By: ABP Desam | Updated at : 06 Dec 2022 01:12 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@BoneyKapoor/twitter
కోలీవుడ్ టాప్ స్టార్ అజిత్ నటిస్తున్న తాజా సినిమా ‘తునివు’. వినోద్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మంజు వారియర్ హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా తమిళం, తెలుగు సహా పలు భాషల్లో విడుదల కాబోతోంది.
అజిత్ కుమార్ తమిళ సినిమా పరిశ్రమలో టాప్ హీరోగా కొనసాగుతున్నా, తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు. ఈ నేపథ్యంలో ఆయన సినిమాల తెలుగు వెర్షన్ నిర్మాతలు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘తునివు’ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. ఈ సినిమాకు సంబంధించి రాధా కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్, IVY ప్రొడక్షన్స్ కలిసి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రాల తెలుగు థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నాయి. ఈ మూవీ తెలుగులో బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’, చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’, విజయ్ ‘వారసుడు’ సినిమాలతో పోటీకి దిగనుంది.
‘తునివు’ అంటే పట్టుదల లేదంటే ధైర్యం అని అర్థం. తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు అదే టైటిల్‌ను ఉంచుతారా? లేదా కొత్తది పెడతారా? అనేది ఇంకా తెలియదు. కార్తీ హీరోగా నటించిన ‘ఖాకీ’ సినిమాతో మంచి గురింపు తెచ్చుకున్న దర్శకుడు వినోద్, ఈ సినిమాతో మరో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.
ఇక తమిళ నాట విజయ్, అజిత్ అభిమానుల మధ్య వార్ మామూలుగా ఉండదు. ఈ ఇద్దరు హీరోలు నటిస్తున్న సినిమాలు సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానున్నాయి. విజయ్ ‘వారిసు’ సినిమా పోటీకి రెడీ కాగా, తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల అవుతుంది. అటు అజిత్ ‘తునివు’ సైతం రిలీజ్ కు సిద్ధం అవుతోంది. అటు విజయ్ ఇప్పటికే ‘వరిసు’ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. అజిత్ మాత్రం ఇంకా తన సినిమా ప్రమోషన్స్ ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలోనే సినిమా యూనిట్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పింది. ‘తునివు’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు టైం ఫిక్స్ చేసింది. ఈ సినిమాలోని ‘చిల్లా చిల్లా’ అనే పాటను డిసెంబర్ 9న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ పాటతో సినిమా ప్రమోషన్ మొదలుకానుంది. ఈ చిత్రానికి జీబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
The Wait is over! 💥 #ChillaChilla is coming to rule your Playlist 😉 from December 09#ChillaChillaFromDec9 #ThunivuPongal #Thunivu #NoGutsNoGlory#Ajithkumar #HVinoth@ZeeStudios_ @Udhaystalin @BayViewProjOffl @RedGiantMovies_ @Kalaignartv_off @NetflixIndia pic.twitter.com/3ommR06X16
— Boney Kapoor (@BoneyKapoor) December 5, 2022
Read Also: ఈ సినిమాలను షార్ట్ ఫిల్మ్స్ నుంచి తీశారని తెలుసా?
Ennenno Janmalabandham February 8th: బయటపడిన అభిమన్యు అసలు రంగు, మాళవిక బతుకు బస్టాండ్- మనసులతో ఊసులాడుకున్న వేద, యష్
Pawan Kalyan As God : ప్రేమికుల రోజు నుంచి దేవుడిగా పవన్ కళ్యాణ్
Guppedanta Manasu February 8th: మహేంద్రనా మజాకా! టామ్ అండ్ జెర్రీ కొత్త ప్రయాణం మొదలైంది
Jailer vs Indian 2: ఒకే రోజు కమల్, రజినీ సినిమాలు విడుదల, 18 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్!
Prabhas Team Reaction : కృతితో ప్రభాస్ ఎంగేజ్మెంట్ - రెబల్ స్టార్ టీమ్ క్లారిటీ
ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్
Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు
PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్