అన్వేషించండి

Thangalaan Teaser: ‘తంగలాన్‘ కోసం విక్రమ్ అంత బరువు తగ్గాడా? టీజర్ చూస్తే నోటి నుంచి మాటలు రావంతే!

చియాన్ విక్రమ్, పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘తంగలాన్‘. ఈ సినిమా కోసం హీరో విక్రమ్ ఎంతో కష్టపడ్డారని నిర్మాత జ్ఞానవేల్ రాజా వెల్లడించారు.

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఏ సినిమా చేసిన శక్తివంచన లేకుండా కష్టపడతారు. పాత్ర ఏదైనా ప్రాణం పోస్తారు. ‘అపరిచితుడు,’ ‘శివపుత్రుడు,’ ‘నేను,’ ‘రావణ్‌’ లాంటి చిత్రాల్లో ఆయన నటన చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. త్వరలో ‘తంగలాన్‘ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు నుంచి విడుదలైన టీజర్ ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతోంది. ఆయన గెటప్, నటన చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. గతంలోనే విడుదలైన మేకింగ్ వీడియోలో విక్రమ్ ‘తంగలాన్‘గా మారడాన్ని మేకర్స్ చూపించారు. గిరిజన నాయకుడిగా విక్రమ్ లుక్ చూసి షాక్ అవుతున్నారు ప్రేక్షకులు. కొన్ని చోట్ల పొడవైన జుట్టుతో, మరికొన్ని సన్నివేశాల్లో సగం బట్టతలతో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. తాజాగా విడుదలైన టీజర్ తో మాట్లాడేందుకు మాటలు ఏమీ లేవు. టీజర్ ఆద్యంతం ఒక్కంటే ఒక్క మాట కూడా లేకపోవడం విశేషం. వాగులో నీళ్ళల్లో పారిన రక్తం, పామును విక్రమ్ రెండు ముక్కలు చేయడం, పోరాట సన్నివేశాలు చూసిన ప్రేక్షకులకూ నోట మాటలు రాలేదు.    

యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ‘తంగలాన్’

దశాబ్దాల కిందట కోలార్ గోల్డ్ ఫీల్డ్ లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ‘తంగలాన్’ తెరకెక్కింది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో తమిళ కూలీలు అనుభవించిన అవస్థలను ఇందులో చూపిస్తున్నారు.  ఈ విక్రమ్‌తో పాటు పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి, హాలీవుడ్ నటుడు డేనియల్ కాల్టాగిరోన్ కూడా ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని కె.ఇ.జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈచిత్రానికి ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

‘తంగలాన్‘ కోసం 35 కేజీల బరువు తగ్గిన విక్రమ్

ఇక ‘తంగలాన్‘ సినిమా గురించి నిర్మాత KE జ్ఞానవేల్‌ రాజా  కీలక విషయాలు వెల్లడించారు. ఇప్పటి వరకు ఎంతో మంది అగ్ర హీరోల సినిమాలు నిర్మించిన ఆయన తొలిసారి విక్రమ్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం విక్రమ్ పడిన శ్రమను గుర్తు చేశారు. ఈ సినిమాలో తన పాత్ర కోసం ఏకంగా 35 కిలోల బరువు తగ్గినట్లు చెప్పారు. సినిమా షూటింగ్ అనుకున్న దానికన్నా మూడు నెలల తర్వాత మొదలైందన్నారు. ఆ సమయంలో ఈ మూవీలో తన గెటప్ కు సరిపడేలా బరువు తగ్గినట్లు చెప్పారు. వెయిట్ తగ్గించుకునేందుకు రాత్రి, పగలు అని తేడా లేకుండా కష్టపడినట్లు చెప్పారు. సినిమా షూటింగ్ మొదలైన 65వ రోజు లొకేషన్ కు వెళ్లినట్లు జ్ఞానవేల్ చెప్పారు. అంతకు ముందు 64 రోజుల్లో జరిగిన అన్ని విషయాలు విక్రమ్ తనతో చెప్పినట్లు వివరించారు. మిగతా ఆర్టిస్టుల మాదిరి కాకుండా ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకుని సిన్సియర్ గా చేస్తారని వెల్లడించారు. ఈ సినిమాలో సరికొత్త విక్రమ్ ను చూడనున్నట్లు జ్ఞానవేల్‌ రాజా తెలిపారు. ఇక 'తంగలాన్' సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Read Also: కమెడియన్​తో జతకట్టనున్న ‘చంద్రముఖి 2‘ బ్యూటీ, త్వరలో అధికారిక ప్రకటన!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today June 10th: కార్తీకదీపం 2 సీరియల్: నిజం తెలుసుకున్న కుటుంబం.. జ్యోత్స్నని పెద్దాయన ఇంట్లో నుంచి గెంటేసినట్లేనా!
కార్తీకదీపం 2 సీరియల్: నిజం తెలుసుకున్న కుటుంబం.. జ్యోత్స్నని పెద్దాయన ఇంట్లో నుంచి గెంటేసినట్లేనా!
Chandrababu Wishes Balakrishna On His Birthday: నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Bharathiraja: లెజెండరీ తమిళ దర్శకుడు భారతీరాజా మృతి... పవన్, తమిళనాడు విజయ్ సంతాపం
లెజెండరీ తమిళ దర్శకుడు భారతీరాజా మృతి... పవన్, తమిళనాడు విజయ్ సంతాపం
AK 47 Movie Release Date: 'ఏకే 47' రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన వెంకటేష్ - త్రివిక్రమ్... దసరాకు సినిమా?
'ఏకే 47' రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన వెంకటేష్ - త్రివిక్రమ్... దసరాకు సినిమా?

వీడియోలు

Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
Chandrababu Wishes Balakrishna On His Birthday: నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Congress vs BJP South India: రాహుల్ గాంధీ ప్రధాని కల నిజమవ్వాలంటే.. ఆ ‘ముగ్గురు’ మ్యాజిక్ చేయాల్సిందే! రేవంత్, డీకే, కనుగోలు ముందున్న బిగ్ టాస్క్!
రాహుల్ గాంధీ ప్రధాని కల నిజమవ్వాలంటే.. ఆ ‘ముగ్గురు’ మ్యాజిక్ చేయాల్సిందే! రేవంత్, డీకే, కనుగోలు ముందున్న బిగ్ టాస్క్!
AK 47 Movie Release Date: 'ఏకే 47' రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన వెంకటేష్ - త్రివిక్రమ్... దసరాకు సినిమా?
'ఏకే 47' రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన వెంకటేష్ - త్రివిక్రమ్... దసరాకు సినిమా?
US Attacks Iran: ఇరాన్‌పై అమెరికా ప్రతీకారం.. హర్మూజ్ నుంచి బందర్ అబ్బాస్ వరకు బాంబు దాడులు
ఇరాన్‌పై అమెరికా ప్రతీకారం.. హర్మూజ్ నుంచి బందర్ అబ్బాస్ వరకు బాంబు దాడులు
Crime News: ఆ భర్తది దొంగ ఏడుపే.. చేతికి మట్టి అంటకుండా భార్య హత్య, కేసు ఛేదించిన పోలీసులు
ఆ భర్తది దొంగ ఏడుపే.. చేతికి మట్టి అంటకుండా భార్య హత్య, కేసు ఛేదించిన పోలీసులు
Balakrishna: రియల్ లైఫ్‌లోనూ బాలకృష్ణ హీరోయే... నందమూరి నాయకుడి జీవితంలో సంథింగ్ స్పెషల్ మూమెంట్స్
రియల్ లైఫ్‌లోనూ బాలకృష్ణ హీరోయే... నందమూరి నాయకుడి జీవితంలో సంథింగ్ స్పెషల్ మూమెంట్స్
Future City Hyderabad: ఫ్యూచర్ సిటీ కోసం మొదటి అడుగు - కొత్త ఆఫీస్ రెడీ - 9 నెలల్లో మాస్టర్ ప్లాన్ - అనుకున్నట్లు సాగుతుందా?
ఫ్యూచర్ సిటీ కోసం మొదటి అడుగు - కొత్త ఆఫీస్ రెడీ - 9 నెలల్లో మాస్టర్ ప్లాన్ - అనుకున్నట్లు సాగుతుందా?
Embed widget