అన్వేషించండి

నువ్వు నా నడుము చూశావ్, సిరికి చెప్పేస్తా - శ్రీహాన్‌కు అనుపమా వార్నింగ్

ఇటీవల ఓ టీవీ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొంది అనుపమ పరమేశ్వరన్. ఈ సందర్భంగా బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ అనుపమతో ‘ఖుషి’ నడుము సీన్ చేశాడు. అయితే సీన్ మధ్యలో అనుపమ శ్రీహాన్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.

తెలుగులో బిగ్ బాస్ లో పాల్గొన్న కంటస్టెంట్ లకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో పెద్దగా చెప్పక్కర్లేదు. అందులోనూ ప్రేక్షకాదరణ పొందిన వారైతే వారికి బయట ఇంకా క్రేజ్ ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ శ్రీహాన్ కు పబ్లిక్ లోనే కాదు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కెరీర్ ప్రారంభంలో షార్ట్ ఫిల్మ్ లలో నటించిన శ్రీహాన్.. ఇప్పుడు బుల్లితెరపై కూడా కనిపిస్తున్నాడు. ‘బిగ్ బాస్’తో అతనికి మరింత పాపులారిటీ వచ్చింది. అంతేకాకుండా కో యాక్టర్ సిరి హనుమంతుతో కలసి చాలా షార్ట్ ఫిల్మ్ లలో నటించాడు. అవన్నీ మంచి వ్యూస్ సంపాదించుకున్నాయి. వీరి జంటకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇటీవల శ్రీహాన్ కు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ వార్నింగ్ ఇచ్చింది. అదేంటీ, అనుపమ శ్రీహాన్ కు వార్నింగ్ ఇవ్వడం ఏంటీ అనుకుంటున్నారా? కంగార పడొద్దు.. అనుపమా ఇచ్చింది స్వీట్ వార్నింగే. 

శ్రీముఖి యాంకర్ గా ఓ ప్రముఖ చానెల్ లో ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ అనే ప్రోగ్రామ్‌ను టెలికాస్ట్ అవుతోంది. ఈ షోలో ప్రతీ వారం బుల్లి తెర నుంచి నటీనటులు వచ్చి సందడి చేస్తూ ఉంటారు. తాజా ఎపిసోడ్‌లో నటి అనుపమ పరమేశ్వరన్ ముఖ్య అతిథిగా పాల్గొంది. దీంతో ఆ షో లో సందడి వాతావరణం నెలకొంది. బ్లాక్ కలర్ డ్రెస్ లో వచ్చిన అనుపమా మొత్తం షోలో మెరిసిపోయింది. ఈ క్రమంలో బిగ్ బాస్ స్టార్ శ్రీహాన్ అనుపమ పరమేశ్వరన్ కలసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమిక కలసి నటించిన ‘ఖుషి’ సినిమాలో నడుము సీన్ ను స్కిట్ లాగా చేశారు. 

ఇందులో భూమిక పాత్రలో అనుపమ కనిపించగా.. పవన్ పాత్రలో శ్రీహాన్ చేశాడు. ‘సిద్దు నువ్ నా నడుము చూశావ్’ అని అనుపమా డైలాగ్ చెప్పగానే.. శ్రీహాన్ ‘‘లేదు నేను చూడలేదు. అయినా బెత్తుడంత నడుము లేదు, అది నేను చూశానంటా’’ అని పవన్ కళ్యాణ్ స్టైల్‌లో డైలాగ్ చెప్తుండగానే అనుపమ.. ‘‘ఇది నేను సిరికు చెప్తా’’ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో శ్రీహాన్ స్టన్ అయిపోయి డైలాగ్ చెప్పడం ఆపేశాడు. ఇక ఈ సీన్ తో సెట్ లో నవ్వులు విరిశాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

శ్రీ హాన్ ‘బిగ్ బాస్’తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. హౌస్ లో తనదైన స్టైల్ లో మొదటి నుంచీ చివరి వరకూ బాగా ఆడి ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. అంతే కాదు ఈ సారి బిగ్ బాస్ విన్నర్ సింగర్ రేవంత్ నే అయినా అతనికంటే ఎక్కువ మొత్తంలో క్యాష్ ను గెలుచుకున్నాడు శ్రీహాన్. ‘బిగ్ బాస్’ క్రేజ్ తో ఇప్పుడు అతనికి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. 

Read Also:  ‘పఠాన్’కు పాట్లు - బాయ్‌కాట్‌పై బాలీవుడ్ కలవరం, కేంద్రాన్ని ఆశ్రయించిన సినీ పెద్దలు

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 27th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి దగ్గర లక్ష్మీ కోసం మాట తీసుకున్న యమున! పద్మాక్షి మీద అంబిక పగ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి దగ్గర లక్ష్మీ కోసం మాట తీసుకున్న యమున! పద్మాక్షి మీద అంబిక పగ!
Godavari Serial Today November 27th: 'గోదావరి' సీరియల్: కన్నతల్లి గతం వెనుక చేదు నిజం! తల్లిని అసహ్యించుకుంటున్న సంజు మనసు మార్చేదెవరు?
'గోదావరి' సీరియల్: కన్నతల్లి గతం వెనుక చేదు నిజం! తల్లిని అసహ్యించుకుంటున్న సంజు మనసు మార్చేదెవరు?
Nindu Manasulu Serial Today November 27th: నిండు మనసులు: గణని కొట్టి ప్రేరణని కిడ్నాప్ చేసిన ఎమ్మెల్యే కొడుకు! సిద్ధూకి బెదిరింపు కాల్!
నిండు మనసులు: గణని కొట్టి ప్రేరణని కిడ్నాప్ చేసిన ఎమ్మెల్యే కొడుకు! సిద్ధూకి బెదిరింపు కాల్!
Brahmamudi Serial Today November 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  దొంగతనానికి వెళ్లిన భ్రమరాంబ – దుగ్గిరాల ఇంటికి రఘువీర్
‘బ్రహ్మముడి’ సీరియల్:  దొంగతనానికి వెళ్లిన భ్రమరాంబ – దుగ్గిరాల ఇంటికి రఘువీర్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Elections: రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
Komatireddy Financial Help: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
Comedy Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
AP Cabinet Decisions: 36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
రూ.36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
Jagapathi Babu : వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
Sunil Gavaskar Angry:  రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
Embed widget