Priyanka Jain: 'మా అమ్మ ప్రెగ్నెన్సీ' అంటూ బిగ్ బాస్ ఫేం ప్రియాంక జైన్ - తల్లి కోసం వెరైటీగా ప్లాన్...
Priyanka Jain Mother: బిగ్ బాస్ ఫేం, టీవీ ఆర్టిస్ట్ ప్రియాంక జైన్ తన తల్లి కోసం వెరైటీగా ఫోటో షూట్ ప్లాన్ చేశారు. 'మా అమ్మ ప్రెగ్నెన్సీ' అంటూ ఫోటో షూట్ చేయగా వైరల్ అవుతోంది.

Priyanka Jain Mother Pregnancy Photo Shoot Gone Viral: బిగ్ బ్యాస్ బ్యూటీ, సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ తన బర్త్ డే సెలబ్రేషన్స్, ఫోటోస్‌తో ఇటీవల విమర్శల పాలైన సంగతి తెలిసిందే. బర్త్ డే సందర్భంగా కేక్‌ను కాలి చెప్పుపై పెట్టి ఫోటోలకు ఫోజులిస్తూ నెట్టింట షేర్ చేయగా వైరల్‌గా మారాయి. ఫుడ్ అంటే వాల్యూ లేదా అంటూ నెటిజన్లు ఆమెను విమర్శిస్తూ కామెంట్స్ చేశారు.
తల్లితో ప్రెగ్నెన్సీ ఫోటో షూట్
అయితే, తన బర్త్ డే రోజునే ప్రియాంక మరో ఫోటో షూట్ కూడా చేశారు. తన తల్లితో ప్రెగ్నెన్సీ షూట్ అంటూ వెరైటీగా ప్లాన్ చేశారు. 'మా అమ్మ ప్రెగ్నెన్సీ' అంటూ సదరు వీడియో షేర్ చేయగా వైరల్ అవుతోంది. తన తల్లికి మేకప్ వేస్తూ ప్రెగ్నెంట్ లేడీలా రెడీ చేశారు. ప్రియాంక ప్రియుడు శివకుమార్ ఈ తతంగాన్ని రికార్డు చేశారు.
రీక్రియేట్ చేస్తున్నాం
తన తల్లి 27 ఏళ్ల కింద ప్రెగ్నెంట్ అయినప్పుడు తన కడుపులో తానున్నానని ఆ ప్రెగ్నెన్సీ ఇప్పుడు రీ క్రియేట్ చేస్తున్నట్లు ప్రియాంక తెలిపారు. 'నేను పుట్టే ముందు మా అమ్మ ఎలా ఫీలైంది? అని కళ్లారా చూడాలనుకున్నా. అలాగే తనకు సీమంతం కూడా జరగలేదు. అందుకే ఇలా వెరైటీగా ఫోటో షూట్ ప్లాన్ చేశాను.' అంటూ చెప్పారు. తన కుమార్తె తనపై చూపిస్తోన్న ప్రేమకు ప్రియాంక తల్లి ఎమోషనల్ అయ్యారు.
Also Read: మెగాస్టార్ మూవీలో గెస్ట్ రోల్ - వెంకీ మామ నెక్స్ట్ మూవీస్ ఏంటో తెలుసా?
నా బేబీ కోసం...
ఈ వీడియో షూట్ జరుగుతుండగా ప్రియాంక ప్రియుడు శివకుమార్... నీకు తమ్ముడు కావాలా? చెల్లి కావాలా? అని అడిగాడు. అందుకు ఆమె రియాక్ట్ అవుతూ... 'నేనింకా నాకెప్పుడు బేబీ పుడుతుందా?' అని ఆలోచిస్తున్నా అంటూ ఫన్నీగా ఆన్సర్ చెప్పింది. ఈ మాటలకు షాకైన శివకుమార్... పెళ్లి చేసుకున్నాక వీటి గురించి మాట్లాడాలంటూ చెప్పాడు. దీనికి స్పందించిన ప్రియాంక... 'పెళ్లి చేసుకున్నాకే కదా పిల్లల్ని కనేది. ఆ పెళ్లే ఎప్పుడు అవుతుందా అని ఆలోచిస్తున్నా. ఒకమ్మాయిగా నీకేం తెలుసు నా బాధ.' అంటూ కామెంట్ చేయడంతో శివకుమార్ షాక్ అయ్యాడు.
సోషల్ మీడియాలో విమర్శలు
అయితే... ప్రియాంక జైన్ బర్త్ డే ఫోటో షూట్స్‌పై సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు విమర్శించారు. చెప్పుపై కేక్ పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సంస్కారం లేదా? తినే ఆహారాన్ని చెప్పుపై పెట్టడం ఏంటి? అన్నం కూడా ఇలాగే చెప్పులతో తింటావా? తిండితో ఆటలొద్దు.' అంటూ కామెంట్స్ చేశారు.
టీవీ సీరియల్స్‌తో పాపులర్
మౌనరాగం, జానకి కలగనలేదు సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు ప్రియాంక. అలాగే... బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. మౌనరాగం సీరియల్ టైంలోనే 2018 నుంచి హీరో శివకుమార్‌తో ప్రేమాయణం సాగించారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. శివకుమార్ ప్రియాంకను ముద్దుగా పరి అని పిలుచుకుంటుంటారు.





















