Gayatri Bhargavi: అకౌంట్ హ్యాక్.. పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ యాంకర్..
ప్రముఖ యాంకర్, నటి గాయత్రి భార్గవి ఫేస్ బుక్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది.
ప్రముఖ యాంకర్, నటి గాయత్రి భార్గవి(Gayatri Bhargavi) ఫేస్ బుక్(Facebook) అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. దీంతో వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించింది. గుర్తు తెలియని దుండగులు తన ఫేస్ బుక్ పేజీని హ్యాక్ చేసి వివిధ మతాలకు సంబంధించి అభ్యంతరకరమైన పోస్ట్ లు చేస్తున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయంపై ఏసీపీ కెవిఎం ప్రసాద్ మాట్లాడారు.
Also Read : Allu Arjun's Pushpa Update: 'పుష్ప' టీమ్ కి పెద్ద షాక్.. రిలీజ్ కి ముందే పాట లీక్..
యాంకర్ భార్గవి ఫేస్ బుక్ అఫీషియల్ అకౌంట్ తో పాటు మరో అకౌంట్ ను దుండగులు ఆమె పేరు మీద క్రియేట్ చేసినట్లు గుర్తించామని చెప్పారు. సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని.. ఎప్పటికప్పుడు పాస్ వర్డ్స్ ను మార్చుకోవాలని సూచించారు. యాంకర్ భార్గవి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Also Read : Pushpa The Rise : 'దాక్కో దాక్కో మేక' సాంగ్ ప్రోమో.. అల్లు అర్జున్ ఊరమాస్ అవతార్..
తన అకౌంట్ హ్యాక్ అయిందనే విషయాన్ని గాయత్రి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. తన ఫేస్ బుక్ అకౌంట్ నుండి మెసేజ్ లు ఏమైనా వస్తే స్పందించవద్దని కోరింది. గాయత్రి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఇకపై ఫేస్ బుక్ ఉపయోగించనని.. ఏ విషయమైనా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది.
View this post on Instagram