Balakrishna: బాలయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు - అసలేమైందంటే?
నందమూరి హీరో బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బాలయ్య నటించిన 100వ సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి'ని 2017లో విడుదల చేశారు. ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేయగా.. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద వై రాజీవ్ రెడ్డి జాగర్లమూడి సాయిబాబా సంయుక్తంగా నిర్మించారు. ఇందులో బాలకృష్ణ సరసన శ్రియ శరణ్ హీరోయిన్ గా నటించగా హేమమాలిని.. హీరో తల్లి పాత్రలో కనిపించింది.
ఈ సినిమా రిలీజ్ సమయంలో నిర్మాతలు ప్రభుత్వాన్ని పన్ను రాయితీ ఇవ్వాలని కోరారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక చారిత్రక సినిమా కావడంతో వినోద పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను దర్శకనిర్మాతలు కోరారు. దీంతో అప్పట్లో ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాలు పన్ను మినహాయింపు ఇచ్చారు. అయితే పన్ను మినహాయింపు ఇచ్చినప్పటికీ.. సినిమా టికెట్ రేట్లు తగ్గించలేదని చెబుతూ సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది.
ఈ కేసును సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం విచారించింది. విచారణలో భాగంగా హీరో నందమూరి బాలకృష్ణకు, సినిమా నిర్మాతలు అయిన రాజీవ్ రెడ్డి, సాయిబాబా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేశారట. మరి దీనిపై బాలయ్య అండ్ కో ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి!
Also Read : ‘ఆంటీ’ ట్రోల్స్‌పై అనసూయ ఆగ్రహం, రౌడీ బాయ్ అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్
Also Read : విజయ్ దేవరకొండ కాదు, అనకొండ - రౌడీ బాయ్ ప్రవర్తనపై ముంబై థియేటర్ ఓనర్ ఫైర్
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్ ను, టీజర్ ను విడుదల చేశారు. ఇందులో బాలయ్య మాస్ అవతార్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాతో బాలయ్య మరో హిట్ అందుకోవడం ఖాయమని నమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే టర్కీలో ఓ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా మరో సినిమా ఓకే చేశారు బాలయ్య. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సినిమా రూపొందుతోంది. దీనికి హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మాతలు. హీరోగా బాలకృష్ణకు 108వ సినిమా ఇది (NBK 108 Movie). ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్ లో ఇంత బడ్జెట్ తో సినిమా తీయడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు ఆయన తీసినవన్నీ మీడియం బడ్జెట్ సినిమాలే. తొలిసారి బాలయ్య సినిమా కోసం రూ.80 కోట్ల బడ్జెట్ కోట్ చేశారు. కథ మీద నమ్మకంతో నిర్మాతలు అంత మొత్తం ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారు.