
Tom Holland - Uncharted : తెలుగులోనూ 'స్పైడర్ మ్యాన్' హీరో జోరు, ‘అన్‌చార్టెడ్’ సినిమాకు ఇంత క్రేజా!
'స్పైడర్ మ్యాన్' ఫేమ్ టామ్ హోలెండ్ నటించిన లేటెస్ట్ సినిమా 'అన్ చార్టెడ్'. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. తెలుగులోనూ ఈ సినిమా విడుదలవుతోంది.

Uncharted | హాలీవుడ్ సినిమాలు చూసే తెలుగు ప్రేక్షకులకు టామ్ హోలెండ్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. 'స్పైడర్ మ్యాన్' సినిమాతో ఆయన చిన్నారులకు కూడా దగ్గర అయ్యారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ 'అన్ చార్టెడ్'. శుక్రవారం (ఫిబ్రవరి 18న) థియేటర్లలో విడుదల అవుతోంది. ఇండియాలో ఇంగ్లీష్ వెర్షన్ మాత్రమే కాదు... తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నారు.
వరల్డ్ ఫేమస్ వీడియో గేమ్ 'అన్ చార్టెడ్' ఆధారంగా అదే పేరుతో టామ్ హోలెండ్ హీరోగా సినిమాను రూపొందించారు. ట్రెజర్ హంట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సోనీ పిక్చర్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో మెజార్టీ యాక్షన్ సన్నివేశాలు కోసం హీరో టామ్ హోలెండ్ వందల అడుగుల ఎత్తులో ఎటువంటి డూప్ లేకుండా నటించారట. 'స్పైడర్ మ్యాన్' హీరో సినిమా కావడం, తెలుగులో భారీ సినిమాలు ఏవీ లేకపోవడంతో 'అన్ చార్టెడ్'కు ఓపెనింగ్స్ బావున్నాయి. ఈ వారం యాక్షన్ సినిమాల కోసం చూసే ప్రేక్షకులకు ఇదొక ఆప్షన్ అయ్యిందని టామ్ ఫ్యాన్స్ అంటున్నారు.
Also Read: 'భీమ్లా నాయక్' - ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న ఆర్ఆర్ఆర్?
Also Read: అదీ అల్లు అర్జున్ క్రేజ్, ఔరంగాబాద్‌లో 'పుష్ప'రాజ్ విగ్రహం రెడీ!
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

