అన్వేషించండి

Nadikar Telugu Teaser: ‘నడిగర్’ మూవీ తెలుగు టీజర్ - మైత్రీ మూవీస్ తొలి మలయాళీ చిత్రం, అదరగొట్టిన టోవినో థామస్

వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉన్న మలయాళీ నటుడు టొవినో థామస్ నటిస్తున్న తాజా చిత్రం ‘నడిగర్’. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు.

Nadikar Telugu Teaser Out: మలయాళంలో వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు టొవినో థామస్. ఆయన రీసెంట్ సినిమాలు ‘మిన్నల్ మురళీ’, ‘2018’, ‘తల్లుమల్లు’ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ‘2018’ సినిమాతో తెలుగులోనే బాగా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన ‘నడిగర్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. సౌబిన్ షాహిర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జీన్ పాల్ లాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ సినీ అభిమానులలో మంచి క్యూరియాసిటీ పెంచింది. ఇక తాజాగా తెలుగు టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు.

ఆకట్టుకుంటున్న ‘నడిగర్’ టీజర్

1 నిమిషం 19 సెకెన్ల పాటు ఉన్న ఈ టీజర్ లో టోవినో థామస్ సూపర్ స్టార్ పాత్రలో కనిపిస్తున్నట్లు అర్థం అవుతోంది. సూపర్ స్టార్ డేవిడ్ పడిక్కల్ పాత్రలో ఆయన అలరించనున్నారు. ముందు వరుస హిట్లతో సూపర్ స్టార్ అయిన ఆయన, ఆ తర్వాత సినిమాలు ఫ్లాప్ అవుతాయి. విమర్శకుల నుంచి తీవ్ర విమర్శలు వస్తాయి. చాలా మంది ఆయనను విమర్శిస్తారు. వీటిని ఎదుర్కొని, మళ్లీ ఆయన ఎలా నిలబడ్డాడు అనేది ఈ సినిమాలో చూపించనున్నట్లు తెలుస్తోంది. టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. థామస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మే 3న ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

మలయాళీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మైత్రి మూవీ మేకర్స్

ఇక ఈ సినిమాను తెలుగు లీడింగ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటి వరకు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ తెరకెక్కించిన ఈ సంస్థ ఇప్పుడు మలయాళంలోనూ సత్తా చాటాలని భావిస్తోంది. అంతేకాదు, డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగు పెట్టింది. ‘నడిగర్’ చిత్రంతో పాన్ ఇండియా రేంజిలో సక్సెస్ అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

శివాజీ గణేషన్ అభిమానుల అభ్యంతరం- సినిమా పేరులో మార్పులు    

మరోవైపు ఈ సినిమాపై దివంగత నటుడు శివాజీ గణేషన్ అభిమానులు సీరియస్ అయ్యారు. ఈ చిత్రంపై కేసు పెట్టారు. ఈ సినిమా టైటిల్ మార్చాలని డిమాండ్ చేశారు. నిజానికి తమిళ అగ్ర నటుడు, నిర్మాత శివాజీ గణేషన్ ను ‘నడికర్ తిలకం’ అనే పేరుతో పిలుస్తారు. అయితే, ఈ సినిమాకు ‘నడిగర్ తిలకం’ అనే పేరు పెట్టడం పట్ల వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే పేరు మార్చాలని డిమాండ్ చేశారు. తప్పని పరిస్థితిలో సినిమా టైటిల్ ను ‘నడిగర్’ అని మార్చారు. మొత్తంగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెరకెక్కిస్తున్న తొలి మలయాళం సినిమా ఏ రేంజిలో హిట్ అందుకుంటుందో చూడాలి.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tovino⚡️Thomas (@tovinothomas)

Read Also : అందుకే నా పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచా - అసలు విషయం చెప్పిన తాప్సి

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 4th: నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
Priyanka Chopra: సర్వ మంగళ మాంగళ్యే... అమ్మాయితో ప్రియాంక పూజాలు... మంగళ శ్లోక పఠనంలో Varanasi హీరోయిన్
సర్వ మంగళ మాంగళ్యే... అమ్మాయితో ప్రియాంక పూజాలు... మంగళ శ్లోక పఠనంలో Varanasi హీరోయిన్
Karthika Deepam 2 Serial Today August 4th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
Embed widget