Sonu Sood: నాలుగు కాళ్ల చిన్నారి - ఆపరేషన్ చేయించిన సోనూసూద్
రీసెంట్ గా బీహార్ కి చెందిన ఓ చిన్నారి వీడియో వైరల్ అయింది. ఆ పాపకు పొట్ట భాగంలో పూర్తిగా డెవలప్ కాని కాళ్లు, చేతులు ఉన్నాయి. ఆమెకి ఆపరేషన్ చేయించారు సోనూసూద్.
కరోనా సమయంలో ఎంతోమంది వలస కార్మికులకు, పేద ప్రజలకు సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. వలస కార్మికుల బాధలు చూడలేక తన సొంత డబ్బుతో వారిని స్వస్థలాలకు చేర్చారు. దేశవ్యాప్తంగా తన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కష్టమని ఎవరు ట్వీట్ చేసినా.. వెంటనే స్పందించేవారు. తన టీమ్ ని అలర్ట్ చేసి కష్టాల్లో ఉన్నవారిని ఆదుకున్నారు. అతడిని దేవుడిలా భావించారు ప్రజలు. సోనూ సేవను గుర్తించిన చాలా మంది దాతలు ముందుకొచ్చి సోనూసూద్ ఫౌండేషన్ కి విరాళాలు అందించారు.
ఇప్పటికీ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ఒంటి కాలితో స్కూల్ కి వెళ్తోన్న చిన్నారి వీడియో వైరల్ కాగా.. సోనూసూద్ టీమ్ వెంటనే స్పందించి ఆమెకి సాయం అందించింది. ఇక రీసెంట్ గా బీహార్ కి చెందిన ఓ చిన్నారి వీడియో వైరల్ అయింది. ఆ పాపకు పొట్ట భాగంలో పూర్తిగా డెవలప్ కాని కాళ్లు, చేతులు ఉన్నాయి. దీంతో ఆమె తల్లిదండ్రులు వాటిని తొలగించడానికి ఎన్నో హాస్పిటల్స్ కి తిరిగారు. కానీ పేదరికం కారణంగా ఆమెకి ఆపరేషన్ చేయించలేకపోయారు.
ఈ విషయం సోనూసూద్ వరకు చేరగా.. వెంటనే స్పందించిన ఆయన చిన్నారికి కొత్త జీవితం ఇవ్వాలనుకున్నారు. తన ఛారిటీ తరఫున ఆమెకి ఆపరేషన్ చేయించారు. దాదాపు ఏడు గంటలపాటు కష్టపడి ఆపరేషన్ చేశారు డాక్టర్స్. తమ చిన్నారిని ఆదుకున్న సోనూసూద్ కి తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు. చిన్నారితో పాటు ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సోనూసూద్.. 'చౌముఖి కుమారితో నా ప్రయాణం సక్సెస్ ఫుల్ గా జరిగింది' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Also Read: 'నీ జీవో గవర్నమెంట్ ఆర్డర్ - నా జీవో గాడ్స్ ఆర్డర్' బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలే!
Also Read: నయన్-విఘ్నేష్ ల మంచి మనసు, వేలాది పేద పిల్లలకు విందు భోజనం
मेरा और चौमुखी कुमारी का सफ़र कामयाब रहा ❤️🙏 pic.twitter.com/Fj4TY8cGMS
— sonu sood (@SonuSood) June 9, 2022
ఇక సోనూసూద్ సినిమాల విషయానికొస్తే.. తెలుగులో ఆయన చివరిగా 'ఆచార్య' సినిమాలో నటించారు. అలానే రీసెంట్ గా విడుదలైన 'పృథ్వీరాజ్' సినిమాలో కీలకపాత్ర పోషించారు సోనూసూద్.
View this post on Instagram