అన్వేషించండి

Brahmamudi August 31st: 'బ్రహ్మముడి' సీరియల్: మొండి అత్త, కంచు కోడలు మధ్య సవాల్ - వ్రతం చేసుకో ఫలితం ఇస్తానన్న రాజ్

కావ్యకి వరలక్ష్మీ వ్రతం చేసే బాధ్యతలు అప్పగించడంలో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

దుగ్గిరాల ఇంట్లో జరిగే వరలక్ష్మీ వ్రతం బాధ్యతలు ఈసారి అపర్ణ కోడలు కావ్యకి అప్పగిస్తున్నట్టు ఇంద్రాదేవి అందరికీ చెప్తుంది. ఆ మాటకి అపర్ణ కోపంతో రగిలిపోతుంది. ఇక రాజ్ కూడా వ్రతం నుంచి తప్పించుకోవాలని చూస్తాడు. అటు స్వప్న తన ప్రెగ్నెన్సీ విషయం బయట పడకుండా లక్కీగా తప్పించుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ ప్రోమో ప్రకారం మళ్ళీ అత్తాకోడళ్ల మధ్య అగ్గి రగులుకుంది.

ప్రోమోలో ఏముందంటే..

కావ్య కిచెన్ లో ఉండగా అపర్ణ వెళ్తుంది. తనని ఎదిరించి తన కొడుకు వ్రతంలో కూర్చోడు అన్నట్టు ధీమాగా మాట్లాడుతుంది.

అపర్ణ: ఈ ఇల్లు నీకు ఆశ్రయం ఇచ్చింది. ఇంటి పెద్దలు నిన్నొక మనిషిలా గుర్తిస్తున్నారు. నువ్వు ఈ ఇంట్లో తిరుగుతుంటే చూసి సహించలేను. అంటే కావ్య వ్రతానికి సంబంధించి ఏదో సవాలు విసిరినట్టుగా ఉంది. వాడు నా కొడుకు నువ్వు నాతో తిరగబడి మాట్లాడినందుకు ఇంటి ముందు నిలబెట్టి తలుపులు మూశాడు. ఇక నాతో సవాలు చేస్తే ఊరుకుంటాడా?

Also Read: లాస్యకి అదిరే ఝలక్ ఇచ్చిన లక్కీ- నందు ఆవేదన, తులసి ఆక్రోశం

కావ్య: మీ అబ్బాయ్ మీ మనసు మార్చొచ్చు ఏమో

అప్పుడే కావ్య గదిలోకి వెళ్తుంటే రాజ్ ఎదురుపడతాడు. వ్రతం నువ్వు చెయ్యి ఫలితం నేను ఇస్తానని మాట ఇస్తాడు. ఏం చేస్తారని కావ్య అడుగుతుంది. కానీ రాజ్ మాత్రం వెయిట్ అండ్ సీ అనేసి వెళ్ళిపోతాడు.

నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కావ్యకి అత్త వేసిన శిక్ష గురించి అందరికీ ఇంద్రాదేవి చెప్పేస్తుంది. ఇక స్త్రీ సంఘం వాళ్ళు రాజ్, కావ్యకి సన్మానం చేస్తారు. కళావతి సంతోషంగా మొగుడు చేతిని పట్టుకుని మరీ ఫోటో దిగి ఆనందపడుతుంది. కావ్య చేసిన మంచి పని ఇంట్లో కొంతమందికి నచ్చలేదు కానీ అదే ఈ కుటుంబానికి పేరు తీసుకొచ్చిందని శుభాష్ అపర్ణకి తగిలేలా సెటైర్ వేస్తాడు. అటు హాస్పిటల్ లో స్వప్న తన దొంగ కడుపు ఎక్కడ తెలిసిపోతుందోనని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వెళ్లిపోదాం హాస్పిటల్ వాతావరణం పడటం లేదని నచ్చజెప్పి రుద్రాణి వాళ్ళని తీసుకెళ్లబోతుంటే డాక్టర్ పిలుస్తున్నారని చెప్తారు. ఇంత సేపు వెయిట్ చేశాం కదా చెక్ చేయించుకుని వెళ్లిపోదామని రుద్రాణి స్వప్నని డాక్టర్ దగ్గరకి తీసుకుని వెళ్తుంది.

Also Read: కృష్ణకి సర్‌ప్రైజ్, ముకుందకి షాక్ - రేవతినా మజాకా!

ఆ డాక్టర్ ఎవరో కాదు గతంలో స్వప్న కళ్ళు తిరిగి పడిపోతే ఇంటికి వచ్చి చెక్ చేసిన ఆమె. దీంతో తనని చూడగానే స్వప్నకి ప్రాణం లేచొచ్చినట్టు అవుతుంది. అదే విషయాన్ని డాక్టర్ కి గుర్తు చేసి కడుపులో బిడ్డకి ఏం కాలేదని చెప్పిస్తుంది. అలా మరోసారి ఎస్కేప్ అవుతుంది. అనామిక కళ్యాణ్ కి ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చేయడు. మళ్ళీ మళ్ళీ చేయడంతో లిఫ్ట్ చేసి డల్ గా మాట్లాడతాడు. కాసేపు ఊరించి ఊరించి పెళ్లి కాలేదని అనామిక చెప్పేసరికి కళ్యాణ్ సంతోషపడిపోతాడు. రెస్టారెంట్ దగ్గర కళ్యాణ్ ని డ్రాప్ చేసిందని తనేనని అనామిక చెప్పేసరికి షాక్ అవుతాడు. తర్వాత తను పంపించిన గిఫ్ట్ ఎలా ఉందని అడుగుతుంది. దాని కోసం ఇల్లంతా వెతుకుతాడు. చివరికి అది దొరికితే కావ్య ఓపెన్ చేసి చూస్తుంది. కళ్యాణ్ కవితలు రాసి బాగా రాలేదని చింపేసిన పేపర్స్ అన్నీ ఒక బుక్ గా తయారు చేయించి అనామిక గిఫ్ట్ గా ఇస్తుంది. అది చూసి ఇంట్లో అందరూ సంతోషపడతారు. దుగ్గిరాల ఇంట్లో కవి పుట్టాడని మెచ్చుకుంటారు. ఇక గిఫ్ట్ బాక్స్ మీద పజిల్ రాసి దాని ప్రకారం కలవమని అనామిక హింట్ ఇస్తుంది. అది చదివి ఎక్కడికి వెళ్లాలో కావ్య చెప్తుంది.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today November 25th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుకి నిప్పు పెట్టిన ప్రేరణ! లాకెట్ చూసి మురిసిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుకి నిప్పు పెట్టిన ప్రేరణ! లాకెట్ చూసి మురిసిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 25:రాధకు గతం గుర్తు తెప్పించేందుకు విక్కీ రకరకాల ప్రయత్నాలు...రామచంద్రానికి కూడా నిజం చెప్పన విక్కీ
నువ్వులేక నేను లేను: రాధకు గతం గుర్తు తెప్పించేందుకు విక్కీ రకరకాల ప్రయత్నాలు...రామచంద్రానికి కూడా నిజం చెప్పన విక్కీ
Godavari Serial Today November 25th: 'గోదావరి' సీరియల్: కరెంట్ కట్.. హగ్‌తో ఒక్కటైపోయిన జాను, సంజయ్! శ్రీవారు, నాథా అంటూ సంజయ్‌ చుట్టూ జాను!
'గోదావరి' సీరియల్: కరెంట్ కట్.. హగ్‌తో ఒక్కటైపోయిన జాను, సంజయ్! శ్రీవారు, నాథా అంటూ సంజయ్‌ చుట్టూ జాను!
Gundeninda Gudigantalu Nov 25: సుమతి విషయంలో పట్టువదలని బాలు..కూర్చుని మాట్లాడుకోమని సలహా ఇచ్చిన సత్యం
గుండెనిండా గుడిగంటలు:సుమతి విషయంలో పట్టువదలని బాలు..కూర్చుని మాట్లాడుకోమని సలహా ఇచ్చిన సత్యం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం అన్న మోదీ! భారత్-నేపాల్ పుణ్యక్షేత్రాల పవిత్ర బంధం
నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం అన్న మోదీ! భారత్-నేపాల్ పుణ్యక్షేత్రాల పవిత్ర బంధం
Hyderabad Crime News: హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
Rajiv Gandhi Security: రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర.. ఉద్దేశపూర్వకంగానే సెక్యూరిటీ తొలగింపు.. వారి పేర్లు బయటపెడతా?- రాహుల్ గాంధీ
రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర.. ఉద్దేశపూర్వకంగానే సెక్యూరిటీ తొలగింపు.. వారి పేర్లు బయటపెడతా?- రాహుల్ గాంధీ
Atmakur Municipal Vice Chairperson: రెండోరోజూ హైడ్రామా.. ఆత్మకూరు వైస్ ఛైర్‌పర్సన్‌గా కొలగాని శిరీష ఎన్నిక
రెండోరోజూ హైడ్రామా.. ఆత్మకూరు వైస్ ఛైర్‌పర్సన్‌గా కొలగాని శిరీష ఎన్నిక
Seethakka: కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
Embed widget