అన్వేషించండి

Sudheer Babu: డాడీకి ఐ లవ్ యు చెప్పిన సుధీర్ బాబు.. ఎమోషనల్ అయిన తండ్రి, వీడియో వైరల్

Viral News: ‘మా నాన్న సూపర్ హీరో’ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. హీరో సుధీర్ బాబు లైవ్‌లో తన తండ్రికి ఫోన్ చేసి ఐ లవ్ యు చెప్పాడు. కొడుకు మాటలు విని తండ్రి ఎమోషనల్ అయ్యారు.

Sudheer Babu Fun Conversation With His Father: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్‌ బాబు హీరోగా అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తాజాగా టీజర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ ఘటన జరిగింది.

ఫోన్ చేసి తండ్రికి ఐ లవ్ యు చెప్పిన సుధీర్ బాబు

టీజర్ లాంఛ్ సందర్భంగా లైవ్ లో తన తండ్రికి ఫోన్ చేసి“డాడీ ఐ లవ్ యూ” అని చెప్తాడు. దానికి వాళ్ల నాన్న సంతోషపడుతూ “అలాగే నాన్నా” అంటారు. “చిన్నప్పుడు నేను అడవిలో దొరికాను అని ఎందుకు చెప్పావ్?” అని అడుగుతాడు. “ఏం చేస్తాం.. నువ్వు చెప్పిన మాట విడేవాడికి కాదు. ఊరికే విసిగించే వాడివి. అప్పుడు ఎవరైనా అలాగే అంటారు” అని చెప్పారు. ఆయన మాటలు విని అభిమానులు నవ్వుతూ విజిల్స్ వేస్తారు. ప్రస్తుతం వీరి ఫన్నీ ఫోన్ కాల్ సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది.

తండ్రి గురించి చెప్తూ సుధీర్ బాబు ఎమోషనల్  

ఇక ఈ టీజర్ లాంఛ్ ఈవెంట్ లో తన తండ్రి పోసాని నాగేశ్వరరావు గురించి చెప్తూ సుధీర్ బాబు ఎమోషనల్ అయ్యారు. “నాన్న మీద నాకు ఎంత ప్రేమ ఉన్నా, ఎప్పుడూ ఐ లవ్ యు చెప్పలేదు. కనీసం హగ్ చేసుకోలేదు. ఇప్పుడు చేసుకోవాలని ఉన్నా చేసుకోలేను. అందుకే అతడిని మా పిల్లల్లో చూసుకుంటాను. వారిని హగ్ చేసుకుంటాను. మా నాన్న ఎవరి మీద కోప్పడరు. కానీ, నాకు చాలా కోపం ఎక్కువ. చిన్నప్పుడు ఎక్కువగా గొడవలు పెట్టుకునేవాడిని. దెబ్బలు కూడా తినేవాడిని. నా చేష్టలు భరించలేక “నువ్వు మాకు పుట్టలేదు. అడవిలో దొరికావు” అని నాన్న అనేవాడు. కానీ, నేను నిజంగానే దొరికాను అనుకునే వాడిని మా ఫ్రెండ్స్ కూడా చెప్పేవాడిని. నాకు 8 ఏండ్ల వయసులో మా నాన్న అప్పుచేసి ఫర్టిలైజర్ షాప్ పెట్టారు. పొద్దున 9 ఇంటికి వెళ్లి రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చే వాడు. చాలా ఏండ్లపాటు కష్టపడ్డాడు. ఇప్పుడు పెద్ద డిస్ట్రిబ్యూటర్ గా ఎదిగారు. మేం ఆనందంగా ఉండేందుకు ఆయన ఎంతో కష్టపడ్డారు. నేను సినిమాల్లోకి వస్తానంటే ఆయన చాలా బాధపడ్డారు. కానీ, ఇండస్ట్రీలో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడంతో నాన్న సంతోషంగా ఉన్నారు” అని చెప్పారు.  

ఆకట్టుకుంటున్న టీజర్  

తండ్రి కొడుకుల ప్రేమ, అనుబంధాన్ని కథాంశంగా తీసుకుని ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమాను తెరకెక్కించారు. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఎమోషనల్ గా ఆకట్టుకుంటున్నది. “నేను కష్టపడుతున్నాను కదా నాన్నా..  నువ్వేందుకు పనిచేయడం” అన్న డైలాగ్ తో టీజర్ ప్రారంభం అవుతుంది. “అమ్మని అన్నం పెట్టమని అడిగితే అడుక్కున్నట్లు కాదు, నాన్న ముందు తగ్గితే ఓడిపోయినట్టు కాదు” లాంటి డైలాగులు ఎమోషనల్ గా టచ్ చేస్తున్నాయి. తండ్రీ, కొడుకుల అనుబంధాన్ని హైలెట్ చేస్తున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 11న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో ఆర్నా హీరోయిన్‌ గా నటిస్తున్నది. షాయాజీ షిండే. సాయిచంద్, రాజు సుందరం, శశాంక్, ఆమని, చంద్ర కీలక పాత్రలుపోషిస్తున్నారు. , అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని వీ సెల్యూలాయిడ్స్‌, క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై సునీల్ బలుసు ప్రొడ్యూస్ చేస్తున్నారు.    

Read Also: కాళ్లు మొక్కిన టిల్లు, ముద్దు పెట్టిన బాలయ్య- నెట్టింట వైరల్ అవుతున్న లవ్లీ వీడియో

టాప్ హెడ్ లైన్స్

Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
S Janaki Death - Health Bulletin: జానకి మృతిపై అపోలో హాస్పిటల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ - ఎన్ని గంటలకు మరణించారు? రీజన్ ఏంటి?
జానకి మృతిపై అపోలో హాస్పిటల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ - ఎన్ని గంటలకు మరణించారు? రీజన్ ఏంటి?
S Janaki Death - Celebs Reaction: జానకమ్మ మృతిపై చిరంజీవి, బాలకృష్ణ సంతాపం... సెలబ్రిటీల రియాక్షన్
జానకమ్మ మృతిపై చిరంజీవి, బాలకృష్ణ సంతాపం... సెలబ్రిటీల రియాక్షన్
Singer Janaki Passed Away: దక్షిణాది గానకోకిల ఇకలేరు... సింగర్ ఎస్ జానకి కన్నుమూత
దక్షిణాది గానకోకిల ఇకలేరు... సింగర్ ఎస్ జానకి కన్నుమూత

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget