా మాట విన్నందుకు  నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ రాజ్‌ ఒంటరిగా బయటకు వెళితే వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌ ఎవరైనా చూస్తే..

 యామిని: మమ్మీ నాకు రాజ్‌ అంటే పిచ్చి ఉంది. కానీ బై బర్త్‌ నేను పిచ్చిదాన్ని కాదు. రాజ్‌ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలంటే.. తనతో ఉండాల్సిన అవసరం లేదు.

యామిని ఫాథర్‌: అంటే తన గురించి తెలుసుకోవడానికి తనకు తెలియకుండా ఫాలో అవుతావా

యామిని: లేదు డాడీ కారులో జీపీఎస్‌ పెట్టాను. నా ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకున్నాను. సో తను ఎక్కడికి వెళ్తున్నాడు. ఎంత సేపు స్పెండ్‌ చేస్తున్నాడు. మొత్తం నాకు తెలిసిపోతుంది. కాబట్టి నాకు ఏ టెన్షన్‌ లేదు. నాకు నష్టం జరగనంత వరకు రాజ్‌ కు నా వల్ల ఏ కష్టం రాదు.

అని యామిని చెప్తుంటే.. వైదేహి వాళ్లు అమాయకంగా వింటుంటారు. మరోవైపు ఆఫీసుకు వెళ్లిన కావ్యను ఉద్యోగులు పరామర్శిస్తారు. ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తారు. దీంతో కావ్య ఎంప్లాయీస్‌ అందరికీ పని చేసుకోమని చెప్తుంది. తను వెళ్లి పని చేసుకుంటుంది. ఇంతలో రాజ్‌ కారులో వచ్చి కావ్య ఆఫీసులోకి ఎంటర్‌ అవ్వబోతుంటాడు. కావ్య సీసీ కెమెరాలో చూసి బయటకు వెళ్లి పక్కకు తీసుకెళ్తుంది. తన ఫోన్‌లో అంతా ట్రాక్‌ చేసి చూస్తున్న యామిని కూడా కంగారుగా రాజ్‌ దగ్గరకు బయలుదేరుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lakshimi Raave Maa Intiki Serial Today May4th: సింధూను ఇంటికి తీసుకొచ్చేసిన ప్రియంవద....కడుపుతో ఉన్నానని ఇంట్లోవాళ్లకు అబద్ధం చెప్పిన సింధూజాక్షి
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: సింధూను ఇంటికి తీసుకొచ్చేసిన ప్రియంవద....కడుపుతో ఉన్నానని ఇంట్లోవాళ్లకు అబద్ధం చెప్పిన సింధూజాక్షి
Jagadhatri Serial Today May 4th: కేదార్‌ తాతయ్యను యువరాజు ఎందుకు చంపాలనుకున్నాడు.? కౌషికి ఇంట్లో అవినాష్‌ ఏం చేశాడు..?
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌ తాతయ్యను యువరాజు ఎందుకు చంపాలనుకున్నాడు.? కౌషికి ఇంట్లో అవినాష్‌ ఏం చేశాడు..?
kalavari kodalu kanaka mahalakshmi serial today may 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ, విహారిలను కిడ్నాప్ చేసింది ఎవరు? మనసులో మాటలు లక్ష్మీకి చెప్పిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ, విహారిలను కిడ్నాప్ చేసింది ఎవరు? మనసులో మాటలు లక్ష్మీకి చెప్పిన విహారి!
Nindu Manasulu Serial Today may 4th: నిండు మనసులు: వ్రతంలో రాజశేఖరం పనికి అంతా షాక్! సిద్ధూ, ప్రేరణ అరెస్ట్ అవుతారా! కారణం అదేనా!
నిండు మనసులు: వ్రతంలో రాజశేఖరం పనికి అంతా షాక్! సిద్ధూ, ప్రేరణ అరెస్ట్ అవుతారా! కారణం అదేనా!

వీడియోలు

Mobile danger while driving | పంజాబ్ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Victory: విజయ్ గెలుపులో తెలుగు మార్క్..! ఏపీ, తెలంగాణ మ్యానిఫెస్టోలతో TVK విజయం
విజయ్ గెలుపులో తెలుగు మార్క్..! ఏపీ, తెలంగాణ మ్యానిఫెస్టోలతో TVK విజయం
Medchal Fire Accident: నిజాంపేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరు ఫర్నిచర్ షాపులు దగ్ధం! వరుస ఘటనలతో టెన్షన్!
నిజాంపేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరు ఫర్నిచర్ షాపులు దగ్ధం!
Election Results 2026: మాస్‌తో పెట్టుకుంటే అసెంబ్లీ గేటు కూడా తాకలేరు! శానాకాలం యాదికుండే ఓటమి ఇచ్చిన ప్రజలు!
మాస్‌తో పెట్టుకుంటే అసెంబ్లీ గేటు కూడా తాకలేరు! శానాకాలం యాదికుండే ఓటమి ఇచ్చిన ప్రజలు!
Jr NTR And TVK Vijay :విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
PM Modi Victory Speech: బెంగాల్ తొలి కేబినెట్ భేటీలో మొదటి సంతకాలు వాటిపైనే! కీలక ప్రకటన చేసిన ప్రధాని మోదీ!
బెంగాల్ తొలి కేబినెట్ భేటీలో మొదటి సంతకాలు వాటిపైనే! కీలక ప్రకటన చేసిన ప్రధాని మోదీ!
Mamata Banerjee: మమత బెనర్జీకి బిగ్‌షాక్‌! కంచుకోటలో మరోసారి ఓటమి! కేంద్ర బలగాలపై టీఎంసీ చీఫ్ సంచలన ఆరోపణలు!
మమత బెనర్జీకి బిగ్‌షాక్‌! కంచుకోటలో మరోసారి ఓటమి! కేంద్ర బలగాలపై టీఎంసీ చీఫ్ సంచలన ఆరోపణలు!
TRS Kavitha Comments On Vijay TVK: టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవితలో ఉత్సాహం నింపిన తమిళనాడు ఎన్నికల ఫలితాలు! విజయ్‌ పార్టీపై ఆసక్తికర కామెంట్స్!
టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవితలో ఉత్సాహం నింపిన తమిళనాడు ఎన్నికల ఫలితాలు! విజయ్‌ పార్టీపై ఆసక్తికర కామెంట్స్!
Vijay Networth: టీవీకే అధినేత విజయ్ ఆస్తుల విలువెంత? సూపర్ స్టార్లలో ఒకరిగా దళపతి స్టార్‌డమ్
టీవీకే అధినేత విజయ్ ఆస్తుల విలువెంత? సూపర్ స్టార్లలో ఒకరిగా దళపతి స్టార్‌డమ్
Embed widget