News
News
X

Tom Cruise: విమానం నుంచి దూకేస్తూ ఫ్యాన్స్‌కు థాంక్స్ చెప్పిన టామ్ క్రూజ్, వీడియో వైరల్

టామ్ క్రూజ్.. హాలీవుడ్ సినిమాలు చూసే వారికి ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఈ స్టార్ హీరో చేసిన విన్యాసాన్ని చూసి అభిమానులు షాక్ అయ్యారు. ఇంతకీ ఆయన చేసిన పనేంటో ఇప్పుడు చూడండి.

FOLLOW US: 
Share:

హాలీవుడ్ టాప్ హీరో టామ్ క్రూజ్ సినిమాలు ఏ రేంజిలో ఉంటాయో అందరికీ తెలిసిందే. అద్భుత విన్యాసాలతో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేయడం తనకు తానే సాటి. అనితరసాధ్యమైన స్టంట్స్ చేస్తూ రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. తాజాగా సోషల్ మీడియా వేదికగా షాకింగ్ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోను చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు మరోసారి నోరెళ్లబెట్టారు.

విమానంలో నుంచి దూకుతూ ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్పిన టామ్

టామ్ తాజాగా నటించిన సినిమా ‘టాప్ గన్: మేవరిక్’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు అద్భుత విజయాన్ని కట్టబెట్టిన అభిమానులకు ధన్యవాదాలు చెప్పేందుకు.. ఏకంగా గాల్లో ఎగురుతున్న విమానంలో నుంచి కిందకు దూకారు. తనను అభిమానిస్తున్న ఫ్యాన్స్ కోసం ఈ స్టంట్ చేస్తున్నట్లు తెలిపారు. ‘టాప్ గన్ మేవరిక్’ను ఆదరించిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పకుండా ఈ ఏడాదిని కంప్లీట్ చేయలేనని చెప్పారు. ఈ సాహసోపేతమైన వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.

View this post on Instagram
 
A post shared by Top Gun (@topgunmovie)

నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో

ఈ వీడియో సుమారు నిమిషంన్నర  వ్యవధి ఉంటుంది. ఈ వీడియోలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. విమానంలో నుంచి దూకుతూ.. ఇంతకు తాను నటించిన సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో సంచలనంగా మారింది.    

హాలీవుడ్ కు బూస్టింగ్ ఇచ్చిన ‘టాప్ గన్ మేవరిక్’

టామ్ నటించిన చివరి సినిమా ‘టాప్ గన్ మేవరిక్’. ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. కరోనా తర్వాత కష్టాల్లో ఉన్న హాలీవుడ్ కు ఈ చిత్రం మంచి  ఊపును అందించింది. ఈ సినిమా విజయానికి సహకరించిన ఫ్యాన్స్ కు ఆయన చాలా సార్లు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ఈ అద్భుత వీడియోను షేర్ చేసి మరోసారి ధన్యవాదాలు చెప్పారు. త్వరలో మరో సినిమాను మొదలుపెట్టబోతున్నట్లు వెల్లడించారు.  టామ్ నటిస్తున్న తాజా సినిమా 'మిషన్ ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్-1'  వచ్చే ఏడాది జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.  

Read Also: ఓ మై గాడ్, విమానం నుంచి అలా దూకేశావేంటి మెహ్రీన్ - హనీ ఈజ్ బ్రేవ్

Published at : 19 Dec 2022 03:47 PM (IST) Tags: Tom Cruise Top Gun Maverick jumps off plane Tom Cruise stunt

సంబంధిత కథనాలు

BRS - Keerthi Suresh: నేనేమీ గుజరాత్ నుంచి రాలేదు కదా - కీర్తి సురేష్ కామెంట్స్‌ను వాడేసుకుంటున్న బీఆర్ఎస్

BRS - Keerthi Suresh: నేనేమీ గుజరాత్ నుంచి రాలేదు కదా - కీర్తి సురేష్ కామెంట్స్‌ను వాడేసుకుంటున్న బీఆర్ఎస్

Bommarillu Bhaskar: అప్పుడు విమర్శలు, ఇప్పుడు విజిల్స్ - థియేటర్లో ‘ఆరెంజ్’ మూవీ చూసి బొమ్మరిల్లు భాస్కర్ భావోద్వేగం

Bommarillu Bhaskar: అప్పుడు విమర్శలు, ఇప్పుడు విజిల్స్ - థియేటర్లో ‘ఆరెంజ్’ మూవీ చూసి బొమ్మరిల్లు భాస్కర్ భావోద్వేగం

G20 Summit 2023: సిగ్గు, శరంలేని జాతి - విశాఖ జీ20 సదస్సులో తమిళ బ్యానర్లపై నటి సంచలన వ్యాఖ్యలు

G20 Summit 2023: సిగ్గు, శరంలేని జాతి - విశాఖ జీ20 సదస్సులో తమిళ బ్యానర్లపై నటి సంచలన వ్యాఖ్యలు

Ram Charan: అభిషేక్ బచ్చన్ చేయని సాహసాన్ని చరణ్ చేసి చూపించాడు, కానీ...

Ram Charan: అభిషేక్ బచ్చన్ చేయని సాహసాన్ని చరణ్ చేసి చూపించాడు, కానీ...

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

టాప్ స్టోరీస్

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nitish Rana: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన కోల్‌కతా - అస్సలు అనుభవం లేని ప్లేయర్‌కి!

Nitish Rana: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన కోల్‌కతా - అస్సలు అనుభవం లేని ప్లేయర్‌కి!

KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత

KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత