Sithara: శ్రీరామనవమి రోజున సితార కూచిపూడి డ్యాన్స్, మురిసిపోతున్న మహేష్ బాబు
సితార ఘట్టమనేని కూచిపూడి డ్యాన్స్ ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండవుతోంది.
![Sithara: శ్రీరామనవమి రోజున సితార కూచిపూడి డ్యాన్స్, మురిసిపోతున్న మహేష్ బాబు Sithara Ghattamaneni Kuchipudi dance on the day of Sri Ramanavami Sithara: శ్రీరామనవమి రోజున సితార కూచిపూడి డ్యాన్స్, మురిసిపోతున్న మహేష్ బాబు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/10/deb1d564a6e788d7eeb6ff4598086b95_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మహేష్ బాబు కూతురిగానే కాదు, సొంతంగానూ తనకంటూ గుర్తింపు సాధిస్తోంది సితార ఘట్టమనేని. సర్కారు వారి పాటలో ‘పెన్నీ’ సాంగ్ కు స్టెప్పులేసిన సితార వెస్ట్రన్ డ్యాన్సుతో అదరగొట్టింది. సినిమాలో కూడా ఆ పాటలో కనిపించబోతోంది ఈ చిన్నారి. ఇన్ స్టాగ్రామ్‌లో ఆమెకు రోజురోజుకి ఫాలోవర్లు పెరిగిపోతున్నారు.శ్రీరామనవమి సందర్భంగా కూచిపూడి నాట్యంతో ఆ శ్రీరాముడిని స్మరించింది సితార. ఆ వీడియోను ఇన్స్ స్టాలో పోస్టు చేసింది. అందులో రాముని స్తోత్రానికి చాలా చక్కగా నాట్యం చేసింది. ఆ వీడియోను మహేష్ బాబు కూడా తన ఖాతాలో పోస్టు చేశారు. కూతురి నాట్యాన్ని చూసి తండ్రిగా మురిసిపోయారు. ‘సీతా పాపా నువ్వు చాలా గర్వపడేలా చేశావు’అంటూ క్యాప్షన్ పెట్టారు. ‘శ్రీరామనవమి రోజున సితారా నాట్యం చేయడం చాలా ఆనందంగా ఉంది, ఆ స్తోత్రం ఆ రాముని గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఆమె గురువులైన అరుణ్ భిక్షు, మహతి భిక్షులకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు మహేష్ బాబు.
చాలా రోజుల్నించి సితారా అరుణ్ భిక్షు, మహతి భిక్షల దగ్గర నాట్యం నేర్చుకుంటోంది. వారితో డ్యాన్సు చేస్తున్న వీడియోలను అప్పుడప్పుడు తన ఖాతాలో పోస్టు చేస్తూ ఉంటుంది. డ్యాన్సులో సితార నాన్న మరిపిస్తుంది. వెస్ట్రన్, క్లాసికల్ డ్యాన్సులు రెండూ అదరగొడుతోంది. తల్లి నమ్రత కూతురు ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు ఇన్స్ స్టా లో షేర్ చేస్తూ ఉంటారు.
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)