News
News
X

New York Film Critics Circle : ఇది కదా రాజమౌళి రేంజ్ - న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డుల్లో అరుదైన ఘనత 

'ఆర్ఆర్ఆర్' సినిమాతో రాజమౌళి మరో అరుదైన ఘనత సృష్టించారు. ఇప్పటి వరకు సినిమాకు అవార్డులు వస్తే... ఇప్పుడు ఆయనకు అవార్డు వచ్చింది.

FOLLOW US: 
Share:

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అపజయం ఎరుగని దర్శకుడు ఎవరు? అంటే ఆ తరం, ఈ తరం అని తేడా లేకుండా ప్రేక్షకులు అందరూ ముక్త కంఠంతో చెప్పే ఏకైక పేరు రాజమౌళి. ఆయన్ను దర్శక ధీరుడిగా ప్రేక్షక లోకం ప్రశంసిస్తోంది. 'బాహుబలి : ది బిగినింగ్', 'బాహుబలి : ది ఎండింగ్', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఆయన్ను, ఇప్పుడు హాలీవుడ్ అవార్డులు వరించడం మొదలుపెట్టాయి.

'ఆర్ఆర్ఆర్' - ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి...
న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ ఓటు దర్శక ధీరుడికే! 
'ఆర్ఆర్ఆర్' (RRR Movie) ఆస్కార్ అవార్డు అందుకుంటే చూడాలని భారతీయ ప్రేక్షకులు చాలా మంది ఆశ పడుతున్నారు. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఆస్కార్ కంటే ముందు విదేశాల్లో పేరున్న ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు 'ఆర్ఆర్ఆర్'ను పంపిస్తున్నారు. దేశభక్తి కథతో రాజమౌళి తీసిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చూసి విదేశీయులు ఫిదా అవుతున్నారు. అవార్డులు ఇస్తున్నారు.

ప్రతి ఏడాదీ న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు ఇస్తోంది. వివిధ వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, ఆన్ లైన్ మీడియా సంస్థలకు చెందిన క్రిటిక్స్ ఒక బృందంగా ఏర్పడి ఈ అవార్డులు ఇస్తున్నారు. ఇప్పటి నుంచి కాదు... 1935 నుంచి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ చిత్రసీమలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఈ ఏడాది 'ఆర్ఆర్ఆర్'కు గాను ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి అవార్డు ఇచ్చారు. 
        
ఇది రాజమౌళికి రెండో ఇంటర్నేషనల్ అవార్డు!
ఆస్కార్స్‌లో 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' కేటగిరీలో 'ఆర్ఆర్ఆర్'కు అవార్డు వచ్చే ఛాన్స్ ఉందని మెజారిటీ విశ్లేషకులు చెబుతున్న మాట. అది పక్కన పెడితే... సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో నాలుగు ఇంటర్నేషనల్ సినిమాలతో పోటీ పడి మరీ 'ఉత్తమ అంతర్జాతీయ సినిమా' విభాగంలో 'ఆర్ఆర్ఆర్' విజేతగా నిలిచింది. ఇంతకు ముందు కూడా 'ఆర్ఆర్ఆర్'కు 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' అవార్డు వచ్చింది. శాటన్ (50th Saturn Awards) పురస్కారాల్లో విజేతగా నిలిచింది. 

సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఉత్తమ దర్శకుడి విభాగంలో రన్నరప్‌గా నిలిచారు. 'ఆర్ఆర్ఆర్'కు గాను ఆయనకు అది తొలి ఇంటర్నేషనల్ అవార్డు. ఇప్పుడీ న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఇచ్చినది రెండో అవార్డు.

Also Read : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' సినిమా ఎలా ఉందంటే?

'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ వస్తే చూడాలని యావత్ భారత ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇండియా నుంచి ఉత్తమ విదేశీ సినిమా కేటగిరీలో సినిమాను పంపలేదు. అయితే... 'ఆర్ఆర్ఆర్' అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ ఒక్క ఇంటర్నేషనల్ ఫిల్మ్ కాకుండా, ఇతర విభాగాల్లో సినిమాను నామినేట్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ అవార్డులకు ముందు శాటన్ అవార్డు రావడం 'ఆర్ఆర్ఆర్' అభిమానులకు మంచి ఎనర్జీ ఇచ్చిందని చెప్పవచ్చు. 

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగణ్, శ్రియా కీలక పాత్రలు పోషించగా... అలీసన్ డూడీ, రే స్టీవెన్ సన్ విలన్ రోల్స్ చేశారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. డీవీవీ మూవీస్ పతాకంపై డీవీవీ దానయ్య సినిమా నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. 

ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీతో పాటు విదేశాల్లోనూ రికార్డులు క్రియేట్ చేసింది. రూ. 400 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందిన ఈ సినిమా 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు జపాన్‌లో ఆడుతోంది. ఈ సినిమా వసూళ్లు రికార్డులు మాత్రమే కాదు... భారతీయ, విదేశీ ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. ముఖ్యంగా పలువురు హాలీవుడ్ దర్శక రచయితలు, ఫిల్మ్ మేకర్స్ 'ఆర్ఆర్ఆర్' అద్భుతమని ప్రశంసిస్తూ ట్వీట్లు వేశారు. ప్రశంసలకు తోడు ఇప్పుడు అవార్డులు కూడా వస్తున్నాయి. 

Published at : 03 Dec 2022 12:59 PM (IST) Tags: SS Rajamouli RRR Movie Rajamouli Wins Award New York Film Critics Circle RRR Awards RRR International Awards

సంబంధిత కథనాలు

Ennenno Janmalabandham February 1st: భ్రమరాంబికకి వార్నింగ్ ఇచ్చిన మాళవిక- వేద మాటలకు బాధ పడిన యష్

Ennenno Janmalabandham February 1st: భ్రమరాంబికకి వార్నింగ్ ఇచ్చిన మాళవిక- వేద మాటలకు బాధ పడిన యష్

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్‌లో సంజయ్ దత్, హీరోయిన్‌గా త్రిష

Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్‌లో సంజయ్ దత్, హీరోయిన్‌గా త్రిష

Urfi Javed On Kangana: ‘పఠాన్’పై ముద్దుగుమ్మల ఫైట్ - నీలో స్వచ్ఛతా, దైవత్వం ఉన్నాయంటూ ఉర్ఫీపై కంగనా కామెంట్స్

Urfi Javed On Kangana: ‘పఠాన్’పై ముద్దుగుమ్మల ఫైట్ - నీలో స్వచ్ఛతా, దైవత్వం ఉన్నాయంటూ ఉర్ఫీపై కంగనా కామెంట్స్

Nagababu On Jabardasth: వారిని నేను రమ్మనలేదు, ఎవరి రిస్క్ వాళ్లదే: ‘జబర్దస్త్’ రి-ఎంట్రీపై నాగబాబు కామెంట్స్

Nagababu On Jabardasth: వారిని నేను రమ్మనలేదు, ఎవరి రిస్క్ వాళ్లదే: ‘జబర్దస్త్’ రి-ఎంట్రీపై నాగబాబు కామెంట్స్

టాప్ స్టోరీస్

Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

Etala Vs Kousik Reddy :  ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ -  పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!

ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ