అన్వేషించండి

Tollywood Big Movies: 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప', 'రాధేశ్యామ్'.. ట్రైలర్ రిలీజ్ డేట్స్ ఇవే..

ఈ వారంలో 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్', 'పుష్ప', 'భీమ్లానాయక్' వంటి సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నాయి.

ఆర్ఆర్ఆర్:
 
'బాహుబలి'తో టాలీవుడ్ రేంజ్ మార్చేసిన రాజమౌళి తర్వాతి ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో మెగా-నందమూరి వారసులు నటిస్తుండడంతో క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది.  ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 7వ తేదిన విడుదల చేయబోతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. ఇటీవల దీపావళి సందర్భంగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' గ్లింప్స్ ను విడుదల చేసి అభిమానుల్లో జోష్ పెంచారు. అలానే ఒక్కో పాటను విడుదల చేస్తున్నారు. ఇక సినిమా ట్రైలర్ ను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో తెలుసా..? డిసెంబర్ 3. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఒకట్రెండు రోజుల్లో రాబోతుంది. 
 
పుష్ప: 
 
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పదేళ్ల తర్వాత వస్తున్న సినిమా 'పుష్ప'. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ రికార్డులను తిరగరాశాయి. ఈ సినిమాను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. దీంతో సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇక సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 6న విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ రేపే రానుంది. 
 
భీమ్లానాయక్:  
 
పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'భీమ్లా నాయక్'. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే సినిమాలో పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయనే విషయాలను టీజర్ ద్వారా చెప్పకనే చెప్పారు. పాటలు కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా.. డిసెంబర్ 14 లేదా 15 తేదీల్లో ట్రైలర్ రాబోతుంది. సినిమాను అనుకున్నట్లుగానే సంక్రాంతికే రిలీజ్ చేయబోతున్నారు. 
 
రాధేశ్యామ్: 
 
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ 'రాధే శ్యామ్'. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది చిత్రయూనిట్. రీసెంట్ గా సినిమా టీజర్ విడుదల కాగా.. ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ రెండో వారం, లేదా మూడో వారంలో సినిమా ట్రైలర్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 
 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 
 

టాప్ హెడ్ లైన్స్

Aasmaan Telugu Teaser : మిస్టీరియస్ యాక్షన్ థ్రిల్లర్ ఆస్మాన్ - హీరోగా శ్రీహరి కొడుకు... టీజర్ ఎలా ఉందంటే?
మిస్టీరియస్ యాక్షన్ థ్రిల్లర్ ఆస్మాన్ - హీరోగా శ్రీహరి కొడుకు... టీజర్ ఎలా ఉందంటే?
Bold Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న బోల్డ్ హారర్ థ్రిల్లర్ - 18 ప్లస్ వారికి మాత్రమే... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న బోల్డ్ హారర్ థ్రిల్లర్ - 18 ప్లస్ వారికి మాత్రమే... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Messi Telugu Movie: తెలుగులో మలయాళ స్పోర్ట్స్ డ్రామా... ఫుట్‌బాల్ దేవుడు 'మెస్సి' పేరుతో డబ్బింగ్
తెలుగులో మలయాళ స్పోర్ట్స్ డ్రామా... ఫుట్‌బాల్ దేవుడు 'మెస్సి' పేరుతో డబ్బింగ్
Modha Rathri OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'ఫస్ట్ నైట్' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'ఫస్ట్ నైట్' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
గత నెలలో ప్రజలు ఈ కార్ల కోసమే షోరూమ్‌ల ముందు క్యూ కట్టారు.. టాప్‌-10 కార్ల లిస్ట్‌
ఆగస్టులో దేశవ్యాప్తంగా ఈ కార్లకు ఫుల్ డిమాండ్.. టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ లిస్ట్‌ మీ కోసం
Navya Swamy: ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
Embed widget