News
News
X

Veera Simha Reddy : తమన్‌కు టార్గెట్ ఫిక్స్ చేసిన బాలకృష్ణ ఫ్యాన్స్ - బాక్సులు పగిలిపోవాలంతే

Balakrishna Fans Request To Thaman: సంగీత దర్శకుడు తమన్‌కు నందమూరి అభిమానులు టార్గెట్ ఫిక్స్ చేశారు. బాలకృష్ణ సినిమా నుంచి ఏం ఆశిస్తున్నారో చెప్పేశారు. మరి, తమన్ ఏం చేస్తారో చూడాలి.   

FOLLOW US: 
Share:

సంగీత దర్శకుడు తమన్ (Thaman Music), ఆయన సంగీతం నుంచి నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులు ఏం ఆశిస్తున్నారు? వాళ్ళు కోరుకునేది ఏంటి? చాలా అంటే చాలా స్పష్టంగా, కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఒక విధంగా తమన్‌కు టార్గెట్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు తాను సెట్ చేసిన బెంచ్ మార్క్‌ను తమన్ అందుకోవాలి. అసలు వివరాల్లోకి వెళితే...
   
బాలకృష్ణ కథానాయకుడిగా దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) తెరకెక్కిస్తున్న ఫ్యాక్షన్ ఫిల్మ్ 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy). ఇందులో శృతి హాసన్ కథానాయిక. ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగుతోంది. జనవరి 12న థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు శనివారం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ వెల్లడించింది. తాజాగా తమన్ మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. అది ఏంటంటే...
 
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ షురూ!
'వీర సింహా రెడ్డి' సాంగ్ కంపొజిషన్స్ కంప్లీట్ అయ్యాయని, ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్స్ స్టార్ట్ చేశామని తమన్ ట్వీట్ చేశారు. గోపీచంద్ మలినేనితో పాటు గేయ రచయిత రామజోగయ్య శాస్త్రితో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. 

బాలకృష్ణ లాస్ట్ సినిమా 'అఖండ'కు తమన్ సంగీతం అందించారు. ఆ సినిమా విజయం నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. అంతే కాదు... థియేటర్లలో సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు పూనకాలు వచ్చేలా చేసింది. ఇప్పుడు 'వీర సింహా రెడ్డి' నేపథ్య సంగీతం ఆ సినిమా నేపథ్య సంగీతం మించి ఉండాలని బాలకృష్ణ, నందమూరి అభిమానులు కోరుతున్నారు. 

Also Read : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

''సమర సింహా రెడ్డి, అఖండ లెవెల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆశిస్తున్నాం'', ''బావ గోపికి ఇచ్చిన మాట నిలపెట్టుకో తమన్‌ అన్న…! అఖండ BGM కి మించి ఉండాలి…!'', ''బాక్సులు పగిలిపోవాలి'', ''అఖండను మించి ఉండాలి'', ''తమన్ అన్నా... ర్యాంప్ ఆడించాలి అన్నా'' అని తమన్ ట్వీట్ కింద బాలకృష్ణ ఫ్యాన్స్ రిప్లైలు ఇస్తున్నారు. 'అఖండ'తో తమన్ ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఇప్పుడు దాన్ని అధిగమించాల్సి బాధ్యత ఆయనపై ఉంది. 

'వీర సింహా రెడ్డి' తర్వాత రోజు 'వాల్తేరు వీరయ్య'
Veera Simha Reddy Vs Varasudu : సంక్రాంతి బరిలో తమిళ స్టార్ హీరో విజయ్, రష్మికా మందన్నా జంటగా తెరకెక్కుతున్న 'వారసుడు' కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాను జనవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ రోజు తెలుగు రాష్ట్రలో థియేటర్లను విజయ్, బాలకృష్ణ పంచుకోవాలి. వీళ్ళిద్దరూ వచ్చిన మరుసటి రోజు... జనవరి 13న 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) తో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మాస్ మహారాజ రవితేజ థియేటర్లలోకి రానున్నారు. మూడు సినిమాలకు ఎటువంటి ఓపెనింగ్స్ లభిస్తాయో? అని ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar), మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర (Naveen Chandra), మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Published at : 04 Dec 2022 09:54 AM (IST) Tags: Nandamuri Balakrishna Thaman Gopichand Malineni Veera Simha Reddy Balakrishna Thaman

సంబంధిత కథనాలు

Ennenno Janmalabandham February 7h: అభిమన్యుతో చేతులు కలిపిన విన్నీ- వేద కోసం పార్టీకి వచ్చిన యష్

Ennenno Janmalabandham February 7h: అభిమన్యుతో చేతులు కలిపిన విన్నీ- వేద కోసం పార్టీకి వచ్చిన యష్

Kalyan Ram in Suma Adda: హీరోయిన్ ను పక్కనబెట్టి యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్!

Kalyan Ram in Suma Adda: హీరోయిన్ ను పక్కనబెట్టి యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ రామ్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Unstoppable 2: నర్సుపై వివాదాస్పద కామెంట్స్, క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

Unstoppable 2: నర్సుపై వివాదాస్పద కామెంట్స్, క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

Madhavan Audition Clip: ‘3 ఇడియట్స్’ సినిమా కోసం మాధవన్ చేసిన ఆడిషన్ వీడియో చూశారా?

Madhavan Audition Clip: ‘3 ఇడియట్స్’ సినిమా కోసం మాధవన్ చేసిన ఆడిషన్ వీడియో చూశారా?

టాప్ స్టోరీస్

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి

Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి

Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!

Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!

Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?

Majilis Congress :  మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ -  వర్కవుట్ అవుతుందా ?