అన్వేషించండి

Sudigali Sudheer : డబ్బుల కోసమే 'జబర్దస్త్'కు బ్రేక్ - 'సుడిగాలి' సుధీర్

'సుడిగాలి' సుధీర్‌ను బుల్లితెరపై స్టార్‌గా చూస్తున్న జనాలు ఎక్కువ. ఆయన ఖాళీ లేకుండా షోలు చేస్తున్నారు. సినిమాల్లో బిజీ అవుతున్నారు. ఆయన డబ్బుల కోసం ఒత్తిడి ఎదుర్కొన్నానని తెలిపారు. 

'సుడిగాలి' సుధీర్ (Sudigali Sudheer) బిజీ ఆర్టిస్ట్. కొన్ని సంవత్సరాలుగా ఆయన టీవీ షోలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడు ఆయన సినిమాల్లో బిజీ అవుతున్నారు. ఓ ఛానల్ కాదంటే మరో ఛానల్ సుధీర్‌తో ప్రోగ్రామ్స్ చేయడానికి రెడీ అంటున్నాయి. మూడు సినిమాలు, ఆరు టీవీ షోలు అంటూ సాగుతున్న సుధీర్ జీవితంలో డబ్బులకు ఎటువంటి లోటు లేదని ఎవరైనా భావిస్తారు. కానీ, ఆయన చెప్పేది వింటే... డబ్బుల కోసం ఒత్తిడి ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.

'జబర్దస్త్' వీడటానికి కారణం చెప్పిన సుధీర్!
సుధీర్ అంటే బుల్లితెర వీక్షకులకు గానీ, తెలుగు ప్రేక్షకులకు గానీ ముందుగా గుర్తుకు వచ్చేది 'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్' (Extra Jabardasth) ప్రోగ్రామ్స్. రష్మీ గౌతమ్ (Rashmi Gautam) తో ఆయన ఆన్ స్క్రీన్ లవ్ & కెమిస్ట్రీ గురించి! ఆఫ్ స్క్రీన్ తమ మధ్య ప్రేమ లేదని ఇద్దరూ చాలా సార్లు చెప్పారనుకోండి. అటువంటి 'జబర్దస్త్'లో రష్మీతో ఆయన కనిపించి నెలలు కావొస్తోంది. మళ్ళీ, అతి త్వరలో 'ఎక్స్ట్రా జబర్దస్త్' స్టేజి మీద సుధీర్ సందడి చేయనున్నారు. వీక్షకులను నవ్వించనున్నారు.

అసలు... 'జబర్దస్త్'ను 'సుడిగాలి' సుధీర్ ఎందుకు వీడాల్సి వచ్చింది? ఎందుకు వేరే ఛానళ్ళలో షోస్ చేశారు? - 'గాలోడు' (Gaalodu Movie) సినిమా నవంబర్ 18న విడుదల కానున్న సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధీర్ సమాధానాలు ఇచ్చారు. 

వదల్లేదు... గ్యాప్ ఇచ్చా! - సుధీర్
''నేను 'జబర్దస్త్'కు చిన్న బ్రేక్ ఇచ్చానంతే! అది కూడా మల్లెమాల యాజమాన్యానికి చెప్పి బ్రేక్ తీసుకున్నాను. నాకు ఉన్న ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్ల! నాకు ఉన్న ఆర్థిక ఒత్తిడి గురించి మల్లెమాలకు చెప్పాను. వాళ్ళు ఏమైనా అడ్జస్ట్ చేస్తారేమోనని అడిగా. అయితే... అప్పుడు వాళ్ళు స్టూడియో కట్టడంతో కుదరలేదేమో!? ఆరు నెలలు గ్యాప్ తీసుకోవడానికి ఓకే అన్నారు. ఆరు నెలలు అయిపొయింది. మళ్ళీ మల్లెమాల సంస్థకు 'నేను వర్క్ చేయడానికి రెడీ' అని చెప్పాను. ఇంకేమైనా షోస్ ఉంటే చెప్పమని అడిగాను. ప్రస్తుతం మాట్లాడుతున్నాం'' అని 'సుడిగాలి' సుధీర్ వివరించారు. తాను ఈ విషయం గురించి మాట్లాడకపోడంతో జనాలు ఏదేదో అనుకున్నారని ఆయన పేర్కొన్నారు. అదీ సంగతి!

Also Read : పక్కా ప్లానింగ్‌తో పవన్ అడుగులు - రాజకీయాలు, సినిమాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా!

బుల్లితెరపై హాస్య నటుడిగా ప్రయాణం ప్రారంభించి వెండితెరపై కథానాయకుడి వరకు 'సుడిగాలి' సుధీర్ వచ్చారంటే... కారణం 'ఎక్స్ట్రా జబర్దస్త్', 'జబర్దస్త్' ప్రోగ్రామ్సే. రష్మీ గౌతమ్ కథానాయికగా నటించిన 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మళ్ళీ తాను 'జబర్దస్త్'కు వచ్చినట్లు సుధీర్ హింట్ ఇచ్చారు. 

కేవలం 'ఎక్స్ట్రా జబర్దస్త్' మాత్రమే కాదు... మల్లెమాల సంస్థ రూపొందించిన 'పోరా పోవే', డాన్స్ రియాలిటీ షో 'ఢీ', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కార్యక్రమాలు ఆయన్ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. అయితే... కొన్ని రోజుల క్రితం మల్లెమాల సంస్థను వదిలేశారు సుధీర్. ఈటీవీ ప్రోగ్రామ్స్ కాకుండా వేరే ఛానల్ ప్రోగ్రామ్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్స్ ఎండ్ అయ్యాయి. దాంతో మళ్ళీ ఎప్పుడూ ఎండ్ అవ్వకుండా నడిచే 'ఎక్స్ట్రా జబర్దస్త్'కు వచ్చాడని తెలుస్తోంది.

'సుడిగాలి' సుధీర్‌తో పాటు 'గెటప్' శీను కూడా 'ఎక్స్ట్రా జబర్దస్త్' వీడినా... మళ్ళీ కొన్ని రోజులకు ఆయన తిరిగి వచ్చారు. అందువల్ల, సుధీర్ కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలను కొట్టి పారేయలేం. అదీ సంగతి!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget