Ammayi garu Serial Today June 12th: అమ్మాయి గారు సీరియల్: ఓరి దేవుడో ఈ కీర్తిలో ఇన్ని షేడ్సా.. ఇదంతా తల్లీకొడుకులు జీవన్‌తో కలిసి ఆడిన నాటకమా..!
Ammayi garu Today Episode జీవన్, విజయాంబిక, దీపక్‌లు కలిసి కీర్తి స్థానంలో దీప్తిని తీసుకొచ్చి పెద్ద నాటకం ఆడించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విరూపాక్షి సూర్యప్రతాప్‌తో నిజాలు అన్నీ చెప్పేస్తుంది. సూర్యప్రతాప్ గన్ తీసుకొని వస్తాడు. రూప తానే అన్ని తప్పులు చేశానని తనని చంపేయమని కోరుతుంది. దాంతో సూర్యప్రతాప్ ఇన్ని మోసాలు చేసిన తర్వాత నేను బతకను అని సూర్యప్రతాప్ కాల్చుకుంటాడు. అందరూ షాక్ అయిపోతారు. నాన్న అని రూప గట్టిగా అరుస్తుంది. తీరా చూస్తే ఇదంతా రూప కల.
నిజం చెప్పడానికి వెళ్తున్న విరూపాక్షిని రూప ఆపుతుంది. నాన్నకి నువ్వు మోసం చేశావు అని తెలిసిన ఎప్పుడూ చేసేదే కదా అని వదిలేస్తారు. రాజు మోసం చేశాడు అన్నా ఒక దెబ్బ కొట్టి అయినా వదిలేస్తారు. కానీ నేను మోసం చేశాను అని తెలిస్తే తట్టుకోలేరమ్మా ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. వద్దమ్మా చెప్పొద్దు అని రూప తల్లిని ఆపేస్తుంది. రాఘవని తీసుకొచ్చి సమయం చూసి చెప్దామని రాజు, రూప ఇద్దరూ సర్దిచెప్తారు. విజయాంబికను ఆపలేమని విరూపాక్షి అంటుంది. మా నాన్నని వాళ్లే తీసుకొస్తారు వాళ్లకి ఆస్తి చాలా ముఖ్యం అని ఆనంద్ అంటాడు.
రాజు ఆనంద్‌తో వాళ్లని ఇంకాస్త తొందర పెట్టమని చెప్తారు. ఇంట్లో రెండు పెళ్లిళ్లు జరగబోతున్నాయని తల్లీకొడుకులు మాట్లాడుకుంటుంటే ఒక్క పెళ్లే జరుగుతుందని ఆనంద్ వెళ్తాడు. మా నాన్నని తీసుకురాకపోతే అస్సలు పెళ్లి చేసుకోను మీరు సీరియస్‌గా తీసుకోవడం లేను నేను వెళ్లిపోతాను అని ఆనంద్ అంటాడు. ఆనంద్ వెళ్లిపోతే ఆస్తి దక్కదు అని తల్లీకొడుకులు ఆనంద్‌ని బతిమాలుతారు. ఆనంద్ రాజు వాళ్లకి విషయం చెప్తాడు. కచ్చితంగా రాఘవని వాళ్లే తీసుకొస్తారని రాజు అంటాడు.
విజయాంబిక, దీపక్‌లు జీవన్‌ని కలుస్తారు. రాఘవ ఎక్కడున్నాడో కచ్చితంగా ఈ రోజు తెలుసుకోవాలని దీపక్ అంటాడు. ఆ రోజు మా మీద కోప్పడి వెళ్లిపోతున్న మమల్ని పిలిచి ఓ ప్లాన్ చెప్పావు కదా అక్కడ మన ముగ్గురి జీవితం మలుపు తిరిగిందని విజయాంబిక అంటుంది. గతంతో తల్లీకొడుకులు జీవన్‌ని కలిసి వెళ్తుంటే జీవన్ వాళ్లతో రూపలా ఉన్న రుక్మిణికి పెళ్లి ఫిక్స్ అయింది కాబట్టి రాజుకి కూడా పెళ్లి చేసేలా మీరు క్రియేట్ చేయండి.. నాకు తెలిసిన ఓ అమ్మాయి ఉంది తను నా కోసం ఏమైనా చేస్తుంది జీవన్ చెప్తాడు. పంతులు చెప్పిన కీర్తి స్థానంలో తల్లీకొడుకు జీవన్ చెప్పిన అమ్మాయిని పెట్టాలని అనుకుంటారు.
తల్లీకొడుకులు పంతుల్ని కలిసి కీర్తి స్థానంలో తాము చెప్పిన అమ్మాయిని పెట్టాలని పంతుల్ని బెదిరిస్తారు. డబ్బు కూడా ఇస్తారు. అలా జీవన్ చెప్పిన దీప్తిని కీర్తిగా చెప్పి రాజు ఆ అమ్మాయిని కాపాడినట్లు చేసి తర్వాత ఇద్దరినీ చాటుగా ఫొటోలు తీసి న్యూస్ వేయిస్తారు. ఈ రకంగా జీవన్ ప్లాన్ సక్సెస్ చేయించాలని దీప్తిని పంతులుతో తనే కీర్తి అని చెప్పించి సూర్యప్రతాప్ మీడియా ముందు రాజు, కీర్తిలను పెళ్లి చేస్తాను అనేలా చేస్తారు.
తల్లీకొడుకులు జీవన్‌కి ఈ జరిగిన సంఘటన అంతా చెప్తారు. జీవన్ దీప్తిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తారు. దీప్తి మాఇంట్లో కాళ్లమీద కాలు వేసుకొని దర్జాగా ఉందని విజయాంబిక చెప్తారు. కీర్తిలా వచ్చిన దీప్తి మోడ్రన్ డ్రస్ వేస్తే మందు తాగుతూ దర్జాగా సూర్యప్రతాప్ ఇంట్లో ఉంటుంది. విజయాంబిక జీవన్‌తో అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతుందని కానీ ఆనంద్ రాఘవ కోసం చంపుతున్నాడని చెప్తారు. మిమల్ని నేను నమ్మలేను అని జీవన్ అంటాడు. రాఘవని చూపిస్తా అని జీవన్ ఓ నెంబరుని దీపక్‌కి చెప్తాడు. వీడియో కాల్ చేసి చూడమని అంటాడు. ఇంట్లో సూర్యప్రతాప్ పంతులు రావడంతో మాట్లాడుతారు. కీర్తిగా ఉన్న దీప్తి అచ్చ తెలుగు అమ్మాయిలా రెడీ అయి కిందకి వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజు, కీర్తిలకు పెళ్లి చేస్తానని మాటిచ్చేసిన సీఎం.. భర్తపై విరూపాక్షి ఫైర్!





















