అన్వేషించండి

Ammayi garu Serial Today May 23rd: అమ్మాయి గారు సీరియల్: రూప కూడా రాఘవ కూతురే..! విరూపాక్షి సూర్యని నిజంగా చీట్ చేసిందా?

Ammayi garu Today Episode రూప కూడా సూర్య కూతురు కాదని దీపక్ అనడంతో రుక్మిణికి డీఎన్ఏ టెస్ట్ చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రుక్మిణి రాఘవ, విరూపాక్షిల కూతురని విజయాంబిక సూర్యప్రతాప్‌కి చెప్తుంది. దాంతో విరూపాక్షి ఆవేశంగా విజయాంబిక దగ్గరకు వెళ్లి లాగిపెట్టి ఒక్కటి కొట్టి నా గురించి నా రక్తం గురించి తప్పుగా మాట్లాడితే నిలువునా నిల్చున్న చోటే నరికేస్తా అని వార్నింగ్ ఇస్తుంది. సూర్యప్రతాప్‌  కోపంగా విరూపాక్షి మా అక్క అడిగిన దాంట్లో తప్పేముంది నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని అంటాడు. 

రుక్మిణి: నాయనా..
సూర్యప్రతాప్‌: నువ్వు నన్ను అలా పిలవకు. నా ఇద్దరు బిడ్డలు చనిపోయారు. 
మందారం: పెద్దయ్యా మీకు చెప్పే అంత దాన్ని కాదు కానీ ఒక తల్లిగా చెప్తున్నా ఈ లోకంలో ఏ తల్లి కూడా తన బిడ్డ గురించి అబద్ధం చెప్పదు. ఎందుకంటే ఒక మామూలు మనిషిని తల్లిని చేసేది ఆ బిడ్డే. బిడ్డ గురించి ఏ తల్లి అబద్ధం చెప్పదు.
విజయాంబిక: ఎందుకు చెప్పరు మందారం ప్రస్తుతం సమాజంలో ప్రియుడి కోసం బిడ్డలను చంపేస్తున్నారు. 
మందారం: అది ఎవరో కిలాడీలు అలా చేస్తారు. అమ్మగారికి ఆ అవసరం ఏంటి.
దీపక్: నిజమే మమ్మీ మన అనుమానం కరెక్టే కాదు. అసలు ఈ అనుమానం ఎప్పుడు స్టార్ట్ అయింది. ఈ రుక్మిణి రాఘవ, అత్తయ్యల కూతురు అయినప్పుడు ఇలాగే ఉన్న రూప కూడా రాఘవ కూతురే అయిండొచ్చు కదా మమ్మీ. అందరూ బిత్తర పోతారు.

విరూపాక్షి చాలా ఏడుస్తుంది. సూర్యప్రతాప్‌ కంగారు పడతారు. రూప కూడా ఎప్పుడూ తల్లికే సపోర్ట్‌గా ఉండేది అని పెళ్లి నుంచి అన్నీ అత్తయ్య సమక్షంలోనే జరిగాయని సూర్యప్రతాప్‌కి అనుమానం వచ్చేలా దీపక్ చెప్తాడు. ఇక్కడేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదని రుక్మిణి అంటే నాకు అర్థమైంది అని సూర్యప్రతాప్‌ అంటాడు. విజయాంబిక తమ్ముడితో ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో నీకు మాత్రమే తెలుసు అంటుంది. 

సూర్యప్రతాప్‌ ఆవేశంగా విరూపాక్షి, రుక్మిణిలను గెంటేయడానికి ప్రయత్నిస్తాడు. రాజు అడ్డుకుంటాడు. ఎవరో రాసిన లెటర్‌తో ఇలా చేయడం కరెక్ట్ కాదని అంటాడు. దానికి రాజు కావాలి అంటే డీఎన్‌ఏ టెస్ట్ చేయిద్దామని అంటాడు. విజయాంబిక, దీపక్‌లు కంగారు పడతారు. సూర్యప్రతాప్‌ డీఎన్‌ఏ టెస్ట్‌కి ఏర్పాటు చేయమని చెప్తారు. విరూపాక్షి బాధ పడుతుంటే రుక్మిణి, రాజులు ఓదార్చుతారు. డీఎన్‌ఏ టెస్ట్‌ వల్ల కనీసం రుక్మిణి అయినా తన కూతురే అని సూర్యప్రతాప్‌కి తెలుస్తుందని అంటారు. విరూపాక్షి తాను లెటర్ ఎవరు రాశారా అని ఆలోచిస్తున్నా అని అంటుంది.

విజయాంబిక వాళ్లు కూడా సూర్యప్రతాప్‌ని బాగా నమ్మించామని అనుకుంటారు. దీపక్ వాళ్లే చేసుంటారని రాజు, రూపలు అంటారు. నా బిడ్డని నా తండ్రిని చంపేసింది ఇవి సరిపోవు అన్నట్లు ఇంకా ఇన్ని చేస్తుంది. విజయాంబిక మాత్రం వదలకూడదు అంటుంది. ఉదయం సూర్యప్రతాప్‌ డాక్టర్‌ని రప్పించి డీఎన్‌ఏ టెస్ట్ కోసం శాంపిల్స్ తీసుకోమని చెప్తారు. డాక్టర్ సూర్యప్రతాప్‌, రుక్మిణిలు శాంపిల్స్ ఇస్తారు. సూర్యప్రతాప్‌ విరూపాక్షితో నీ నాటకాలు నా దగ్గర కాదు నా బిడ్డ ఉన్నన్నాళ్లు దాన్ని నీ వైపు తిప్పుకొని సాధించుకోవాలి అనుకున్నావ్ ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకొచ్చి నాటకాలు ఆడుతున్నాయ్ అవి ఇక సాగవు అంటాడు. నువ్వు పొరపాటు పడుతున్నావ్ సూర్య అని విరూపాక్షి చెప్తుంది. డీఎన్‌ఏ రిపోర్ట్స్‌లో నిజం తెలుస్తుంది. నీ వల్ల నా బంగారు తల్లి పుట్టుకను కూడా అనుమానించేలా చేశావ్ చీ అని సూర్యప్రతాప్‌ వెళ్లిపోతాడు. 

సూర్యప్రతాప్‌ మాటలకు విరూపాక్షి చాలా ఏడుస్తుంది. రుక్మిణి మీ మామయ్య కూతురు కాదు అని తేలేలా చేయాలి అని తల్లీ కొడుకులు అనుకుంటారు. తల్లీకొడుకుల మాటలు మందారం, రూప, రాజులు వింటారు. వాళ్లు హాస్పిటల్‌కి వెళ్లకుండా ఆపాలి అని అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: జల జల జలపాతం నువ్వు.. దేవా, మిథునలతో జలకాలాటాడించిన బామ్మ!

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 23rd: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
నువ్వులేక నేను లేను: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
Illu Illalu Pillalu Serial Today August 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
Podarillu Serial Today August 23rd: కేశవ్‌ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మాధవ్‌....శైలూకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు
పొదరిల్లు: కేశవ్‌ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మాధవ్‌....శైలూకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు
Karthika Deepam 2 Serial Today August 23rd: కార్తీకదీపం 2 సీరియల్: సంతకాలు పెట్టించి చెమటలు పట్టేసిన సూరజ్! ఏదో పెద్ద మోసమే! అమ్మని చూసి జ్యోత్స్న ఎమోషనల్!
కార్తీకదీపం 2 సీరియల్: సంతకాలు పెట్టించి చెమటలు పట్టేసిన సూరజ్! ఏదో పెద్ద మోసమే! అమ్మని చూసి జ్యోత్స్న ఎమోషనల్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Embed widget