అన్వేషించండి

Suriya Quits Vanangaan: బాలా సినిమా నుంచి తప్పుకున్న సూర్య, కారణం ఇదేనా?

తమిళ దర్శకుడు బాలా, స్టార్ హీరో సూర్య కలిసి ‘వనంగాన్’ అనే సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సూర్య తప్పకున్నారు. ప్రస్తుతం ఆయన నిర్ణయం తమిళ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

మిళ టాప్ హీరో సూర్య గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులో విడుదలవుతూనే ఉన్నాయి. డబ్బింగ్ సినిమాలు అయినా మంచి ప్రజాదరణ కొనసాగుతోంది. తెలుగులో సూర్యకు మంచి మార్కెట్ ఉంది. ‘గజిని’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సూర్య, తాజాగా కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాతోనూ తెలుగు ఆడియెన్స్ ను పలకరించారు. ప్రముఖ తమిళ దర్శకుడు బాలాతో కలిసి ’వనంగాన్’ అనే సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఏం జరిగిందో తెలియదు కానీ, తాజాగా ఈ సినిమా నుంచి తప్పకున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు బాలా ధృవీకరించారు.

సూర్య తప్పుకోవడానికి కారణం ఇదేనా?

సూర్య ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి చాలా కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా అనుకున్న కథ కాకుండా చాలా మార్పులు చేశారట దర్శకుడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య మనస్పర్దలు వచ్చాయట. చివరకు ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా దర్శకుడు బాలా ఈ విషయానికి సంబంధించి ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. “కథలో కొన్ని మార్పులు చేర్పులు చేశాను. దీంతో ఈ సినిమా సూర్యకు సరిపోదని భావించాను. మరో హీరోతో ఈ సినిమా రాబోతోంది.  సూర్యతో నాకు ఎలాంటి విబేధాలు లేవు. త్వరలో మంచి కథతో ఆయనతో కలిసి పని చేస్తాను” అని బాలా తెలిపారు.

రెండు సినిమాల్లో కలిసిన పని చేసిన సూర్య, బాలా

సూర్య, బాలా కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి.  2001లో ‘నంద’,  2003లో ‘పితామగన్’ సినిమాలు విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. సుమారు రెండు దశాబ్దాల తర్వాత  ’వనంగాన్’ అనే సినిమా చేయాలనుకున్నారు. కానీ, సూర్య ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఈ సినిమాలో సూర్య స్థానంలో ఏ హీరో వస్తారు? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.    

ఇక సూర్య తాజాగా ‘సూరరై పొట్రు’ ( తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’) సినిమాలో నటనకు గాను  ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం  ఆయన రెండు తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. ఒకటి శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. మరో సినిమా కటి వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడివాసల్’ అనే పేరుతో రూపొందుతోంది.  ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్ జరుగుతోంది. సూర్య తాజాగా ఈటీ(ET) అనే సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు.  పాండి రాజ్ తెరెక్కించిన ఈ సినిమా ఆడియెన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఓటీటీ వేదికగా విడుదలైన ‘జై భీమ్’ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది.

Read Also: సంక్రాంతి బరిలో అజిత్‌ ‘తునివు’ - తెలుగులోనూ రిలీజ్, ఈసారైనా ఆ కష్టాలు తీరేనా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Polena Anjana Pawanova: అల్లు శిరీష్ పెళ్లిలో మెరిసిన అంజనా... పవన్ చిన్న కూతుర్ని చూశారా?
అల్లు శిరీష్ పెళ్లిలో మెరిసిన అంజనా... పవన్ చిన్న కూతుర్ని చూశారా?
Jana Nayagan Release Date : విజయ్ జన నాయగన్ సెన్సార్ అప్డేట్ - మూవీ రిలీజ్‌ ఎప్పుడంటే?
విజయ్ జన నాయగన్ సెన్సార్ అప్డేట్ - మూవీ రిలీజ్‌ ఎప్పుడంటే?
Vijay Divorce Case : విజయ్ విడాకుల కేసు - కోర్టులో భార్య సంగీత మరో పిటిషన్
విజయ్ విడాకుల కేసు - కోర్టులో భార్య సంగీత మరో పిటిషన్
Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ vs సాయి మాధవ్ బుర్రా: 'సరస్వతి' వివాదం... కథను మార్చారా? అసలు ఏం జరిగింది?
వరలక్ష్మి శరత్ కుమార్ vs సాయి మాధవ్ బుర్రా: 'సరస్వతి' వివాదం... కథను మార్చారా? అసలు ఏం జరిగింది?

వీడియోలు

Vijay Trisha Attended Marriage | పట్టు బట్టల్లో..ఒకే కారులో..విజయ్ త్రిష | ABP Desam
Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam
Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam
Sanju Samson 89 vs England Semis | T20 World Cup 2026లో హీరోగా మారిపోయిన సంజూ శాంసన్ | ABP Desam
Ind vs Eng 2nd Semifinal Highlights | T20 World Cup 2026 సెమీస్ లో ఇంగ్లండ్ పై భారత్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
Vijayawada Firing Case: విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
Gold Discount: దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
ఢిల్లీని
ఢిల్లీని "దెయ్యాల నగరం"గా మార్చిన ఇరాన్ పాలకుడు ఎవరో తెలుసా?
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Ustaad Bhagat Singh Story : పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
Best First Car India: బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ నుంచి SUV, ఎలక్ట్రిక్ వరకు - ఫస్ట్ టైమ్ కారు కొనేవాళ్లకు బెస్ట్ కార్లు
మొదటి కారు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో బెస్ట్ ఆప్షన్లు ఇవే!
Embed widget