Ammayi garu Serial Today June 3rd: అమ్మాయి గారు సీరియల్: రాజుకి రెండో పెళ్లి చేయాలనుకున్న సూర్య.. రుక్మిణి లవర్‌ని ఇంటికి తీసుకొచ్చిన తల్లీకొడుకులు!
Ammayi garu Today Episode రుక్మిణిని రాజుకి ఇచ్చి పెళ్లి చేయాలి అని సూర్య అనుకోవడం విజయాంబిక రుక్మిణి ఆనంద్ అనే వ్యక్తిని ప్రేమిస్తుందని చెప్పాలని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విజయాంబిక, దీపక్‌లు ఆనంద్‌ని కలుస్తారు. ఆనంద్ వాళ్లు లవ్ స్టోరీ అడగటంతో కొత్తగా వచ్చి సూపర్ హిట్ అయిన కోర్టు సినిమా కథ చెప్పేస్తాడు. నా రుక్కు కోసం చాలా చేశానని రుక్కు కోసం మారిపోయానని రుక్కు అనాథగా ఉందని కానీ సడెన్‌గా సీఎం కూతురు అని చెప్పి నన్ను వదిలేసి వెళ్లిపోయిందని చెప్తుంది. రుక్కు అంటే నాకు ప్రాణం కానీ రుక్కు తండ్రి సీఎం అంటే నాకు భయంగా ఉందని ఆనంద్ అంటాడు.
విజయాంబిక ఆనంద్‌తో నీకు రుక్కుకి మేం పెళ్లి చేస్తాం కానీ నువ్వు నీ రుక్కుని పెళ్లి చేసుకున్న తర్వాత రుక్మిణిని వచ్చిన ఆస్తిలో మాకు సగం ఆస్తి ఇవ్వమని అంటాడు. ఆనంద్ మనసులో మీ వంకర బుద్ధి రాజున్న చెప్పాడురా సగం కాదు మీ అస్తికలు మీకు దొరక్కుండా చేస్తాం అనుకుంటాడు. పైకి వాళ్లతో మొత్తం ఆస్తి మీరే తీసుకోండి నాకు నా రుక్కు చాలు అంటాడు. పెళ్లి సంబంధం ఫిక్స్ చేద్దాం పద అని ఆనంద్‌ని తీసుకొని వెళ్తారు.
సూర్యప్రతాప్ రుక్మిణి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సూర్యప్రతాప్ అంతరాత్మ వస్తుంది. రూప, రాజులు ప్రేమించి పెళ్లి చేసుకున్నా నేను ఒప్పుకోలేదు. నా కూతుర్ని నేను సంతోషంగా బతకనివ్వలేదు అని బాధ పడతాడు. రూప విషయంలో చేసిన పొరపాట్లు రుక్మిణి విషయంలో సరి చేసుకుంటే సరిపోతుందని అంతరాత్మ అంటుంది. సూర్యప్రతాప్ దానికి రుక్మిణిని రాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాను అని అనుకుంటాడు. రుక్మిణి నీ మాట వింటుంది అని గ్యారెంటీ ఏంటి రుక్మిణి 25 ఏళ్లు దూరంగా పెరిగింది అక్కడ ఎవరితోనైనా ప్రేమలో పడిందేమో.. రాజు కూడా ఒప్పుకోడేమో అని అనుకుంటాడు. రాజుని ఒప్పించి రుక్మిణితో పెళ్లి చేస్తా అనుకుంటాడు. బంటీకి అమ్మగా రుక్మిణిని ఇస్తాను.. మా రూపగా రుక్మిణి ఉండేలా చేస్తాను అని అనుకుంటాడు.
రుక్మిణి జీవితంలో ఎవరైనా ప్రేమికుడు ఉంటే ఈ పాటికే వచ్చేవాడు కదా రుక్మిణి కూడా అలా కనిపించడం లేదు అంటే రుక్మిణి మనసులో ఎవరూ లేరని అనుకొని రుక్మిణి, రాజుల పెళ్లి గురించి అందరికీ చెప్పాలని సూర్యప్రతాప్ అనుకుంటారు. సూర్యప్రతాప్ రాజు, రూప, విరూపాక్షి, చంద్ర, సుమ అందర్ని పిలుస్తాడు. సుమ నన్ను సూర్య పేరు పెట్టి పిలిచాడు అని విరూపాక్షి హ్యాపీగా ఫీలవుతుంది. సూర్యప్రతాప్ రూప ఆత్మ శాంతించేలా ఓ నిర్ణయం తీసుకున్నానని చెప్తాడు. నా నిర్ణయం మీ అందరితో పంచుకోవాలి అనుకున్నా అని అంటాడు.
సూర్యప్రతాప్ అందరితో రాజుకు మళ్లీ పెళ్లీ చేయాలి అనుకుంటున్నా అని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. కొంపమునిగేలా ఉందని విరూపాక్షి అనుకుంటుంది. రాజుకి మరోపెళ్లి చేస్తే రూప అన్యాయం అయిపోతుందని అనుకుంటుంది. రూప మనసులో నాన్న తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకునేలా చేయాలి అని అనుకొని అక్కా బావల ప్రేమ కథలోకి ఇంకో అమ్మాయి వస్తే బాగోదు నాన్న అంటుంది. బంటీకి అమ్మ చాలా అవసరం అని సూర్యప్రతాప్ రాజుని ఒప్పంచే ప్రయత్నం చేస్తాడు. బంటీని చూసుకోవడానికి నేను ఉన్నాను కదా నాన్న అని రుక్మిణి అంటుంది. దానికి సూర్యప్రతాప్ నా నిర్ణయం కూడా అలాంటిదే అని అంటాడు.
రాజుతో నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నా అని సూర్యప్రతాప్ చెప్పబోతే ఇంతలో విజయాంబిక, దీపక్‌లు వస్తారు. మేం కూడా నీ కూతురి పెళ్లి గురించే మాట్లాడుతున్నాం అని రుక్మిణి ఒకడిని ప్రేమించిందని చెప్తారు. ఆనంద్‌ని సూర్యప్రతాప్ ముందు నిలబెడతారు. రుక్మిణి, రాజులు నవ్వుకుంటారు. ఆనంద్ అపరిచితుడిలో రాములా బుద్ధిమంతుడిలా ప్రవర్తిస్తాడు. తను నీకు తెలుసా అని సూర్యప్రతాప్ అడిగితే రుక్మిణి తెలుసని అప్పుడు ప్రేమించాను అని ఇప్పుడు కాదు అని చెప్తుంది. ఏంటి రుక్మిణి నీ ప్రేమ కథ మాకు చెప్పలేదు అని రాజు అడుగుతాడు. నాయనా నిన్ను అమ్మని కలిపే వరకు పెళ్లి వద్దని చెప్పాను కానీ వినలేదు అందుకే తను వద్దని తెగేసి చెప్పి వచ్చేశాను అని రుక్మిణి అంటుంది. సూర్యప్రతాప్ ఆనంద్‌తో నీకు రుక్మిణి అంటే ఇష్టమేనా అని అడుగుతాడు. దానికి ఆనంద్ రుక్మిణి అంటే నాకు ప్రాణం సారూ.. రుక్కుని ప్రేమగా చూసుకోవాలి అని కుట్టు మిషన్ పెట్టుకున్నాను.. నా రుక్క బట్టలు కూడా నేనే కుట్టానని అంటాడు. విజయాంబిక వాళ్లు పెళ్లి చేస్తామని చెప్పి తీసుకొచ్చారని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథునని ఎవరు ఏం అన్నా తట్టుకోలేనమ్మా.. ప్రేమ బయట పెట్టేసిన దేవా!






















