Bhala Thandanana Teaser: నిజాయతీగా ఉండాలనుకుంటే కామన్ మ్యాన్‌కు కూడా రిస్కే... 'భళా తందానా' టీజర్ చూశారా?
'మళ్లీ ఆటకొస్తున్నాను. ఈసారి నాకు, జోకర్ పడింది' అంటున్నారు హీరో శ్రీవిష్ణు. ఆయన కొత్త సినిమా 'భళా తందానా' టీజర్ ఈ రోజు విడుదలైంది.

శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'భళా తందానా'. ఇందులో కేథరిన్ త్రేసా కథానాయిక. 'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తున్నారు. వారాహి చలన చిత్రం (ఏ సాయి కొర్రపాటి ప్రొడక్షన్) పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ రోజు టీజర్ విడుదల చేశారు.
View this post on Instagram
'రాక్షసుడిని చంపడానికి దేవుడు కూడా అవతారాలు ఎత్తాలి. నేను మామూలు మనిషిని' అని శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ తో 'భళా తందానా' టీజర్ స్టార్ట్ అయ్యింది. హీరోయిన్ కేథరిన్, పోసాని కృష్ణమురళి, కమెడియన్లు శ్రీనివాసరెడ్డి, 'స్వామి రా రా' సత్యను కూడా టీజర్ లో చూపించారు. హీరోతో 'నిజాయతీగా ఉండాలనుకుంటే ఈ దేశంలో కామన్ మ్యాన్‌కు కూడా రిస్కే' అని హీరోయిన్, 'హలో! ఈ రోజుల్లో లంచం లేనిదే కంచంలో అన్నం కూడా దొరకడం లేదు' అని కమెడియన్ సత్య చెప్పడం చూస్తుంటే... నిజాయతీ గల హీరో శ్రీవిష్ణు నటిస్తున్నట్టు తెలుస్తోంది. అవినీతిపై హీరో, హీరోయిన్ ఎలా పోరాటం చేశారన్నది కథగా తెలుస్తోంది. 'కె.జి.యఫ్' గరుడ రామ్ అలియాస్ రామచంద్రమూర్తి విలన్ రోల్ చేశారు.
మళ్లీ ఆటకొస్తున్నాను!
— Sree Vishnu (@sreevishnuoffl) January 28, 2022
ఈ సారి నాకు,
జోకర్ పడింది 😎#BhalaThandhananaTeaserhttps://t.co/SFvGd5EYaQ#BhalaThandhanana@chaitanyahead @CatherineTresa1 @SaiKorrapati_ #ManiSharma @GarudaRaam @SrikanthVissa @dopsureshragutu @PeterHeinOffl @VaaraahiCC pic.twitter.com/Qn5o8kL8lm
శ్రీకాంత్ విస్సా కథ అందించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పీటర్ హెయిన్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా: సురేష్ రగుతు, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్.
Before You Go
Gundenininda Gudigantalu Serial September 7 | వరలక్ష్మీ వ్రతంలో రోహిణికి ట్విస్ట్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















